News


ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌.. ఏం కొన్నదో చూద్దాం..

Friday 17th January 2020
personal-finance_main1579200169.png-30973

నిర్వహణ ఆస్తుల పరంగా హెచ్‌డీఎఫ్‌సీ అస్సె్‌ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్‌). ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తర్వాత ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ దేశంలో మూడో అతిపెద్ద సంస్థ. 2019 డిసెంబర్‌ నాటికి రూ.3.6 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. అయితే, ఇందులో రూ.1.91 లక్షల కోట్లు ఈక్విటీ ఆస్తులే కావడం గమనార్హం. ఈక్విటీ ఆస్తుల పరంగా అతిపెద్ద ఏఎంసీ ఇదే. ఈ సంస్థ గతేడాది నవంబర్‌లో యస్‌ బ్యాంకు షేర్లను కొనుగోలు చేయగా, మరుసటి నెల డిసెంబర్‌లో ఏకంగా 74 లక్షల షేర్లను అమ్మేసింది. యస్‌ బ్యాంకు నిధుల కటకటను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిధుల సమీకరణకు బ్యాంకు చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఆలస్యం అవుతుండడంతో ముందు జాగ్రత్తగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ చేసిన కొనుగోళ్లు, అమ్మకాలను మరింత వివరంగా చూస్తే.. 

 

ఎస్‌బీఐ ఏఎంసీ డిసెంబర్‌ నెలలో ప్రభుత్వరంగ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసినట్టు గణాంకాలు చూస్తే తెలుస్తోంది. పవర్‌గ్రిడ్‌, ఎస్‌జేవీఎన్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడాతోపాటు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకులో 10-90 లక్షల మధ్య షేర్లను ప్రతీ కంపెనీలో కొనుగోలు చేసింది. ఈ కంపెనీలు రాబడుల విషయంలో వెనుకబడి ఉన్నప్పటికీ పెద్ద ఎ‍త్తున కొనుగోలు చేయడం భవిష్యత్తులో ర్యాలీ చేస్తాయన్న అంచనాలేనని తెలుస్తోంది. ప్రభుత్వరంగ స్టాక్స్‌ బలమైన బ్యాలన్స్‌ షీట్లతో ఉన్నప్పటికీ అర్థరహితంగా దిద్దుబాటుకు గురవడం వెనుక కేవలం ప్రభుత్వ యాజమాన్యం వల్లేనని నిపుణుల విశ్లేషణ. ప్రభుత్వం కొన్ని కంపెనీలను విక్రయించడంలో విజయవంతం అయినా, అప్పుడు మిగిలిన ప్రభుత్వరంగ స్టాక్స్‌ రేటింగ్‌ మెరుగుపడేందుకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.  

 

ఇక క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌లో 3 కోట్ల షేర్లను ఎస్‌బీఐ ఏఎంసీ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో ఎస్‌బీఐ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌కు డిసెంబర్‌ ముగిసే నాటికి 5.78 శాతం వాటా కలిగి ఉండడం గమనార్హం. ఈ స్టాక్‌ గతేడాది కాలంలో సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ రాబడులను (9 శాతం) ఇచ్చింది. ఈ స్టాక్‌ పట్ల హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కూడా బుల్లిష్‌గానే ఉంది. బై రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌గా రూ.339ను పేర్కొంది. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ కూడా బై రేటింగ్‌తో, రూ.300ను టార్గెట్‌గా ఇచ్చింది. సీఎస్‌బీ బ్యాంకులో 76 లక్షల షేర్లను డిసెంబర్‌లో కొనుగోలు చేసింది. ఎస్‌బీఐ మ్యాగ్నం గ్లోబల్‌ ఫండ్‌ పథకం డిసెంబర్‌ నాటికి సీఎస్‌బీ బ్యాంకులో 4.79 శాతం వాటా కలిగి ఉంది. 

 

యస్‌ బ్యాంకులో 74 లక్షల షేర్లను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ డిసెంబర్‌లో విక్రయించింది. సెన్సెక్స్‌ నుంచి యస్‌ బ్యాంకు స్టాక్‌ను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ప్యాసివ్‌ ఫండ్‌ మేనేజర్లు ఈ స్టాక్‌ను విక్రయించక తప్పని పరిస్థితి అని విశ్లేషణ. అలాగే, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌ఐఐటీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గ్రీన్‌ప్యానెల్‌ ఇండస్ట్రీస్‌లో ఒక్కో దానిలో 10 లక్షలకు పైగా షేర్లను ఎస్‌బీఐ ఏఎంసీ విక్రయించింది. You may be interested

సుప్రీం తీర్పుతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ పరిస్థితి ఏంటి?

Friday 17th January 2020

సుప్రీం తీర్పు ప్రభావం టెలికం రంగ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లపై శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)పై గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. దీని తాలూకూ ప్రకంపనలు టెలికం కంపెనీలపై తీవ్రంగానే ఉంటాయని, ముఖ్యంగా

సికాల్‌ లాజిస్టిక్స్‌లో 10.25 వాటా యస్‌ బ్యాంక్‌ సొంతం !

Thursday 16th January 2020

తనఖా షేర్లకు రుణం చెల్లించని సికాల్‌ లాజిస్టిక్స్‌  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగానికి చెందిన రుణదాత యస్‌బ్యాంక్‌ సికాల్‌ లాజిస్టిక్స్‌ తనఖా షేర్లను సొంతం చేసుకుంది. కాఫీ డే గ్రూపుకు చెందిన సికాల్‌ లాజిస్టిక్స్‌ యస్‌బ్యాంక్‌ దగ్గర కొన్ని షేర్లను తనఖా పెట్టింది. నిర్ణిత సమయానికి రుణం చెల్లించకపోవడంతో యస్‌ బ్యాంక్‌ సికాల్‌ లాజిస్టిక్స్‌ నుంచి 10.25 శాతం వాటాను సొంతం చేసుకుంది. యస్‌బ్యాంక్‌ సొంతం చేసుకున్న 60 లక్షల ఈక్విటీ షేర్లలో

Most from this category