STOCKS

News


నగదు నిల్వలకే మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రాధాన్యం!

Sunday 21st July 2019
personal-finance_main1563733688.png-27208

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఈ ఏడాది ఇంత వరకు నిఫ్టీ-50 సూచీతో పోలిస్తే 18 శాతం నష్టాలను మిగిల్చింది. ఒకవైపు ఆర్థిక రంగ వృద్ధి తిరోగమనంలో ఉండడం, మార్కెట్లు బేల చూపులు చూస్తుండడం, ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురైన, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇంకా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడం ఇలా ఎన్నో అంశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లను ఆలోచనలో పడేశాయి. ఫలితమే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ పథకాలు నగదు నిల్వలను గణనీయంగా పెంచుకోవడమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

 

స్టాక్స్‌ వ్యాల్యూషన్లు, సెబీ పథకాల్లో చేసిన మార్పులు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ప్రతికూల పనితీరుకు దారితీసిన అంశాల్లో ప్రధానమైనవి. ఒకవైపు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ పథకాల వద్ద నగదు నిల్వలు పెరగ్గా, అదే సమయంలో లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల వద్ద నగదు నిల్వలు తగ్గాయి. అంటే, క్యాష్‌ రూపంలో కంటే బలమైన వ్యాపార నమూనాలు కలిగిన దిగ్గజ కంపెనీల్లో వాటాలు కలిగి ఉండేందుకు లార్జ్‌క్యాప్‌ పథకాలు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. లార్జ్‌క్యా్ప్‌ పథకాల్లో నగదు నిల్వలు (ఈటీఎఫ్‌లు మినహా) జూన్‌ చివరికి 3.6 శాతంగానే ఉన్నాయి. గత ఫిబ్రవరి నాటికి నగదు నిల్వలు 5.1 శాతంతో పోలిస్తే తగ్గాయి. 12 నెలల సగటు 4.7 శాతంతో పోల్చి చూసుకున్నా తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ఇదే సమయంలో సగం మిడ్‌క్యాప్‌ పథకాల్లో నగదు నిల్వలు జూన్‌ నాటికి 5 శాతంగా ఉన్నాయి.

 

మిడ్‌క్యాప్‌ విభాగంలో ప్రముఖ ఏఎంసీలు ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ జూన్‌ నాటికి 16.4 శాతం, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అయితే 13.9 శాతం మేర నగదు రూపంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఉంచుకోవడం అవి కాస్త అప్రమత్తతో ఉన్నట్టు తెలుస్తోంది. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ వద్ద నగదు నిల్వలు 9.9 శాతంగా ఉన్నాయి. దీనిపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో మృణాల్‌ సింగ్‌ స్పందిస్తూ... జూన్‌ నాటికి అధిక నగదు నిల్వలు కలిగి ఉండడం అన్నది తాత్కాలికమేనన్నారు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా కనీసం ఐదేళ్ల కాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించారు. You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 22nd July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన టవర్ల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. రియలన్స్‌ హోల్డింగ్‌ యూఎస్‌ఏ, రిలయన్స్‌ ఎనర్జీ జనరేషన్‌ డిస్ట్రిబూషన్‌ లిమిటెడ్‌ కంపెనీలను విలీనానికి సిద్ధమైంది. డాబర్‌ లిమిటెడ్‌:- కంపెనీకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌లకు రూ .50 కోట్లు ఎక్స్‌పోజర్ ఉంది. సెంచూరీ ఎంకా:- కంపెనీ చైర్మన్‌గా రాజశ్రీ బిర్లాను ఎన్నికయ్యారు.  గోదావరి పవర్‌ అండ్‌ ఇస్పాట్‌:- కేర్‌ రేటింగ్‌ను కంపెనీ ధీర్ఘకాలిక రుణసౌకర్యాల

ఫార్మాలో ఇండిట్రేడ్‌ సిఫారసులు ఇవి...

Sunday 21st July 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఎఫ్‌పీఐలకు ట్రస్ట్‌ల రూపంలో ఎటువంటి ఉపశమనం లేదంటూ ఇచ్చిన స్పష్టత మార్కెట్లకు తుఫానులా పరిణమించిందన్నారు ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌కు చెందిన సుదీప్‌ బంధోపాధ్యాయ. ఎఫ్‌పీఐలకు ఇది ఆందోళన కలిగించేదని, దీనికి కారణం 40 శాతం ఎఫ్‌పీఐలు ట్రస్ట్‌ మార్గంలోనే మన ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ల పతనానికి కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు మెరుగ్గా లేకపోవడం కూడా కారణంగా పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ల వ్యాఖ్యలు

Most from this category