News


మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 2% తగ్గుదల

Thursday 9th January 2020
personal-finance_main1578541632.png-30781

  • గతనెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ
  • రూ. 26.54 లక్షల కోట్లకు మొత్తం నిర్వహణ ఆస్తి 
  • రుణ-ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలు

న్యూఢిల్లీ: డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ‍ప్రకారం.. గత నెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ చోటుచేసుకుంది. దీంతో ఈ పరిశ్రమలోని 44 సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2 శాతం తగ్గి రూ. 26.54 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇక ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యల నేపథ్యంలో గతేడాది నవంబర్‌ నెల్లో మొత్తం నిర్వహణ ఆస్తి గరిష్టంగా రూ. 27.04 లక్షల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే కాగా, ఆ సమయంలో భారీగా ఇన్‌ఫ్లో పెరిగిన రుణ-ఆధారిత పథకాల్లోనే గత నెల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ స్కీంల్లోని లిక్విడ్‌ ఫండ్స్‌, నగదు విభాగాల్లోని ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌, కమర్షియల్‌ పేపర్లు వంటి స్వల్పకాలిక సాధనాల నుంచి రూ. 71,000 కోట్ల మేర ఉపసంహరణ చోటుచేసుకుంది. వీటితో పాటు ఒక రోజులో మెచ్యూర్‌ అయ్యే ఓవర్‌ నైట్‌ ఫండ్స్‌లో రూ. 8,800 కోట్లు వెనక్కువెళ్లాయి. అయితే, అధిక రేటింగ్‌ కలిగిన బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్స్‌లో రూ. 4,770 కోట్లు చేరాయి. 

ఏడాది లోపు మెచ్యూరిటీ స్కీంలలో అమ్మకాలు...
కాల వ్యవధి సవరించిండానికి వీలున్నటువంటి, ఏడాది లోపు సగటు మెచ్యూరిటీ ఉన్న ఫిక్సిడ్‌ ఇన్‌కమ్‌ విభాగాల్లో అవుట్‌ ఫ్లో నమోదైందని మార్నింగ్‌స్టార్‌ ఇన్వె‌స్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (మేనేజర్‌ రీసెర్చ్‌) హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. అయితే, ఇది పరిశ్రమ ముందుగానే అంచనావేసిన పరిణామమే అని చెప్పారు. గత నెల్లో అమ్మకాల వెల్లువకు కారణం రుణ-ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలే అని పైసా బ‌జార్‌ డాట్‌ కామ్ కో-ఫౌండ‌ర్‌ అండ్‌ సీఈఓ న‌వీన్ కుక్రేజా విశ్లేషించారు. 

ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో జోరు...
గత నెలలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలను తిరగరాసుకుంటూ దూసుకెళ్లిన నేపథ్యంలో ఈక్విటీ ఓరియంటెడ్‌ ఫండ్స్‌ రూ. 4,432 కోట్ల ఇన్‌ఫ్లోను ఆకర్షించాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు నిరాశాజనకంగా ఉండడంతో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి ప్రవాహం పెరిగిందని కుక్రేజా విశ్లేషించారు. 

సిప్‌ సూపర్‌...
డిసెంబర్‌లో క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల (సిప్‌) ద్వారా చేరిన పెట్టుబడులు రూ. 8,518 కోట్లు కాగా, దీంతో సిప్‌ అసెట్‌ బేస్‌ ఏకంగా జీవితకాల గరిష్టానికి చేరింది. గతనెల చివరినాటికి అసెట్‌ బేస్‌ రూ. 3.17 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్‌ ఇన్వెస్టర్లలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో విశ్వాసం పెరిగినందున సిప్‌ పెట్టుబడులు జోరందుకుంటున్నాయని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ ఎస్ వెంకటేష్ అన్నారు. ఇక గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ రూ. 27 కోట్లను ఆకర్షించాయి. You may be interested

సెన్సెక్స్‌ 400, నిఫ్టీ 128 పాయింట్లు హైజంప్‌

Thursday 9th January 2020

ఒక్కసారిగా అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు చల్లబడటంతో గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 401 పాయింట్లు జంప్‌చేసి 41,219 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 128 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,153 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగబోమని, ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత రాత్రి చేసిన ప్రకటనతో అమెరికాలో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు కొత్త

ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌ షేర్లు

Thursday 9th January 2020

టాటా మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చౌక వేల్యుయేషన్స్‌కు లభిస్తున్న మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు .. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌ తెలిపారు. గతంలో భారీ ప్రీమియం పలికిన ఈ స్టాక్స్‌.. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే 10 శాతం పైగా డిస్కౌంట్‌తో లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 10 శాతం పైగా నమోదు కావొచ్చని, జూన్‌

Most from this category