News


మ్యూచువల్‌ ఫండ్స్‌లో మీ పథకాల పనితీరు?

Monday 11th November 2019
personal-finance_main1573412550.png-29480

ఒక పక్క ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా ప్రతికూలంగా ఉన్న మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లోనూ రికవరీ కనిపిస్తోంది. కొన్ని ‍స్టాక్స్‌ ఇప్పటికే 30 శాతం వరకు కనిష్టాల నుంచి పెరిగాయి. అంతెందుకు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 10 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 8 శాతం మేర గత రెండు నెలల్లో పెరిగాయి. 

 

మిడ్‌క్యాప్‌ విభాగం 2018 సంవత్సరంలో 12 శాతం నష్టాలను మిగిల్చింది. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే అరశాతం పెరిగింది. సగటు రాబడులు ఇప్పటికీ మెరుగ్గా ఏమీ లేవు. కానీ, గతేడాదితో పోలిస్తే నష్టాలకు బ్రేక్‌పడింది. అలాగే, స్మాల్‌క్యాప్‌ విభాగం 2018లో 17 శాతం నష్టాలను ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటి వరకు నికరంగా 2.51 శాతం మేర నష్టాల్లోనే ఉంది. అంటే ఈ విభాగం ఇప్పటికీ ఒత్తిళ్ల నుంచి బయటపడలేదని తెలుస్తోంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో నెలవారీ సగటు రాబడులు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగాల్లో మెరుగుపడినట్టు తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌ విభాగం సెప్టెంబర్‌లో 5.66 శాతం రాబడులను ఇస్తే, అక్టోబర్‌లో 5 శాతంగా ఉన్నాయి. ఇదే పరిస్థితి స్మాల్‌క్యాప్‌ విభాగంలోనూ కనిపిస్తోంది. 

 

మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌
మాసం            సగటు రాబడులు       గరిష్ట రాబడులు(శాతాల్లో)
మే-2019       1.98                       5.26
జూన్‌              -1.33                      0.63
జూలై              -8.67                      -6.05
ఆగస్ట్‌               0.54                      3.92
సెప్టెంబర్‌           5.66                      8.35
అక్టోబర్‌             5.01                      9.76    

 

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌
మాసం            సగటు రాబడులు        గరిష్ట రాబడులు (శాతాల్లో)
మే-2019        2.74                       6.91
జూన్‌              -2.82                       -0.07
జూలై              -9.71                       -5.94
ఆగస్ట్‌              0.28                        5.69
సెప్టెంబర్‌          5.63                        4.54
అక్టోబర్‌            2.36                       4.54



You may be interested

మార్కెట్ల గమనం ఎటు..?

Monday 11th November 2019

స్టాక్‌ మార్కెట్ల బుల్‌ ర్యాలీలో పాల్గొనకుండా వేచి చూసేందుకు ఇన్వెస్టర్లు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇన్వెస్టర్ల క్రమంగా కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్టు మార్కెట్‌ వ్యాప్తంగా పెరుగుదల తెలియజేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో ర్యాలీయే నడుస్తోంది. కాకపోతే నూతన గరిష్టాల వద్ద మార్కెట్లు తడబడుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినా లేక ఆర్థిక సంస్కరణల్లో ఏవైనా కేంద్రం అమ్ముల పొది నుంచి తీసినా చాలా పెద్ద సానుకూలమే అవుతుందని అనలిస్టుల విశ్లేషణ. కానీ,

ఐపీవో ఇష్యూ ధరపై భారీ లాభాలు!

Monday 11th November 2019

మంచి వ్యాపారాలతో కూడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్నింటి వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నా కానీ, వారు వెనుకాడడం లేదు. భవిష్యత్తు వృద్ధి అవకాశాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ముగిసిన ఐపీవోలను పరిశీలిస్తే కొన్ని ఇష్యూ ధర నుంచి ఇప్పటి వరకు మంచి లాభాలనే ఇచ్చాయి.    ఈ ఏడాది ఐపీవో ఇష్యూల్లో కొన్ని మంచి సక్సెస్‌ సాధించాయి. 10 కంపెనీలు వాటి ఇష్యూ

Most from this category