News


జేఎం ఫైనాన్షియల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ నుంచి ఎన్‌సీడీ ఇష్యూలు

Wednesday 7th August 2019
personal-finance_main1565116565.png-27583

జేఎం ఫైనాన్షియల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థలు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ ఇష్యూలను చేపట్టాయి. ఈ రెండూ మంగళవారం ఆరంభమయ్యాయి. ఇందులో ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 30న ముగుస్తుంది. జేఎం ఫైనాన్షియల్‌ ఎన్‌సీడీ ఇష్యూ మత్రం సెప్టెంబర్‌ 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు కూడా ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కావడం గమనార్హం. ఇందులో ఐఐఎఫ్‌ఎల్‌ 10.50 శాతం, జేఎం ఫైనాన్షియల్‌ 10.40 శాతం వరకు రాబడిని ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, పలు కార్పొరేట్‌ కంపెనీలు (ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఇప్పటికే ఎన్‌సీడీలపై చెల్లింపుల్లో విఫలం కావడంతో, డెట్‌​మార్కెట్‌ ఇప్పటికీ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కనుక ఈ తరుణంలో వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదేనా...? ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేసే ముందు ప్రశ్నించుకోవడం అవసరం.

 

ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీలో కనీస పెట్టుబడి రూ.10,000. ఈ సంస్థ ఎన్‌సీడీ ఇష్యూ ద్వారా కనీసం రూ.100 కోట్లు సమీకరించదలిచింది. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే రూ.900 కోట్ల వరకూ సమీకరించుకునే ఆప్షన్‌ను కూడా పెట్టుకుంది. సిరీస్‌-1 15 నెలలు, సిరీస్‌-3 39 నెలలు, సిరీస్‌-6 69 నెలల కాలంతో ఉంటాయి. వీటిపై వడ్డీ రేటు వరుసగా 10 శాతం, 9.85 శాతం, 10.5 శాతం చొప్పున ఉంటాయి. సిరీస్‌-2 39 నెలల కాలంతో ఉంటుంది. త్రైమాసికం వారీగా 9.5 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సిరీస్‌-4 39 నెలల కాలంతో వార్షికంగా 9.85 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది. సిరీస్‌-5 69 నెలల కాల వ్యవధితో 10 శాతం రేటుతో ఉంటుంది. వీటిల్లో సిరీస్‌ 1, 4 సెక్యూర్డ్‌. సిరీస్‌ 5, సిరీస్‌ 6 అన్‌సెక్యూర్డ్‌. క్రిసిల్‌, ఇక్రా రేటింగ్‌ ఏజెన్సీలు ఏఏ (స్టెబుల్‌) రేటింగ్‌ ఇవ్వగా, బ్రిక్‌వర్క్స్‌ మాత్రం ఏఏప్లస్‌ (స్టెబుల్‌) రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. 

 

జేఎం ఫైనాన్షియల్‌ ఎన్‌సీడీ కూడా రూ.100 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చింది. అధిక సబ్‌స్క్రిప్షన్‌ వస్తే రూ.400 కోట్ల వరకు సమీకరించుకునే ఆప్షన్‌తో ఉంది. కనీస పెట్టుబడి రూ.10,000. 38 నెలలు, 60 నెలలు, 84 నెలల కాల వ్యవధితో ఎన్‌సీడీలు అందుబాటులో ఉన్నాయి. 9.85 శాతం నుంచి 10.40 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఈ ఇష్యూకు క్రిసిల్‌, ఇక్రా సంస్థలు ఏఏ స్టెబుల్‌ రేటింగ్‌ ఇచ్చాయి. డీమ్యాట్‌ రూపంలో ఈ ఎన్‌సీడీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు లేదా బ్రోకర్‌కు దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు మాత్రమే వీటి జోలికి వెళ్లాలన్నది నిపుణుల సూచన. ‘‘సాధారణంగా ఏఏఏ రేటింగ్‌ కంటే తక్కువ కలిగిన ఎన్‌సీడీ ఇష్యూలను సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాలని మేము అయితే సూచించడం లేదు. అధిక రిస్క్‌ తీసుకోవాలనుకునే వారికి ఇప్పటికే సెకండరీ మార్కెట్లో లిస్ట్‌ అయి అధిక ఈల్డ్స్‌ ఆఫర్‌ చేస్తున్నవి ఉన్నాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసాని సూచించారు.You may be interested

వచ్చే బడ్జెట్‌ వరకు బేర్‌ మార్కెట్టే: అగర్వాల్‌

Wednesday 7th August 2019

వచ్చే బడ్జెట్‌ వరకు బేర్‌ మార్కెట్‌ కొనసాగుతుందన్న దానికి సిద్ధపడాలని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు సౌకర్యంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో బేర్‌ మార్కెట్‌ మరీ అంత తీవ్రంగా ఉండదని, అదే సమయంలో ఇది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో తన విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు.    మార్కెట్లో

లాభాల ముగింపు

Tuesday 6th August 2019

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు 277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ నష్టాల్ని చవిచూసిన దేశీయం ఈక్విటీ మార్కెట్‌ మం‍గళవారం లాభంతో ముగిసింది. మార్కెట్‌ నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో చౌకగా లభిస్తున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 277 పాయింట్లు పెరిగి 36,976.85 వద్ద, నిఫ్టీ 85.70 లాభపడి 10,948.30 వద్ద ముగిసిం‍ది. గత రాత్రి అమెరికా, ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్ల పతనంతో నేడు మార్కెట్‌ నష్టాలతో ప్రారంభైనన్పటికీ వెనువెంటనే

Most from this category