News


పడిపోతున్నా కానీ ఈ స్టాక్స్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు

Wednesday 16th October 2019
personal-finance_main1571250086.png-28930

పడిపోతున్న చాకును పట్టుకోవద్దన్న సూక్తి స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టుల నుంచి వినిపిస్తుంటుంది. అయితే, ఈ సూత్రం అన్నింటికీ వర్తించదులేండి. ఎందుకంటే కొన్ని మంచి కంపెనీల షేర్లు కూడా తాత్కాలిక ప్రతికూలతల కారణంగా పడిపోతుంటాయి. అవి కొనుగోళ్లకు మంచి అవకాశాలుగానే చూడాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా మంచి పెట్టుబడి అవకాశాలుగా భావించి... గత ఏడాదిగా పడిపోతున్నప్పటికీ ఓ ఎనిమిది కంపెనీలలో క్రమంగా వాటాలు పెంచుకుంటూ వస్తున్నాయి. 

 

ఇలా మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలు క్రమంగా పెరుగుతున్న కంపెనీల్లో షాపర్స్‌స్టాప్‌, వీమార్ట్‌, టీవీఎస్‌ మోటార్‌, గుజరాత్‌ పిపావవ్‌ పోర్ట్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, బీహెచ్‌ఈఎల్‌, ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌, ఇండోకో రెమిడీస్‌ ఉన్నాయి. ఇవన్నీ కూడా 52 వారాల కనిష్ట స్థాయికి చేరినవే. షాపర్స్‌స్టాప్‌ స్టాక్‌ ఏడాది కాలంలో గరిష్ట స్థాయి నుంచి 27 శాతం క్షీణించింది. 2018 సెప్టెంబర్‌ నాటికి ఈ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 12.3 శాతంగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 17.3 శాతానికి పెరిగింది. 2018 డిసెంబర్‌ త్రైమాసికంలో 12.8 శాతం, 2019 మార్చి క్వార్టర్‌లో 14.3 శాతం, జూన్‌ క్వార్టర్‌లో 16.6 శాతానికి ఫండ్స్‌ వాటా పెరుగుతూ వెళ్లింది.

 

ఇక టీవీఎస్‌ మోటార్‌లోనూ ప్రతీ త్రైమాసికంలో గత ఏడాది నుంచి ఫండ్స్‌ వాటాలు కొంటూనే ఉన్నాయి. ఏడాది క్రితం కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు 10.3 శాతం వాటా ఉంటే, అది తాజాగా 15 శాతానికి పెరిగింది. 52 వారాల గరిష్ట ధర నుంచి ఈ స్టాక్‌ 34 శాతం వరకు పడిపోయింది. వీమార్ట్‌ షేరు ధర కూడా ఏడాది గరిష్ట ధర నుంచి 32 శాతం క్షీణించింది. ఏడాది క్రితం 4.7 శాతం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి 8.1 శాతానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా పెరిగింది. గుజరాత్‌ పిపావవ్‌లో ఫండ్స్‌ వాటా గత ఏడాది కాలంలో 21.1 శాతం నుంచి 24.1 శాతానికి చేరింది. ఇక, బీహెచ్‌ఈఎల్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌, ఇండోకో రెమిడీస్‌ స్టాక్స్‌ 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 45 శాతం వరకు పడిపోయినా కానీ ఫండ్స్‌ వాటా పెరగడం గమనార్హం. 

 

బీహెచ్‌ఈఎల్‌ లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో వార్షికంగా 23.4 శాతం తగ్గొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఈ కంపెనీకి లాభిస్తుందని తెలిపింది. షాపర్స్‌ స్టాప్‌ అమ్మకాలు ఫ్లాట్‌గా రూ.870 కోట్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. కంపెనీ లాభం 39 శాతం తగ్గుతుందని ఎమ్కే గ్లోబల్‌ అంచనా వేయగా, 64 శాతం తగ్గుతుందని ఎడెల్‌వీజ్‌ అంచనా. టీవీఎస్‌ మోటార్‌ లాభం 27.8 శాతం వరకు సెప్టెంబర్‌ త్రైమాసికంలో పడిపోవచ్చని అరిహంట్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. 



You may be interested

ఆటో స్టాక్స్‌ ఆకర్షణీయం: యోగేష్‌ మెహతా

Wednesday 16th October 2019

ఆటో రంగ స్టాక్స్‌ పతనం ఆగినట్టేనని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్ల కంపెనీల షేర్లు ప్రస్తుత స్థాయి నుంచి దిద్దుబాటుకు చాలా పరిమిత అవకాశాలే ఉన్నాయని ఈల్డ్‌ మ్యాగ్జిమైజర్‌ వ్యవస్థాపకుడు యోగేష్‌ మెహతా పేర్కొన్నారు. వివిధ రంగాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   ఆటోమొబైల్‌ రంగం ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహన కంపెనీల స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ, ఎస్కార్ట్స్‌, మహీంద్రా అండ్‌

11450 పైన ముగిసిన నిఫ్టీ

Wednesday 16th October 2019

నాలుగో రోజూ లాభాల ముగింపే ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్ల ర్యాలీతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో బుధవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 38,599 వద్ద ముగిసింది, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 11450 పైన 11,471 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్‌, మెటల్‌, అటో షేర్లు ఎఫ్‌ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో

Most from this category