News


మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 4 శాతం పెరుగుదల

Tuesday 10th September 2019
personal-finance_main1568093537.png-28285

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోల్చితే 4 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ, లిక్విడ్‌ స్కీమ్‌లలో పెట్టుబడుల వరద పెరిగిన కారణంగా ఈమేరకు వృద్ధి పెరిగిందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వివరించింది. గతనెల్లో రూ.1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ మొత్తంలో లిక్విడ్‌ ఫండ్స్‌ వాటా రూ.79,000 కోట్లు కాగా, ఓపెన్-ఎండ్ ఈక్విటీ పథకాల్లోకి రూ.9,152 కోట్లు చేరినట్లు తెలిపింది. అయితే, క్లోజ్-ఎండ్ ఈక్విటీ పథకాల నుంచి రూ.62 కోట్ల ఉపసంహరణ నమోదైంది. దీంతో గతనెల నికరంగా ఈక్విటీ ఇన్‌ఫ్లో రూ.9,090 కోట్లుగా నిలిచింది. 



You may be interested

అధ్వాన్నంగా ఆగస్టులో ఆటో అమ్మకాలు

Tuesday 10th September 2019

- అన్ని విభాగాల్లోనూ క్షీణతే - 1997-98 తరువాత అత్యంత తక్కువ సేల్స్ న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్‌ 1997-98 నుంచి

లినెన్‌ రిటైల్‌లోకి ‘లినెన్‌ హౌజ్‌’

Tuesday 10th September 2019

ఏడాదిలో 100 స్టోర్ల ఏర్పాటు విస్తరణకు రూ.50 కోట్లు వ్యయం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- లినెన్‌ వస్త్రాలు, దుస్తుల విక్రయంలోకి కొత్త బ్రాండ్‌ లినెన్‌ హౌజ్‌ ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దసరాలోగా 10 స్టోర్లను తెరుస్తున్నట్టు లినెన్‌ హౌజ్‌ను ప్రమోట్‌ చేస్తున్న కాకతీయ ఫ్యాబ్రిక్స్‌ డైరెక్టర్‌ వొజ్జా తిరుపతి రావు సోమవారం తెలిపారు. బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా డైరెక్టర్లు అవిరినేని శ్రీకాంత్‌, త్రిపురనేని విజయ్‌, ఉప్పలపాటి కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

Most from this category