News


ఇండెక్స్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌వోల ఆవిష్కరణకు ఏఎంసీల క్యూ

Wednesday 22nd January 2020
personal-finance_main1579716813.png-31109

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) తాజాగా యాక్టివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు బదులు ప్యాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఆవిష్కరణకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా ఏఎంసీలు ప్యాసివ్‌ ఫండ్స్‌ ఎన్‌ఎఫ్‌వో (నూతన ఫండ్‌ ఆఫర్‌)లకు అనుమతి కోరుతూ సెబీ వద్ద దరఖాస్తు చేసుకోవడం ఇదే సూచిస్తోంది. 

 

మిరే అస్సెట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ఫండ్‌ ఇటీవలే రెండు ప్యాసివ్‌ ఫండ్స్‌ను.. మిరే అస్సెట్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌ 150 ఈటీఎఫ్‌ పేరుతో ప్రారంభించాయి. నిప్పన్‌ ఇండియా, యూటీఐ, ఎల్‌అండ్‌టీ, ఐడీఎఫ్‌సీ, జేఎం మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కూడా బ్యాంకు ఈటీఎఫ్‌, ఐటీ ఈటీఎఫ్‌, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ ఆఫర్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కనీసం 10 ప్యాసివ్‌ ఫండ్స్‌ సెబీ ఆమోదం కోసం చూస్తున్నాయి. లార్జ్‌క్యాప్‌ ప్యాసివ్‌ ఫడ్స్‌ గత రెండు సంవత్సరాల్లో మంచి పనితీరు చూపించడంతో, ఏఎంసీలు అన్ని విభాగాల్లోనూ ప్యాసివ్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేయాలనుకుంటున్నాయి’’ అని ప్లాన్‌ అహెడ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాకపుడు విశాల్‌ ధావన్‌ అభిప్రాయపడ్డారు. 

 

ఇండెక్స్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు 2019 ఏప్రిల్‌ నాటికి రూ.5,286 కోట్లు కాగా, 2019 డిసెంబర్‌ నాటికి రూ.7,903 కోట్లకు పెరిగాయి. బంగారం మినహా ఇతర ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు ఇదే కాలంలో రూ.1,31,188 కోట్ల నుంచి రూ.1,77,647 కోట్లకు చేరడం గమనార్హం. గత డిసెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన నాలుగు ఇండెక్స్‌, ఈటీఎఫ్‌ ఫండ్స్‌ రూ.12,430 కోట్లు సమీకరించాయి. ప్యాసివ్‌ ఫండ్స్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు మంచి ఆప్షన్‌ అని, ఫండ్‌ నిర్వహణ ఖర్చులు వాటికి కలిసొస్తాయని విశాల్‌ ధావన్‌ పేర్కొన్నారు. అయితే, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ సమయంలో ప్యాసివ్‌ ఫండ్స్‌ అంత మంచి ఆప్షన్‌ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగంలో తక్కువ ఖర్చులు, ఆల్ఫా తగ్గుతుండడం వల్ల ప్యాసివ్‌ ఫండ్స్‌ దీర్ఘకాలంలో మంచి ప్రదర్శన చూపించొచ్చు. కానీ, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో స్టాక్స్‌ ఎంపికకు ఎన్నో అవకాశాలున్నాయి. పైగా ఈటీఎఫ్‌లు రిటైల్‌ ఇన్వెస్టర్లకు సౌకర్యమైన ఆప్షన్‌ కాదు’’ అని జెర్మినేట్‌ వెల్త్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌జోసెఫ్‌ పేర్కొన్నారు. తమ అవసరాలకు అనుగుణంగా యాక్టివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడమే మంచిదని సూచించారు. ప్యాసివ్‌ ఫండ్స్‌ అన్నవి ఆయా ఇండెక్స్‌ పరిధిలోని స్టాక్స్‌ వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంటాయి. ఫండ్‌ నిర్వహణ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. యాక్విట్‌ ఫండ్స్‌ ఇండెక్స్‌తో సంబంధం లేకుండా, లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి.You may be interested

జెఫరీస్‌​ మిడ్‌క్యాప్‌ జాబితా ఇదే..

Wednesday 22nd January 2020

గతేడాది నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీలతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు పోటీపడలేకపోయాయి. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేసి అధిక వ్యాల్యూషన్లకు చేరినందున ఈ ఏడాది (2020లో) మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఉంటుందని కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. మిడ్‌క్యాప్‌ విభాగంలో నాణ్యమైన ‍స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు ఉందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు జెఫరీస్‌ అంటోంది.   మిడ్‌క్యాప్‌ విభాగంలో సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌, కజారియా సిరామిక్స్‌, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ను టాప్‌ పిక్స్‌గా జెఫరీస్‌ పేర్కొంది.

6నెలల కాలానికి టాప్‌-4 రికమెండేషన్లు

Wednesday 22nd January 2020

బ్రోకరేజ్‌ సంస్థ: ఆనంద్‌ రాఠి షేరు పేరు: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌  రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత ధర: రూ.11.10 టార్గెట్‌ ధర: రూ.16.00 కాల వ్యవధి: 6నెలలు విశ్లేషణ: సెక్యూర్డ్‌ రీటైల్‌ ఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియోల కారణంగా స్వల్పకాలంలో బ్యాంకు ఎన్‌ఐఎంలు ఫ్లాట్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆస్తుల నాణ్యత స్థిరీకరణతో పాటు లోయర్‌ స్లిపేజ్‌లు వుంటాయని ఆనంద్‌ రాఠీ అంచనా వేస్తుంది.  బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌ బంగ్‌ షేరు పేరు: కర్ణాటక బ్యాంక్‌ రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత ధర: రూ.73.45 టార్గెట్‌ ధర: రూ.87.00 కాలవ్యవధి: 6నెలలు విశ్లేషణ: బ్యాంక్‌కు వున్న ఎన్‌బీఎఫ్‌సీ ఎక్స్‌పోజర్‌లో మంచి నాణ్యత కలిగిన కంపెనీలున్నాయి. బ్యాంక్ తన లక్ష్య పోర్ట్‌ఫోలియో మిశ్రమాన్ని

Most from this category