News


100 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు

Wednesday 28th August 2019
personal-finance_main1566967575.png-28067

  • వచ్చే పదేళ్లలో చేరుకోవాలని యాంఫి లక్ష్యం
  • ప్రస్తుతం ఫండ్స్‌ నిర్వహణలో  రూ.25 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ తన నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇప్పుడున్న రూ.25 లక్షల కోట్ల నుంచి 100 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యం విధించుకుంది. అలాగే, ఇన్వెస్టర్ల సంఖ్యను 2 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుకోవాలన్నది పరిశ్రమ లక్ష్యమని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫి బీసీజీ విజన్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది. టాప్‌ 30 పట్టణాలు కాకుండా ఇతర పట్టణాల్లో(బీ30)నూ ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచుకోవాలని పరిశ్రమ భావిస్తోంది. పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకునేందుకు గాను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించిన బ్యాంకులు, పోస్టాఫీసుల సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది. అలాగే, డైరెక్ట్‌, డిజిటల్‌ చానళ్లను కూడా బలోపేతం చేసుకోవడం, సులభ పొదుపు పరిష్కారాలను ఆఫర్‌ చేయడం ద్వారా మరో 8 కోట్ల ఇన్వెస్టర్లను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడుల ఆస్తులను రూ.100లక్షల కోట్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు యాంఫీ తెలిపింది. ముంబైలో జరిగిన యాంఫి సమావేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఆవిష్కరించారు. 
మూడేళ్లలో భారీగా సిప్‌ పెట్టుబడులు
యాంఫీ-క్రిసిల్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ ప్రకారం.. 2016 ఏప్రిల్‌ నుంచి 2019 జూలై వరకు సిప్‌ రూపంలో మ్యూచువల్‌ పండ్స్‌ పథకాల్లోకి రూ.2.30 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావడం పరిశ్రమ ఆస్తుల వృద్ధికి ఎక్కువగా తోడ్పడింది. సిప్‌ ఖాతాల సంఖ్య కూడా ఈ కాలంలో కోటి నుంచి 2.73 కోట్లకు పెరిగింది. 2016-17లో ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన సిప్‌ పెట్టుబడులు రూ.44,000 కోట్లు కాగా, 2018-19 నాటికి రూ.93,000 కోట్లకు చేరింది. ‘‘భారతీయులు భౌతిక పొదుపు నుంచి ఫైనాన్షియల్‌ పొదుపు సాధనాల వైపు మళ్లుతున్నారు. అయితే, సంప్రదాయ సాధనాల నుంచి ద్రవ్యల్బణాన్ని అధిగమించి రాబడులను ఇచ్చే ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు ఇన్వెస్టర్లు మారడం అన్నది నిదానంగా ఉంది’’ అని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ పేర్కొన్నారు. ఇక 2014 మార్చి నుంచి 2019 జూన్‌ వరకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా 4.42 కోట్ల ఫోలియోలు పెరిగాయి. ఎక్కువగా రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐలవే ఇందులో ఉన్నాయి. You may be interested

రాష్ట్రాల్లో పన్నులు అధికం

Wednesday 28th August 2019

కార్ల ధరలపై ప్రభావం  వృద్ధి విషయంలో రాష్ట్రాలది పెద్ద బాధ్యత మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ భార్గవ వెల్లడి  ముంబై: రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయని, ఫలితంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పెట్రోల్‌పై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను బాగా పెంచాయని, ఫలితంగా కార్ల ధరలపై రాష్ట్రాల పన్ను భారం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

పన్ను వసూళ్లలో దూకుడొద్దు

Wednesday 28th August 2019

పన్ను అధికారులకు ఆర్థిక మంత్రి సూచన పుణె: పన్ను వసూళ్ల విషయంలో నిగ్రహం పాటించాలని, దూకుడుగా వ్యవహరించరాదని పన్ను అధికారులను కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పుణెలో మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి, కస్టమ్స్‌, ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యాపారాలు ఉద్యోగాలను, సంపదను సృష్టిస్తాయి. కనుక పన్ను వసూలు చేయడమనే తమ ఉద్యోగ విధుల

Most from this category