సిప్..సిప్..హుర్రే!
By Sakshi

న్యూఢిల్లీ: దేశీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా వస్తున్న పెట్టుబడుల వాటా అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం... గతనెల్లో ఈ పరిశ్రమ సిప్ మార్గంలో రూ.8,246 కోట్లను ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే నెల్లో ఈ మొత్తం రూ.7,985 కోట్లు. గడిచిన 12 నెలల సగటు ఇన్‌ఫ్లో రూ. 8,000 కోట్లుగా నమోదయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.8,263 కోట్లు, ఆగస్టులో రూ.8,231 కోట్లు, జూలైలో రూ.8,324 కోట్లు, జూన్‌లో రూ.8,122 కోట్లు, మే నెల్లో రూ.8,183 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,238 కోట్లు సిప్ మార్గంలో మ్యూచ్‌వల్ పండ్లలోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో సిప్ల ప్రవాహం రూ.57,607 కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.52,472 కోట్లుగా ఉంది.
నెలకు సగటున 9.35 లక్షల కొత్త అకౌంట్లు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 9.35 లక్షల చొప్పున కొత్త సిప్ అకౌంట్లు జత అయినట్లు యాంఫీ తెలియజేసింది. వీటిద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న సగటు మొత్తం మాత్రం రూ.2,850గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.89 కోట్ల సిప్ ఖాతాలున్నాయి. పెరుగుతున్న పెట్టుబడుల ప్రవాహ ధోరణి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్‌లో సానుకూలతను సూచిస్తున్నట్లు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంట్‌మెంట్‌ని మెరుగుపరిచిన నేపథ్యంలో సిప్ పెట్టుబడులు జోరందుకున్నాయని విశ్లేషించారు. ఇక 2018-19లో రూ. 92,700 కోట్లు, 2017-18లో రూ. 67,000 కోట్లు, 2016-17లో రూ. 43,900 కోట్లు సిమ్ మార్గంలో మార్కెట్లోకి వచ్చాయి.
You may be interested
వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్ ఐపీవో
Thursday 14th November 201920 శాతం వాటా విక్రయించే అవకాశం రూ.700 కోట్ల వరకూ సమీకరణ నిధులన్నీ విస్తరణకే: మధుకర్ గంగాడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయ రంగంలో ఉన్న మెడ్‌ప్లస్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. తద్వారా రూ.700 కోట్లకుపైగా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో ప్రమోటర్లకు 77 శాతం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థకు 13 శాతం వాటాలున్నాయి. మిగిలిన వాటా ప్రమోటర్లకు సన్నిహితులైన
వాట్సాప్ పే... ఇప్పట్లో రాదేమో?
Thursday 14th November 2019- ఆర్థిక లావాదేవీల వివరాల భద్రతపై సందేహాలు - ప్లాట్‌ఫామ్‌ను ఆడిట్ చేయనున్న ప్రభుత్వం, ఆర్బీఐ - గణనీయంగా తగ్గిన వాట్సాప్ డౌన్లోడ్స్ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఇతర ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడంలో వాట్సాప్ సామర్ధ్యంపై నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. దీనికి తోడు..