News


జనవరిలో కొనసాగిన ‘‘ సిప్‌’’ల హవా..!

Tuesday 11th February 2020
personal-finance_main1581418313.png-31699

ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఏమాత్రం వెనక్కి తగ్గడటం లేదు. జనవరిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రూ.8,231 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. డిసెంబర్‌లో సిప్‌ మార్గంలో వచ్చిన పెట్టుబడులు రూ.8,519 కోట్లతో పోలిస్తే జనవరిలో రూ.14 కోట్లు పెరిగాయి. సిప్స్‌ బలంగా కొనసాగడం ఆరోగ్యకర పరిణామమని మార్నింగ్‌స్టార్‌ ఫండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ కౌస్టుబ్‌ బెలపుర్కర్‌ అభిప్రాయపడ్డారు. ఈక్విటీ పథకాల్లోని మొత్తం సిప్‌ పెట్టుబడులు రూ.3.25 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు రిటైల్‌ ఇన్వెస్టర్లకు సిప్‌ మార్గం అనుకూలంగా ఉండటంతో పాటు దీర్ఘకాల లక్ష్యాల కోసం సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసే ధోరణి పెరుగుతున్నట్టు యాంపీ తెలిపింది.   



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ జనవరిలో కొన్న షేర్లివే!

Tuesday 11th February 2020

   దేశీయ అతిపెద్ద హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ జనవరిలో కొనుగోలు చేసిన షేర్లలో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎంసీజీ), హోటళ్లు, ఫార్మాలు ఉన్నాయి. ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీలలో ఒక్కోదానిలో కోటికిపైగా షేర్లను కొనుగోలు చేసింది.  మెరుగైన పనితీరు, ప్రభుత్వ వాటా తక్కువగా ఉండడంతో మరోసారి ఎన్‌టీపీసీ వృద్ధిని సాధిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ అంచనావేస్తోంది. మరోవైపు దలాల్‌ స్ట్రీట్‌లో టాప్‌ 3లో ఉన్న కంపెనీలు రియలన్స్‌

ఐటీసీ ఈ సీరిస్‌లో రూ. 220 దాటేనా?

Tuesday 11th February 2020

సిగరెట్ల ధరలు పెంచుతుందన్న వార్తలతో ఐటీసీ షేరు మంగళవారం ఆరంభంలో  దాదాపు 3 శాతం మేర దూసుకుపోయి రూ. 216.95 వరకు ర్యాలీ జరిపింది. అయితే ఈ లాభాలను చివరకంటా నిలబెట్టుకోలేక ట్రేడింగ్‌ ఆఖరుకు కేవలం 0.97 శాతం లాభంతో రూ. 212. 60 వద్ద క్లోజయింది. బడ్జెట్లో ప్రకటించిన పన్ను భారాన్ని తట్టుకునేందుకు సిగరెట్ల రేట్లను కంపెనీ పెంచింది. ఈ నిర్ణయం కంపెనీకి పాజిటివ్‌ అయినా ఇన్వెస్టర్లు పెద్దగా

Most from this category