News


రూ.25.43 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Tuesday 11th June 2019
personal-finance_main1560229633.png-26224

  • ఈక్విటీ లింక్డ్‌ స్కీమ్స్‌తో పెరుగుతున్న పెట్టుబడులు 
  • ఎఫ్‌ఎమ్‌పీల నుంచి జోరుగా ఉపసంహరణ
  • యాంఫీ వెల్లడి 

 న్యూఢిల్లీ:
ఈక్విటీ లింక్డ్‌ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెరగడంతో మే నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల ఆస్తులు పెరిగాయి. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్ల సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లు తగ్గాయి. ఎఫ్‌ఎమ్‌పీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, ఎస్సెల్‌ గ్రూప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వంటి కంపెనీల సంక్షోభం కారణంగా ఇటీవల కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌పై పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిడి కొనసాగుతోందని యాంఫీ(అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా) వెల్లడించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇక నుంచి మరింతగా పెరుగుతాయని యాంఫీ సీఈఓ ఎన్‌.ఎస్‌. వెంకటేశ్‌ చెప్పారు. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం నెలకొనడం, మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలు దీనికి కారణమని చెప్పారు. ప్రతినెలా రూ.8,000 కోట్ల పెట్టుబడులు సిప్‌ల ద్వారా వస్తున్నాయని పేర్కొన్నారు. యాంఫీ వెల్లడించిన వివరాల ప్రకారం.., 

  • ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.25.27 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మే నెలలో రూ.25.43 లక్షల కోట్లకు పెరిగాయి. 
  • సిప్‌ల ద్వారా వచ్చే రిటైల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.8,238 కోట్ల నుంచి రూ.8,183 కోట్లకు తగ్గాయి. 
  • కార్పొరేట్‌ బాండ్ల వంటి డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేఏ ఫిక్స్‌డ్‌ మెచ్యురిటీ ప్లాన్స్‌(ఎఫ్‌ఎమ్‌పీ) నుంచి గత నెలలో ఇన్వెస్టర్లు రూ.1,797 కోట్ల మేర ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌ఎమ్‌పీల నుంచి రూ.17,644 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెనక్కి తీసుకోవడం జరిగింది. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల రుణ ఇబ్బందులు మరింతగా పెరగడమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌పీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిందని వారంటున్నారు. 
  • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంక్షోభాలు ఎఫ్‌ఎమ్‌పీలపై తీవ్రమైన ప్రభావాన్నే చూపించాయి. ఈ కేటగిరీ ఫండ్స్‌10 శాతానికి పైగా పతనమయ్యాయి. 
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.4,609 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఫండ్‌ పెట్టుబడులు గత నెలలో 17 శాతం పెరిగి రూ.5,407 కోట్లకు పెరిగాయి. మొత్తం మీద మేలో ఓపెన్‌ ఎండెడ్‌ స్కీమ్స్‌లో నికర పెట్టుబడులు రూ.70,119 కోట్లకు పెరిగాయి. 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 11th June 2019

ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పటికీ.., పసిడి ధర మంగళవారం లాభపడింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4 డాలర్లు పెరిగి 1,333.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెక్సికో దిగుమతులపై అమెరికా పన్ను విధింపు విరమించుకోవడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయిల నుంచి రివకరి కావడంతో రాత్రి అమెరికా మార్కెట్లో 16

బ్యాంకులపై ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ధిక్కరణ పిటిషన్‌

Tuesday 11th June 2019

దాఖలు చేసే అవకాశం న్యూఢిల్లీ: తాతాల్కిక నిషేధ సమయంలో కంపెనీ ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.800 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్నందుకు 11 బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు వ్యతిరేకంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీఎల్‌టీ ముందు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తోంది. రూ.800 కోట్లను ఖాళీ చేసేసిన సంస్థల్లో ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌ బ్యాంకు, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌

Most from this category