News


ఫండ్స్‌కు ఇవి వ్యాల్యూ బెట్స్‌!

Monday 20th January 2020
personal-finance_main1579542219.png-31054

డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో గణాంకాలను పరిశీలిస్తే.. ఫండ్‌ మేనేజర్లు బాగా దిద్దుబాటుకు గురైన 15 స్టాక్స్‌లో వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు అర్థమవుతోంది. వీటిల్లో కొన్ని గరిష్ట ధరల నుంచి 50 శాతం వరకు పడిపోయినవి. త్రైమాసికం వారీగా చూసుకుంటే ఈ స్టాక్స్‌లో చాలా వరకు ఫండ్స్‌ కనీసం ఒక శాతానికి పైనే వాటాలు పెంచుకున్నాయి.

 

బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ స్టాక్‌ ఫండ్స్‌ను ఎక్కువగా ఆకర్షించింది. గతేడాది ఈ స్టాక్‌ 36 శాతం పడిపోయింది. డిసెంబర్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈ ఒక్క కౌంటర్‌లో తమ వాటాలను మొత్తం మీద 11.7 శాతం పెంచుకున్నాయి. ఫలితంగా ఈ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 20.2 శాతానికి చేరుకుంది. అంతక్రితం క్యూ2 నాటికి వాటా 8.5 శాతంగానే ఉంది. ఈ స్టాక్‌కు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ మార్కెట్లలో బెయిన్‌ అండ్‌ కో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ విస్తార్‌ ద్వారా మంచి అమ్మకాలు నమోదు కానున్నట్టు అంచనా వేస్తోంది. వీ మార్ట్‌ స్టాక్‌ విషయంలోనూ ఫండ్స్‌ సానుకూలంగా ఉన్నాయి. డిసెంబర్‌ క్వార్టర్లో 2.2 శాతం వాటాను పెంచుకున్నాయి. దీంతో ఫండ్స్‌ వాటా అంతక్రితం త్రైమాసికంలో ఉన్న 8.1 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగింది. స్టోర్ల విస్తరణలో కంపెనీ తన దూకుడైన ప్రణాళికకే కట్టుబడి ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ తెలిపింది. ఈ స్టాక్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇచ్చింది.

 

క్వెస్‌ కార్ప్‌, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఈ రెండు కూడా ఉద్యోగ నియామక సేవలు అందించే సంస్థలు. ఈ రెండింటిలోనూ మ్యూచువల్‌ ఫండ్స్‌ క్యూ3లో వాటాలు పెంచుకున్నాయి. టీమ్‌లీజ్‌ స్టాక్‌ అయితే గత ఏడాది 30 శాతం క్షీణించింది. ‘‘టీమ్‌లీజ్‌ 12 నెలల ఫార్వార్డ్‌ పీఈ ఆధారంగా 32 రెట్ల వద్ద ట్రేడవుతోంది. చారిత్రకంగా సగటు పీఈ 35 రెట్లు. కనుక రిస్క్‌ కొద్దీ రాబడులను ఆఫర్‌ చేస్తోంది’’ అని జేఎం ఫైనాన్షియల్‌ తెలిపింది. ఈ స్టాక్‌కు బై రేటింగ్‌ ఇస్తూ రూ.2,820ను టార్గెట్‌గా పేర్కొంది. ఇటీవలి కరెక్షన్‌తో క్వెస్‌కార్ప్‌ స్టాక్‌ కొనుగోళ్లకు అవకాశమని, కంపెనీ పనితీరు నిలకడగా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇండోకో రెమిడీస్‌లోనూ మ్యూచువల్‌ ఫండ్స్‌ క్యూ3లో అదనంగా 1.8 శాతం వాటాను కొనుగోలు చేశాయి. అలాగే యూనికెమ్‌ ల్యాబొరేటరీస్‌, ప్రిస్మ్‌ జాన్సన్‌, సీపీసీఎల్‌, ఇమామీ, ఫినోలెక్స్‌ కేబుల్స్‌, గెయిల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, హిమత్‌సింగా సీడ్‌, సుప్రజిత్‌ ఇంజనీరింగ్‌ తదితర స్టాక్స్‌లోనూ క్యూ3లో ఫండ్స్‌ వాటా పెరిగింది.You may be interested

12,216కు దిగువన మరింత బలహీనత

Monday 20th January 2020

లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ సోమవారం కీలకమైన 12,300 స్థాయి దిగువకు వచ్చేసింది. గత వారం మొత్తం 12,270-12,300 మధ్య ఇండెక్స్‌ మంచి మద్దతు తీసుకుంది. కానీ, అమ్మకాల ఒత్తిడితో ఈ వారం ఆరంభంలో దీన్ని కోల్పోయింది. డైలీ చార్ట్‌లలో పొడవైన బ్లాక్‌ డే ప్యాటర్న్‌ను పోలిన పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని నిపుణుల విశ్లేషణ.   నిఫ్టీ ప్రారంభంలో 12,430.50 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ, కొన్ని

అంచనాల్ని అందుకోని కోటక్‌ బ్యాంక్‌ ఫలితాలు

Monday 20th January 2020

ముంబై: ప్రైవేటు రంగ రుణదాత కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్టాండెలోన్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 23.62 శాతం పెరిగి రూ.1,596 కోట్లుగా నమోదైంది. కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు  సోమవారం ముంబైలో జరిగిన సమావేశంలో కన్సాలిడేటెడ్‌,స్టాండెలోన్‌ ఫలితాలను ఆమోదించారు.  ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసిక స్టాండెలోన్‌ నికర లాభం 2019 క్యూ3తో పోలిస్తే 24 శాతం పెరిగి రూ.1,291 కోట్ల నుంచి రూ. 1,596 కోట్లకు

Most from this category