News


రూ.27.85 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Tuesday 11th February 2020
personal-finance_main1581396523.png-31683

  • జనవరిలో రూ.1.2 లక్షల కోట్ల రాక
  • అధిక శాతం పెట్టుబడులు డెట్‌ పథకాల్లోకే
  • డెట్‌ ఫండ్స్‌లోకి రూ.1.09 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పరిశ్రమ (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తులు జనవరిలో కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. ఫండ్స్‌ ఆస్తులు రూ.27.85 లక్షల కోట్లకు చేరాయి. 44 ఏఎంసీలతో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశమ నిర్వహణలోని ఆస్తులు 2019 డిసెంబర్‌ చివరికి రూ.26.54 లక్షల కోట్లుగా ఉంటే, జనవరి చివరికి 5 శాతం పెరిగి రూ.27.85 లక్షల కోట్లకు చేరినట్టు యాంఫి విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 జనవరి చివరికి ఉన్న రూ.23.37 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాది కాలంలో 18 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. 
డెట్‌ పథకాలకే మొగ్గు...
గత డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల నుంచి నికరంగా రూ.61,810 కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెల జనవరిలో తిరిగి రూ.1.2 లక్షల కోట్లు ప్రవేశించాయి. డెట్‌ పథకాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించాయి. ఏకంగా రూ.1.09 లక్షల కోట్లు డెట్‌ పథకాల్లోకే వెళ్లడం గమనార్హం. డెట్‌ విభాగంలోనూ లిక్విడ్‌ ఫండ్స్‌ కేటగిరీ అత్యధికంగా రూ.59,683 కోట్లను ఆకర్షించింది. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లోకి రూ.22,652 కోట్లు వచ్చాయి. సాధారణంగా ఈ రెండు విభాగాల్లోకి వచ్చే నిధులు స్థిరంగా ఉండవు. అతి స్వల్ప కాలం కోసం ఇనిస్టిట్యూషన్లు ప్రధానంగా వీటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పరిమితంగానే ఉంటుంటాయి.
ఈక్విటీల్లోనూ సానుకూలత...
పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లోకి జనవరిలో నికరంగా రూ.7,877 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో క్లోజ్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల నుంచి రూ.330 కోట్లకు బయటకు వెళ్లిపోయాయి. దీంతో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.7,547 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.4,432 కోట్లుగా ఉన్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకీ రూ.202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్‌లో వచ్చిన రూ.7 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. అంతేకాదు గత ఆగస్ట్‌ తర్వాత గరిష్ట స్థాయిలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి జనవరిలోనే పెట్టుబడులు వచ్చాయి. 

కొనసాగుతున్న సిప్‌ హవా...
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) మార్గంలో ఇన్వెస్టర్లు జనవరిలో రూ.8,532 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. దీంతో ఈక్విటీ పథకాల్లోని మొత్తం సిప్‌ పెట్టుబడులు రూ.3.25 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్‌లో సిప్‌ మార్గంలో వచ్చిన పెట్టుబడులు రూ.8,519 కోట్లతో పోలిస్తే జనవరిలో రూ.14 కోట్లు పెరిగాయి. సిప్‌ రూపంలో పెట్టుబడులకు నమోదైన ఫోలియోల సంఖ్య 3.04 కోట్లకు చేరింది. దీర్ఘకాల లక్ష్యాల కోసం సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసే ధోరణి పెరుగుతున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘అన్ని రకాల ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల్లోకి సానుకూల పెట్టుబడుల ప్రవాహం, రిటైల్‌ ఇన్వెస్టర్ల సిప్‌ పెట్టుబడుల వృద్ధితో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయి. ఇదే విధమైన సానుకూల వృద్ధి ఇక ముందూ కొనసాగుతుందని అంచనాతో ఉన్నాం. వృద్ధి కారక బడ్జెట్‌, ఆర్‌బీఐ విధానం ఫలితంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం వృద్ధి చెందుతుంది’’ అని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. అధిక పన్ను శ్లాబులో ఉన్న వారు ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగిస్తారని, దీంతో ఈ పథకాలకు డిమాండ్‌ తగ్గబోదన్నారు. 



You may be interested

నేటివార్తల్లోని షేర్లు

Tuesday 11th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ):  అమెరికాకు చెందిన టిల్డన్‌ పార్క్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌లో కొంత మేర వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐకి తెలిపింది. కాగా ఎల్‌వీబీ పెట్టుబడులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌ వైర్‌ రోప్స్‌:  మోతీలాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకులు రామ్‌దేవ్‌ అగర్వాల్‌, మోతీలాల్‌ ఆస్వాల్‌లు  9.42 లక్షల విలువైన  షేర్లను కొనుగోలు చేయడంతో భారతీ వైర్‌ రోప్స్‌ షేర్లు 26

రేటింగ్‌ ఏజెన్సీలకు పెనాల్టీ పెంచే యోచనలో సెబీ

Tuesday 11th February 2020

న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీడీలకు రేటింగ్‌ల కేటాయింపులో లోపాలకు గాను రేటింగ్‌ ఏజెన్సీలకు పెనాల్టీలను పెంచే యోచనలో సెబీ ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2019 డిసెంబర్‌లో సెబీ.. ఇక్రా, కేర్‌ రేటింగ్స్‌, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌లకు ఒక్కో సంస్థకు రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. కానీ, ఆ తర్వాత ఈ సంస్థలకు సంబంధించి తీవ్రమైన అభ్యంతరాలను సెబీ గుర్తించింది. రేటింగ్‌ ఏజెన్సీల వైఫల్యాల స్థాయిలో తాను విధించిన

Most from this category