News


పదేళ్ల తర్వాత లాభాల్లోకి మొబిక్విక్‌!

Sunday 16th June 2019
personal-finance_main1560707584.png-26327

పేటీఎం మాదిరే మొబైల్‌ రీచార్జ్‌ సేవలతో ఆరంభించి, ఆ తర్వాత పేమెంట్‌ సేవలు, బీమా, ఫండ్స్‌ ఉత్పత్తులను విక్రయించే రూపంలోకి పరిణామం చెందిన మొబిక్విక్‌ సంస్థ, 2009లో కార్యకలాపాలు ఆరంభించగా, 2019 మార్చి త్రైమాసికం ఫలితాలతో తొలిసారి లాభాలను ప్రకటించోబోతోంది. అలాగే, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా లాభాల ప్రయాణం చేయనుంది. త్వరలో ఐపీవోకి రావవాలనుకుంటున్న ఈ సంస్థ దాని కంటే ముందుగా మొబిక్విక్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమైన ఇన్వెస్టర్‌ను అన్వేషిస్తోంది. 

 

మూడేళ్లలో ఐపీవోకు వెళ్లేందుకు గాను కంపెనీకి సాయం చేసే ఇన్వెస్టర్‌ కోసం అన్వేషిస్తున్నామని మొబిక్విక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిపిన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన వారి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. మొబిక్విక్‌లో ఇప్పటికే సీక్వోయా క్యాపిటల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, దక్షిణాఫ్రికాకు చెందిన నెట్‌1 యూఈపీఎస్‌ టెక్నాలజీస్‌, పలువురు ఇతర వాటాదారులుగా ఉన్నారు. మొబిక్విక్‌కు పేటీఎం ప్రధాన పోటీదారుగా ఉంది. మొబిక్విక్‌ 2018-19లో తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది. రూ.184.6 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 

 

వినియోగదారులకు రివార్డులు ఇవ్వడం వల్ల చెల్లింపుల లావాదేవీల్లో పెద్దగా నష్టపోవడం లేదన్నారు సింగ్‌. తన యూజర్ల సంఖ్యను 10 కోట్లకు పైగా పెంచుకునే పనిలో మొబిక్విక్‌ ప్రస్తుతం ఉంది. మైక్రో ఇన్సూరెన్స్‌, రుణాలు, పెట్టుబడుల వంటి మార్జిన్‌ కలిగిన ఉత్పాదనల విక్రయాలను పెంచుకునేందుకు గాను యూజర్ల బేస్‌ పెంపుపై దృష్టి  పెట్టింది. 2018-19లో రూ.500 కోట్ల విలువ చేసే నాలుగు లక్షల రుణాలు తన వేదిక ద్వారా పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల రుణాల పంపిణీయే లక్ష్యమని బిపిన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం మొబిక్విక్‌ ఏడు బీమా కంపెనీల పాలసీలను తన వేదిక ద్వారా విక్రయిస్తోంది. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా విభాగాల్లో మొత్తం మీద 20 లక్షల పాలసీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ముఖ్యంగా పట్టణ కస్టమర్లను లక్ష్యం చేసుకున్నట్టు సింగ్‌ తెలిపారు. ‘‘పేమెంట్స్‌ బ్యాంకు లేదా షోడో బ్యాంకు పట్ల మాకు ఆసక్తి లేదు. ఆర్థిక ఉత్పత్తుల పంపిణీదారుగా బలంగా ఉండాలనే కోరుకుంటున్నాం’’ అని సింగ్‌ స్పష్టం చేశారు.You may be interested

ఫండ్‌ స్టేట్‌మెంట్‌లో ఏం చూడాలి..?

Sunday 16th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు తమకు ఫండ్‌ హౌస్‌ (ఏఎంసీ) నుంచి వచ్చే స్టేట్‌మెంట్‌ను తప్పకుండా పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. ఇది కూడా బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ మాదిరే. మీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు సంబంధించి పూర్తి సారాంశమే స్టేట్‌మెంట్‌. ఫండ్స్‌ సంస్థ ఏదైనప్పటికీ, అందులోని కీలక అంశాలు అన్నింటిలోనూ తప్పకుండా ఉండాల్సిందే.    ముఖ్యంగా ఫోలియో నంబర్‌ ఒకటి. ఇది మీ పెట్టుబడులకు రిఫరెన్స్‌ నంబర్‌. సంబంధిత అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌

నాలుగు అంశాలే నడిపిస్తాయి!

Saturday 15th June 2019

దేశీయ మార్కెట్‌కు ఇవే కీలకం కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారింది. ఏడాది సగానికి గడిచిపోతున్న తరుణంలో ఇకపై సూచీల గమనాన్ని కీలకమైన నాలుగు అంశాలు నిర్ధారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  1. ఆర్‌బీఐ రెపోరేటు: ఇప్పటికే ఆర్‌బీఐ రెపోరేటును 5.75 శాతానికి తగ్గించింది. వృద్ధి మందగమనం, వినిమయం తగ్గడమే రేట్లను తగ్గించేందుకు కారణాలు. రేట్‌కట్‌తో పలు రుణాలు సులభంగా దొరికి ఇన్వెస్టర్ల వినిమయం జోరందుకుంటుందని అంచనా 2. క్రూడ్‌ ఆయిల్‌

Most from this category