News


ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు తగ్గిన పెట్టుబడులు

Monday 17th February 2020
personal-finance_main1581909905.png-31841

డిసెంబర్‌ క్వార్టర్‌లో 12,000 కోట్ల రాక
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్‌ త్రైమాసికంలో నెమ్మదించింది. మార్నింగ్‌స్టార్‌ నివేదిక ప్రకారం.. 2019 జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.23,874 కోట్ల పెట్టుబడులు రాగా, 2019 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.11,837 కోట్లుగానే ఉన్నాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్‌ క్వార్టర్‌లో అన్ని రకాల ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టబడుల రాక తగ్గింది. ఇక 2019 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.17,500 కోట్లుగా ఉన్నాయి. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాలతో పోలిస్తే డిసెంబర్‌ క్వార్టర్‌లో పెట్టుబడులు తగ్గాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోల్లోని స్టాక్స్‌ వ్యాల్యూషన్లు అధిక స్థాయికి చేరడం, జీడీపీ క్రమంగా తగ్గుతుండడం, కొన్ని పెద్ద కంపెనీల వరకే ర్యాలీ పరిమితం కావడం పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడానికి కారణమై ఉంటుందని మార్నింగ్‌స్టార్‌ సంస్థ పేర్కొంది. ఇక డిసెంబర్‌ త్రైమాసికంలో ఈక్విటీ పెట్టుబడుల్లో 30 శాతం లార్జ్‌క్యాప్‌ పథకాల్లోకి వచ్చాయి. అయినప్పటికీ అంతక్రితం త్రైమాసికంలో వచ్చిన రూ.6,000 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా లార్జ్‌, మిడ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి పెట్టుబడుల రాక అధికంగా తగ్గింది. రూ.3,038 కోట్ల నుంచి రూ.1,360 కోట్లకు పరిమితమైంది. మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి పెట్టుబడుల రాక రూ.3,738 కోట్ల నుంచి రూ.2,688 కోట్లకు తగ్గింది. 



You may be interested

స్వల్ప లాభం మొదలైన మార్కెట్‌

Monday 17th February 2020

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 41,324.04 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 12,131.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధి మరింత ఉధృతం కావడంతో పాటు, కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని ఐఎమ్‌ఎఫ్‌ ఎండీ అభిప్రాయపడంతో నేడు ఆసియా మార్కెట్లు మూడువారాల

నేడు ఓపెనింగ్‌ అక్కడక్కడే?!

Monday 17th February 2020

నామమాత్ర లాభంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ   వారాంతాన యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో స్వల్పంగా 5 పాయింట్లు పుంజుకుని 12,134 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,129 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఏజీఆర్‌ బకాయిలను చెల్లించేందుకు

Most from this category