News


2019లో తగ్గిన ఎన్‌ఎఫ్‌వోలు

Sunday 3rd November 2019
personal-finance_main1572805336.png-29311

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 125 మ్యూచువల్‌ ఫండ్‌ నూతన పథకాల ఆవిష్కరణ కోసం (ఎన్‌ఎఫ్‌వో) సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో కొన్నింటికి సెబీ అనుమతివ్వడంతో అవి నిధుల సమీకరణ కూడా చేపట్టాయి. కానీ, క్రితం ఏడాది 2018లో 211 నూతన పథకాల కోసం దరఖాస్తులు రాగా, వాటితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మార్కెట్లో నిధుల లభ్యత తక్కువగా ఉండడం, ప్రతికూల సెంటిమెంట్‌ న్యూ ఫండ్‌ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) తగ్గడానికి కారణంగా ఏఎంసీలు పేర్కొన్నాయి. 

 

ఏఎంసీలు సెబీ వద్ద దాఖలు చేసిన ఎన్‌ఎఫ్‌వో దరఖాస్తుల్లో... ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు, ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), రిటైర్మెంట్‌, సస్టెయినబుల్‌ ఈక్విటీ ఫండ్‌, బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌కు సంబంధించినవి ఉన్నాయి. ఆసక్తికరం ఏమిటంటే చాలా ఏఎంసీలు ఇండెక్స్‌ ఫండ్స్‌, గ్లోబల్‌ ఫండ్స్‌ ప్రారంభించాలనుకుంటున్నాయి. ఎందుకంటే గడిచిన ఏడాదిన్నర కాలంలో నిఫ్టీ-50 సూచీ 11 శాతానికిపైగా రాబడులను ఇవ్వగా, ఇదే కాలంలో నిఫ్టీలోనే సగానికి పైగా స్టాక్స్‌ ప్రతికూల రాబడులను ఇచ్చాయి. దీంతో విడిగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే పథకాలతో పోలిస్తే, ప్రధాన ఇండెక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు మెరుగుపడడం, పెట్టుబడుల్లో రిస్క్‌ తగ్గించుకునేందుకు, వైవిధ్యం కోసం విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుండడం ఏఎంసీలు ఈ దిశగా పథకాల కోసం ఆలోచన చేయడానికి కారణం. 

 

‘‘మార్కెట్లు మంచిగా ఉన్న సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు అధికంగా వచ్చాయి. కానీ, సెంటిమెంట్‌ బాగా లేనప్పుడు తగ్గడం అన్నది గతంలోనూ చూశాం’’ అని శామ్కో మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీ హెడ్‌ ఓంకారేశ్వర్‌ సింగ్‌ తెలిపారు. గత ఏడాదిన్నరలో కొన్ని పథకాలను మినహాయిస్తే, చాలా ఈక్విటీ ఫండ్స్‌.. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ పథకాలు ప్రతికూల పనితీరుతో ఉన్నాయి. డెట్‌ ఫండ్స్‌కు సంబంధించి కూడా ఎన్నో చెడు వార్తలను వినాల్సి వచ్చింది. అందుకే ఎన్‌ఎఫ్‌వోలు తక్కువగా ఉన్నాయి’’ అని సింగ్‌ వివరించారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, ఎస్సెల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థలు డెట్‌ పేపర్ల చెల్లింపుల్లో విఫలం చెందడంతో డెట్‌ విభాగంలో పెట్టుబడుల ఉపసంహరణ పెరిగింది. యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌, ఎడెల్‌వీజ్‌, నిప్పన్‌ ఇండియా తదితర ఏఎంసీల నుంచి ఎన్‌ఎఫ్‌వోలకు దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిల్లో యాస్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘యాక్సిస్‌ గ్రేటర్‌ చైనా ఈక్విటీ ఫండ్‌’ కోసం దరఖాస్తు చేయడం గమనార్హం. 



You may be interested

ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్‌..!

Monday 4th November 2019

హెచ్‌డీఎఫ్‌సి, టైటాన్, పీఎన్‌బీ, డాబర్, టెక్ మహీంద్రా,  టాటా స్టీల్, సన్ ఫార్మా, సిప్లా ఫలితాలు ఈవారంలోనే.. స్థూల ఆర్థికాంశాలపై మార్కెట్‌ దృష్టి ఒడిదుడుకులకు ఆస్కారం: సామ్కో సెక్యూరిటీస్‌ ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల వెల్లడి, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఈవారంలో వెల్లడికానున్న పలు

స్మాల్‌ క్యాప్స్‌ ర్యాలీ..!

Sunday 3rd November 2019

గత వారం మార్కెట్లకు మంచి సానుకూలం. సెన్సెక్స్‌ 40,392.22 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. దీపావళి నుంచి మార్కెట్లలో లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్లపై బుల్స్‌ పట్టు బలంగా ఉంది. కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు అంచనాలకు కొంచెం ఎగువనే ఉండడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో రానున్న త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలకు అవకాశం ఉండడం, ఆర్థిక రంగ రికవరీతో కంపెనీలు మరింత ప్రయోజనం పొందగలవన్న అంచనాలు తాజా

Most from this category