News


మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి ముత్తూట్‌ ఫైనాన్స్‌

Saturday 23rd November 2019
news_main1574481653.png-29804

  • రూ.215 కోట్లకు ఐడీబీఐ ఏఎంసీ కొనుగోలు

న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్‌ ఫైనాన్స్‌ కొత్తగా మ్యూచువల్‌ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్‌ పండ్‌ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‍శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ డీల్‌కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని పేర్కొంది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా, మొత్తం 22 పథకాల పరిధిలో రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి. ఐడీబీఐలో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలో ఉన్నందున.. ఐడీబీఐ బ్యాంకు తన ఏఎంసీ వ్యాపారాన్ని విక్రయిస్తోంది. 



You may be interested

రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాలి: శక్తికాంతదాస్‌

Saturday 23rd November 2019

ముంబై: రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌. స్థానిక సంస్థలు వాటి ఆదాయార్జన సామర్థ్యాలను పెంచుకునేందుకు సాయం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కేంద్రం, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే దేశ సమాఖ్య సారాంశం. ఎటువైపు బలహీనత ఉన్నా అది దేశానికి సవాళ్లను విసురుతుంది. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా దాస్‌ పేర్కొన్నారు. 

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 23rd November 2019

448.2 బిలియన్ డాలర్లుగా నమోదు ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది నవంబర్‌ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. జీవితకాల గరిష్ట స్థాయిని తిరగరాశాయి. అంతక్రితం వారం 1.71 బిలియన్‌ డాలర్లు పెరిగి 447.808 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో

Most from this category