News


ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కే ఫండ్స్‌ మొగ్గు

Friday 26th July 2019
personal-finance_main1564163862.png-27343

మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు జూన్‌ త్రైమాసికంలో లార్జ్‌క్యాప్‌లో ఐటీ స్టాక్స్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. అదే సమయంలో లార్జ్‌క్యాప్‌లోనే ఇంధన కంపెనీలకు మాత్రం దూరంగా ఉన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ చేసిన కొనుగోళ్లను పరిశీలిస్తే... 

 

టీసీఎస్‌ షేరు మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎక్కువ నచ్చిన షేరుగా నిలిచింది. రూ.866 కోట్ల విలువైన షేర్లను ఫండ్స్‌ జూన్‌లో కొన్నట్టు మార్నింగ్‌ స్టార్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. టీసీఎస్‌ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేర్లకు ఫండ్స్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌  ఐటీ పట్ల తక్కువ ప్రాధాన్యంతో ఉన్నాయని, అయితే, టీసీఎస్‌ వంటి షేర్ల కొనుగోళ్లకు మాత్రం మొగ్గు చూపించినట్టు మార్నింగ్‌ స్టార్‌ ఇండియా అడ్వైజర్‌ కౌస్తభ్‌ బేల్‌పుర్కార్‌ తెలిపారు. టీసీఎస్‌ దేశంలోనే అగ్రస్థాయి ఐటీ కంపెనీ అని తెలిసిందే. అయితే, జూన్‌ త్రైమాసికం ఫలితాల్లో మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయిన విషయం గమనార్హం. వచ్చే త్రైమాసికం వరకు ఈ స్టాక్‌ స్తబ్దుగానే ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్టు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 

 

సూచీలో​ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఉందన్నారు బేల్‌పుర్కార్‌. ‘‘కార్పొరేట్‌ బ్యాంకుల పట్ల గత ఏడాది కాలంగా కొనుగోళ్లకు ఆసక్తి నెలకొంది. హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు మంచి నాణ్యమైన షేర్లు. వీటిల్లోకి పెట్టుబడులు తరలి వస్తూనే ఉన్నాయి’’అని బేల్‌పుర్కార్‌ తెలిపారు. ‘‘నిఫ్టీ-50లో ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు మూడింట ఒకవంతు వెయిటేజీ ఉంది. ఫైనాన్షియల్‌ విభాగంలో ప్రైవేటు బ్యాంకులను పరిశీలించొచ్చు’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపేన్‌ సేత్‌ తెలిపారు. లార్జ్‌క్యాప్‌ విభాగంలో కోటక్‌ మహింద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో ఫండ్స్‌ కొనుగోళ్లు చేశాయి. ఫండ్స్‌ అమ్మకాలను పరిశీలిస్తే... టాటా స్టీల్‌ ఎక్కువ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నది. ఈ కంపెనీలో రూ.655 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అలాగే, లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఫండ్ష్‌ ఎక్కువగా అమ్మకాలు సాగించిన వాటిల్లో పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, యూపీఎల్‌ సైతం ఉన్నాయి. You may be interested

మార్కెట్లో సముద్ర మథనం: ధీరజ్‌రెల్లి

Friday 26th July 2019

క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల పాత్ర మన దేశంలో గతంలో ఎప్పుడూ ప్రశ్నార్థకం కాలేదు. కంపెనీల భారీ డిఫాల్ట్‌ల నేపథ్యంలో నాలుగు అతిపెద్ద ఆడిటర్లు నియంత్రణ సంస్థల పరిశీలనలోకి వచ్చారు. దీంతో ‘‘మీరు ఎవరిని విశ్వసిస్తారు’’ అని ప్రశ్నించారు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో ధీరజ్‌రెల్లి. మార్కెట్లలో ఓ తరహా సముద్ర మథనం జరుగుతోందని, దీంతో మంచి అన్నది చెడు నుంచి వేరు పడుతుందన్నారు. ‘‘మిలియన్‌ డాలర్ల ప్రశ్నల్లా..?. అంతిమంగా ఎవరు

నష్టాల నుంచి లాభాల్లోకి పీఎన్‌బీ

Friday 26th July 2019

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జూన్‌ క్యార్టర్‌ ఫలితాలలో రూ. 1,018.63 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.940 కోట్ల నికర నష్టాలను ప్రకటించిన ఈ బ్యాంకు, ఇప్పుడు లాభాల్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ కేటాయింపులు మాత్రం 65 శాతం(ఏడాది నుంచి ఏడాదికి) తగ్గిపోవడం గమనర్హం. జూన్‌ త్రైమాసికంలో రూ.350 కోట్ల నికర నష్టాలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.    వార్షిక ప్రాతిపదికన

Most from this category