స్వల్పకాలంలో సిప్ రాబడులు తగ్గినా మంచిదే.
By Sakshi

స్వల్పకాలానికి సిప్ మీద వచ్చే రాబడులు తగ్గితే మంచిదేనని ఐసీఐసీఐ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ పంకజ్ పాండే అంటున్నారు. సిప్‌లపై ప్రతికూల రాబడి వస్తున్నప్పుడు సిప్ పెట్టుబడి మొత్తాన్ని లేదా సిప్ల సంఖ్యను పెంచాలని పాండే తెలిపారు. ఎందుకంటే మార్కెట్ రికవరీ అయిన్పడు, మొత్తం పెట్టుబడిపై రాబడి ఎక్కువగా ఉంటుందని పాండే అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో ఏర్పడిన కరెక్షన్ కారణంగా సమర్థవంతమైన వ్యాపారాలు, స్థిరమైన నగదు ప్రవాహం కలిగి నాణ్యమైన కంపెనీలకు ఎంచుకునే అవకాశం ఇన్వెస్టర్లకు లభిస్తుంది. ఇది ధీర్ఘకాలంలో బలమైన ఆదాయాల రాబడులకు దారితీస్తుంది. సిప్ ద్వారా ఇటువంటి కంపెనీల షేర్లను కూడబెట్టుకునేందుకు ఇలాంటి అవకాశాన్ని ఇన్వెస్టర్లు వినియోగించాలని పాండే సూచించారు. ‘‘ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడిదారులు తమ సిప్‌లను కొనసాగాలని మేము సలహా ఇస్తున్నాము. ధీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు... ఒక వ్యక్తి తక్కువ ధరలతో ఎక్కువ కూడబెట్టుకునేందుకు సిప్ అత్యుత్తమంగా పనిచేస్తుంది. అందువల్ల, స్వల్ప కాలంలో తక్కువ సిప్ ఆదాయాలు స్వల్ప ధరల వద్ద ఎక్కువ ఆదాయాలు ఇస్తుంది. గతాన్ని చూసినప్పుడు కూడా సిప్ ఆదాయంపై రాబడి రేటును తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చిందనే అంశం అవగతమవుతోంది.
సూపర్ రిచ్ పన్ను విధింపు కారణం కాదు:-
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్ ఫోలియోలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సూపర్ రిచ్ పన్ను విధింపు కాదనేది తన అభిప్రాయమని పాండే అంటున్నారు. అంతర్జాతీయంగా వృద్ధి అవుట్‌లుక్ ఆందోళనలు, వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా రిస్క్-ఆఫ్ వాణిజ్యానికి దారితీయడంతో విదేశీ ఇన్వెస్టర్లు పలు ఈక్విటీ మార్కెట్లలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఏదైనప్పటికీ దేశ ఆర్థిక మంత్రి ఎఫ్‌పీఐలతో చర్చించేందుకు అంగీకారం తెలపడంతో రానున్న రోజుల్లో కొంత నష్టాన్ని నియంత్రివచ్చని పాండే అంటున్నారు.
You may be interested
ఏడాది కోసం ఐదు స్టాక్స్
Thursday 15th August 2019దీర్ఘకాలానికి మంచి పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకునేందుకు ఇప్పటి నుంచి వచ్చే మూడు నెలల కాలం అనువైనదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. దేశ ఈక్విటీ మార్కెట్లు గత ఏడాదిన్నరగా అస్థిరతల్లో ఉండడం, ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఏడాదికి పైగా బేరిష్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కనుక వీటిల్లో నాణ్యమైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రెండేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు వేచి చూసే
నష్టాలా మార్కెట్లో.. ర్యాలీ చేసిన స్టాకులు
Thursday 15th August 2019మార్కెట్లు ప్రస్తుతం బేర్ చేతుల్లో చిక్కుకున్నాయి. గత ఎనిమిదేళ్లలో మొదటి సారి మార్కెట్లు ప్రతికూల రాబడులను ఇవ్వడం చూశాం. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 1.4 శాతం నష్టపోయింది. అదే విధంగా నిఫ్టీ 50 3.5 శాతం కోల్పోపోయింది. యుఎస్-చైనా ట్రేడ్ వార్ ఆందోళనవలన అంతర్జాతీయ మందగమనం పెరిగింది. అంతేకాకుండా చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించుకోడానికి కారణమయ్యింది. ఐఎల్ అండ్