News


డిసెంబర్‌లో ఎంఎఫ్‌ల కొనుగోళ్లు, అమ్మకాలు!

Wednesday 16th January 2019
personal-finance_main1547618552.png-23613

దేశీయ ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 21 శాతం క్షీణించి రూ. 6606 కోట్లకు చేరింది. అయితే సిప్స్‌లోకి నిధుల ప్రవాహం మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి చేరింది. డిసెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ యుటిలిటీస్‌, చమురు, గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలపై ఆసక్తి చూపాయి. టెక్నాలజీ, ఆటో, హెల్త్‌కేర్‌, మెటల్స్‌, కన్జూమర్‌, టెలికం, సిమెంట్‌ రంగాలపై అనాసక్తత కనబరిచాయి. 
గతనెల్లో ఫండ్‌మేనేజర్లు కొనుగోలు చేసిన షేర్లు..
లార్జ్‌క్యాప్స్‌: ఓఎన్‌జీసీ, ఐఓసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌టీపీసీ
మిడ్‌క్యాప్స్‌: ఓఐఎల్‌, ఎన్‌బీసీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌ఈసీ.
స్మాల్‌క్యాప్స్‌: జేకే సిమెంట్‌, సీడీఎస్‌ఎల్‌, హెల్త్‌కేర్‌గ్లోబల్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌, సంఘి ఇండస్ట్రీస్‌.


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గతనెల్లో ఫండ్‌మేనేజర్లు విక్రయించిన షేర్లు
లార్జ్‌క్యాప్స్‌: ఐబీ హౌసింగ్‌, బోష్‌, సెయిల్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌, బయోకాన్‌.
మిడ్‌క్యాప్స్‌: జిలెట్‌ ఇండియా, గ్లాక్సో ఫార్మా, ఐడీబీఐ బ్యాంక్‌, ఫైజర్‌, బేయర్‌ క్రాప్‌ సైన్స్‌.
స్మాల్‌క్యాప్స్‌: డీఎం హెల్త్‌కేర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌; ఇక్రా, షాపర్స్‌ స్టాప్‌, జాన్సన్‌ కంట్రోల్స్‌, హిటాచీ.


MFs

You may be interested

ఆర్‌ఐఎల్‌ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Wednesday 16th January 2019

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. ఈసారి కూడా కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. రిటైల్‌, టెలికం, పెట్రోకెమికల్‌ వ్యాపారాలు బాగుంటాయని భావిస్తున్నాయి. అయితే రిఫైనింగ్‌ విభాగం పేలవ ప్రదర్శన చూపవచ్చని, అందువల్ల ప్రాఫిటబిలిటీపై కొంత ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. రెవెన్యూలో మంచి వృద్ధి ఉన్నా, లాభాలు స్వల్ప పెరుగుదలనే చూపవచ్చని తెలిపాయి. క్రూడాయిల్‌ ధరలు భారీగా పతనం కావడంతో

స్థిరంగా పసిడి ధర

Wednesday 16th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌ ఆందోళనలు, కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ యధాతథ పాలసీ అంచనాలు పసిడికి అండగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి స్వల్పంగా 1డాలరు లాభపడి 1,289.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో బ్రిటన్‌ కొనసాగాలా... లేదా (బ్రెగ్జిట్‌)అనే అంశంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో చారిత్రక ఓటింగ్‌ జరిగింది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 423 ఓట్లు రాగా, అనుకూలంగా

Most from this category