News


మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా 5.5 లక్షల ఫోలియోలు

Tuesday 11th June 2019
Markets_main1560275692.png-26232

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మే నెలలోనూ నూతన పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) పెరుగుదలను నమోదు చేశాయి. మే నెలలో ఏఎంసీలు 5.54 లక్షల నూతన ఫోలియోలను ప్రారంభించాయి. దీంతో అన్ని ఏఎంసీల పరిధిలో ఫోలియోల సంఖ్య 8.32 లక్షలకు పెరిగినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

 

క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఖాతాలు తగ్గడం గమనించాల్సిన అంశం. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు (జీ గ్రూపు, అడాగ్‌ గ్రూపు, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు) సమస్యల్లో చిక్కుకోవడం, ఈ సంస్థల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు, ఇన్వెస్టర్ల చెల్లింపులను వాయిదా వేయడం తెలిసిందే. ఈ ప్రభావం తాజా పెట్టుబడుల రాకపై చూపించినట్టు గణంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. అయితే, లిక్విడ్‌ ఫం‍డ్స్‌కు మాత్రం మంచి ఆదరణ లభించింది. లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరిగాయి. యాంఫి గణాంకాల ప్రకారం మే నెలలో లిక్విడ్‌ ఫండ్స్‌ విభాగంలోనే కొత్తగా 41,927 ఖాతాలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ విభాగంలో 15,404 ఫోలియోలు జతయ్యాయి. లిక్విడ్‌ ఫండ్స్‌లో ప్రధానంగా కంపెనీలు తమ మిగులు నిధులను, స్వల్పకాల అవసరాల కోసం ఉద్దేశించిన నిధులను పరిమిత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. 

 

ఇన్‌కమ్‌/డెట్‌ కేటగిరీల్లో క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌లోనే అత్యధికంగా 11,800 ఫోలియోలు మే నెలలో తగ్గాయి. పలు కంపెనీలు చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్వెస్టర్లు క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విభాగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే కారణం. ఏప్రిల్‌ నెలలో క్రిడెట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి రూ.1,253 కోట్ల మేర పెట్టుబడులు బయటకు వెళ్లిపోగా, మే నెలలో రూ.4,156 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ అన్నవి 65 శాతం నిధులను ఏఏ మైనస్‌ అంతకంటే తక్కువ రేటింగ్‌ కలిగిన డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. వీటిల్లో రాబడులకు ఎంత ఎక్కువ అవకాశం ఉంటుందో, పరిస్థితులు ప్రతికూలంగా మారితే నష్టాలకూ అంతే చాన్స్‌ ఉంటుంది. గడిచిన 10 నెలల కాలంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీలు చెల్లింపుల్లో విఫలం కాగా, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, అడాగ్‌ గ్రూపు కంపెనీల రేటింగ్‌లు డౌన్‌గ్రేడ్‌ అయ్యాయి. ఈక్విటీ విభాగంలో 16,000 ఫోలియోలు తగ్గిపోయాయి. మే 23 ఎన్నికల ఫలితాలపై ఉన్న అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లనూ అస్థిరతంగా నడిపించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు ఫండ్‌ మేనేజర్లు పేర్కొంటున్నారు. మే నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.77,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫండ్స్‌ నిర్వహణలోని అన్ని రకాల ఆస్తుల విలువ రూ.25.43 లక్షల కోట్లుగా ఉంది. You may be interested

ఏ మ్యూచువల్‌ ఫండ్‌ ఏ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసింది...?

Tuesday 11th June 2019

దేశీయంగా అగ్రస్థాయి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) మే నెలలో కొనుగోళ్ల, అమ్మకాలను పరిశీలిస్తే కాంట్రా బెట్స్‌ పట్ల ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చేయడంతో రాజకీయ స్థిరత్వం ఏర్పడడం ఏఎంసీల ఆలోచన మారిందనేందుకు నిదర్శనం. బాగా పడిపోయిన టెలికం, విద్యుత్‌, ఫార్మా, మెటల్స్‌ షేర్లు ర్యాలీ చేస్తాయని ఏఎంసీలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ఆటో యాన్సిలరీ, బ్యాంకు స్టాక్స్‌ సైతం ఏఎంసీలను ఆకర్షించాయి. మే నెల నాటికి

మే నెలలో తగ్గిన వాహన విక్రయాలు

Tuesday 11th June 2019

 గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో వాహనాల విక్రయాలు  తగ్గాయని  సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చర్‌( సియామ్‌) మంగళవారం తెలిపింది.  ప్రయాణికుల వాహనాల దేశీయ విక్రయాలు 20.55శాతం తగ్గాయని, 2018 మే లో 3,01,238 యూనిట్లుగా ఉన్న ఈ అమ్మకాలు 2019 మే లో 2,39,347 యూనిట్లగా నమోదైందనట్లు  వివరించింది. సియామ్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశియంగా కార్ల అమ్మకాలు 26.03 శాతం తగ్గాయి. 2018 మే

Most from this category