News


పీఎస్‌బీల్లో వాటాలు తగ్గించుకుంటున్న ఎంఎఫ్‌లు

Friday 10th January 2020
personal-finance_main1578648610.png-30834

మ్యూచువల్‌ ఫండ్స్‌కు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఉన్న వాటాలు అనేక సంవత్సరాల కనిష్ఠాలకు చేరాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి దీంతో పాటు యస్‌బ్యాంకులో కూడా ఎంఎఫ్‌లు గణనీయంగా వాటాలు తగ్గించుకుంటున్నాయి. పీఎస్‌బీల్లో వాటాలు తగ్గించుకుంటున్న ఫండ్స్‌ ఇదే సమయంలో స్టాఫింగ్‌ సంస్థలు, సిమెంట్‌ ఉత్పత్తి కంపెనీల్లో వాటాలు పెంచుకుంటున్నాయి. యస్‌బ్యాంకులో డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంఎఫ్‌లు తమ వాటాను 5.1 శాతానికి తగ్గించుకున్నాయి. 2013 తర్వాత బ్యాంకులో ఎంఎఫ్‌ల వాటా ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. బ్యాంకు ఫండ్‌రైజింగ్‌ ప్రణాళికల్లో జాప్యం ఎంఎఫ్‌ల వెనుకంజకు కారణంగా భావిస్తున్నారు. తాజాగా మోర్గాన్‌స్టాన్లీ సైతం యస్‌ బ్యాంకు రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు మార్చింది. ఇక పీఎస్‌బీల్లో యూనియన్‌ బ్యాంకులో ఎంఎఫ్‌ల వాటా డిసెంబర్‌ త్రైమాసికంలో 2005 మార్చి తర్వాత కనిష్ఠస్థాయి 2. 4శాతానికి చేరింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఎంఎఫ్‌లు ఈ బ్యాంకులో వాటాను 3 శాతం మేర తగ్గించుకున్నాయి. ఇండియన్‌ బ్యాంకులో ఎంఎఫ్‌ల వాటా 6 శాతానికి(2017 తర్వాత కనిష్ఠస్థాయి), కెనెరా బ్యాంకులో వాటాను 5.1 శాతానికి(2016 తర్వాత కనిష్ఠస్థాయి), బీఓబీలో వాటాను 9.8 శాతానికి(2017 తర్వాత కనిష్ఠస్థాయి), ఆర్‌బీఎల్‌లో వాటాను 19.4 శాతానికి(2018 తర్వాత కనిష్ఠస్థాయి)కి తగ్గింది. బ్యాంకులతో పాటుగా సోమెనీ సిరామిక్స్‌, టీవీటుడే, ఇన్ఫోఎడ్జ్‌, ఎస్‌బీఐలైఫ్‌, నోసిల్‌, ఎంసీఎక్స్‌ల్లో సైతం మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలను తగ్గించుకున్నాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో కెన్‌ఫిన్‌ హోమ్స్‌, పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌, క్వెస్‌కార్‌‍్ప, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, నారాయణ హృదయాలయ, రత్నమణి మెటల్స్‌, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, ప్రిసం జాన్సన్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, చెన్నై పెట్రోల్‌ కార్పొరేషన్‌, జిందాల్‌ స్టీల్‌, టీవీఎస్‌ మోటర్స్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లో ఎంఎఫ్‌లు వాటాలను పెంచుకున్నాయి. You may be interested

మరింత పెరిగిన రూపాయి..

Friday 10th January 2020

12 పైసలు ప్లస్‌ 71.09 వద్ద ట్రేడింగ్‌ డాలరుతో మారకంలో బుధవారం లాభాల యూటర్న్‌ తీసుకున్న దేశీ కరెన్సీ వరుసగా మూడో రోజు శుక్రవారం సైతం బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి మధ్యాహ్నానికల్లా 12 పైసలు(0.17 శాతం) పుంజుకుని  71.09 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు చల్లబడటంతో ఇటీవల ముడిచమురు, బంగారం ధరలు నీరసించగా.. స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో

టాటాలకు ఊరట

Friday 10th January 2020

ఎన్‌సీఎల్‌ఏటీ ఆర్డర్‌పై సుప్రీం స్టే సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పునర్నియమించాలన్న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఆదేశాల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసే పరిధి, అధికారం తనకు లేదని ట్రిబ్యునల్‌ మర్చిపోయినట్లుందని తెలిపింది. ఈ విషయమై లోతైన విచారణ సాగిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్‌ తీర్పునిచ్చింది. మిస్త్రీ తనను పునర్నియమించాలని

Most from this category