News


గత నెలలో ఫండ్స్‌ టాప్‌ షాపింగ్‌ వీటిల్లోనే..

Tuesday 14th January 2020
personal-finance_main1578941435.png-30897

యాక్టివ్‌ ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు తమ నిర్వహణలోని పథకాల పోర్ట్‌ఫోలియోను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పడికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటారు. కొత్తగా ఏ షేర్లను అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) కొనుగోలు చేశాయి, వేటిని విక్రయించాయనే వివరాలను నెలకు ఒకసారి తెలుసుకునే అవకాశం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఎందుకంటే పోర్ట్‌ఫోలియో వివరాలను నెలకు ఒకసారి వెల్లడించడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. ఈ ప్రకారం చూస్తే గత నెలలో టాప్‌-5 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కొనుగోలు చేసిన, విక్రయించిన ప్రధాన స్టాక్స్‌ వివరాలు ఇవి..

 

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌
వాటాలు పెంచుకున్నవి: లార్సెన్‌ అండ్‌ టుబ్రో, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌
వాటాలు తగ్గించుకున్నవి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
పూర్తి విక్రయాలు: బ్యాంకో ప్రొడక్ట్స్‌, ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌, టాటా ఎలెక్సి
కొత్త కొనుగోళ్లు: వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఎన్‌ఎండీసీ, అపోలో హాస్పిటల్స్‌

 

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌
వాటాలు పెంచుకున్నవి: క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, నెస్లే ఇండియా
పాక్షికంగా విక్రయించినవి: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, రిలయన్స్‌ఇండస్ట్రీస్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
పూర్తి విక్రయాలు: అశోక బిల్డ్‌కాన్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూనియన్‌ బ్యాంకు ఇఫ్‌ ఇండియా
కొత్త కొనుగోళ్లు: గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ ఫార్మా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎరిస్‌లైఫ్‌ సైన్సెస్‌

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌
వాటాలు పెంచుకున్నవి: ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, క్యాడిలా హెల్త్‌కేర్‌
వాటాలు తగ్గించుకున్నవి: ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇన్ఫోసిస్‌
పూర్తి విక్రయాలు: ఏబీబీ ఇండియా, అపార్‌ ఇండస్ట్రీస్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌
కొత్త కొనుగోళ్లు: త్రివేణి ఇంజనీరింగ్‌, ఇండియన్‌ మెటల్స్‌ అండ్‌ ఫెర్రో అలాయ్స్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌

 

నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌
వాటాలు పెంచుకున్నవి: భారతీ ఎయిర్‌టెల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు 
వాటాలు తగ్గించుకున్నవి: ఫెడరల్‌ మొగల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
పూర్తి విక్రయాలు: జాన్సన్‌ కంట్రోల్స్‌, జస్ట్‌ డయల్‌, సిండికేట్‌ బ్యాంకు
కొత్త కొనుగోళ్లు: చంబర్‌ ఫర్టిలైజర్స్‌, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌

 

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌
వాటాలు పెంచుకున్నవి: క్వెస్‌ కార్ప్‌, మారుతి సుజుకీ, ఆర్‌బీఎల్‌ బ్యాంకు
వాటాలు తగ్గించుకున్నవి: టాటా కెమికల్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు
పూర్తిగా విక్రయాలు: హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా
కొత్త కొనుగోళ్లు: నవభారత్‌ వెంచర్స్‌, ఇండియన్‌ బ్యాంకు, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా. 



You may be interested

ఇవి వ్యాల్యూ స్టాక్స్‌..!

Tuesday 14th January 2020

బ్లూచిప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్లు చాలా ఖరీదైన స్థాయికి చేరగా, మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో సత్తా ఉన్న కంపెనీల షేర్ల ధరలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. అదే విధంగా లార్జ్‌క్యాప్‌లోనూ కొన్ని స్టాక్స్‌ ర్యాలీలో పాల్గొనని కారణంగా ఎంతో ఆకర్షణీయ ధరల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు వ్యాల్యూ స్టాక్స్‌ (కంపెనీల వాస్తవ విలువ కంటే తక్కువకు ట్రేడయ్యేవి) వేటలో మునిగిపోయారు. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా

యస్‌బ్యాంక్‌ షేర్లను కొన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌

Monday 13th January 2020

దేశీయ రెండో అతిపెద్ద అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యస్‌బ్యాంక్‌ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. యస్‌బ్యాంక్‌కు చెందిన 10.57లక్షల ఈక్విటీ షేర్లను డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇంధన, ఫార్మా, స్టాఫింగ్‌, ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకు షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపింది. టెలికాం, అటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లను విక్రయించింది. మొత్తంగా ఆయారంగాలకు చెందిన సుమారు 350 కంపెనీల్లో వాటాలు పెంచుకోగా, 145

Most from this category