News


ఈక్విటీ ఎంఎఫ్‌ పెట్టుబడులు @ రూ.10,795.81కోట్లు

Wednesday 11th March 2020
personal-finance_main1583914039.png-32408

వరుసగా మూడోనెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకి ఈ ఫిబ్రవరిలో రూ.10,795.81 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతూ రావడం వరసగా ఇది 3వ నెల. అలాగే గడిచిన 11నెలల్లో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో పెట్టుబడుల ప్రవాహం పెరిగినట్లు యాంఫీ గణాంకాలు చెబుతున్నాయి. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు కరోనా వ్యాప్తి భయాలు తోడవడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఈ ఫిబ్రవరి 17నెలల కనిష్టాన్ని దిగిరావడంతో పాటు ఏకంగా 6.76శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గడిచిన 11నెలల్లో పోలిస్తే ఫిబ్రవరిలో పెరగడం విశేషం. ఈక్విటీ పథకాల ప్రవాహాలు పెరగడటం ఆహ్వానించదగిన అంశం. మార్కెట్‌ పతనంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చూపుతున్నారని మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్  సీఈవో స్వరూప్ మొహంతి తెలిపారు.

తళుక్కుమన్న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు
ఈ ఫిబ్రవరిలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)ల్లోకి నికర ప్రవాహాలు పెరిగాయి. ఈ జనవరిలో ఈటీఎఫ్‌ల్లోకి కేవలం రూ.202 కోట్ల పెట్టుబడులు రాగా, ఫిబ్రవరిలో రూ.1,483 కోట్లుగా నమోదైనట్లు యాంఫీ గణాంకాలు తెలిపాయి. మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో ఇన్వెసర్టు రక్షణాత్మకంగా ఈటీఎఫ్‌ల కొనుగోళ్లకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్ షేర్ల కేటాయింపు గురించి తెలుసుకోండిలా!

Wednesday 11th March 2020

ఎస్‌బీ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకున్న వారు తమకు షేర్లు వచ్చాయా? లేదో  అనే విషయాన్ని లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా అనే లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు దారు తమకు షేర్లు కేటాయించారో లేదో తెలుసుకోవాలంటే ముందుగా లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇన్వెస్ట్‌ర్‌ సర్వీసెస్‌ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు అక్కడ సబ్‌ సెక్షన్‌లో పబ్లిక్‌ ఇష్యూ-ఈక్విటీస్‌లో ఈ వివరాలు

భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Wednesday 11th March 2020

వరుసగా మూడో రోజు ధరల కోత 9 నెలల కనిష్టానికి పెట్రోల్‌ లీటర్‌  2019 జనవరి స్థాయికి డీజిల్‌ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనంకావడంతో దేశీయంగా పెట్రో ఉత్పత్తుల రేట్లు దిగివస్తున్నాయి. గత రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గుతూ వస్తున్న ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తాజాగా మరోసారి ధరల్లో కోత పెట్టాయి. ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్‌ లీటర్‌ రూ. 2.69 శాతం తగ్గింది. దీంతో 70.29కు చేరింది. ఇక

Most from this category