News


లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఎలా ఉంది..?

Thursday 25th July 2019
personal-finance_main1564076435.png-27320

యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గతేడాది ఆశించిన రాబడులు లేకపోవడం అనుభవమయ్యే ఉంటుంది. యాక్టివ్‌గా నడిచే 31 లార్జ్‌క్యాప్‌ఫండ్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐ స్థాయిలో రాబడులను ఇవ్వలేకపోయాయి. మరి వీటిల్లో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమేనా...? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌, బీఎస్‌ఈ సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ లేదా ప్రతికూల పనితీరు చూపించడం అన్నది స్థిరమైన ధోరణేనా..? నేడు చాలా మంది ఇన్వెస్టర్లు సిప్‌ మార్గంలోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కనుక ఓ పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయా? లేవా అన్నది తేల్చేందుకు కనీసం ఐదేళ్ల కాలం అయినా అవసరం అంటున్నారు నిపుణులు. 

 

వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ గత ఐదేళ్ల కాలంలో సిప్‌ పెట్టుబడులపై యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో రాబడులు, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐతో పోల్చి చూసింది. 2018తో ముగిసిన చివరి ఐదేళ్ల కాలంలో సెన్సెక్స్‌తో పోలిస్తే యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ అధిక రాబడులు ఇవ్వలేకపోయినట్టు తేలింది. 2014, 2017తో ముగిసిన చివరి ఐదేళ్లలో అయితే 80 శాతం లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ ఇండెక్స్‌ కంటే మెరుగైన రాబడులను ఇచ్చాయి. కానీ, గత ఏడాదిని పరిగణనలోకి తీసుకుని చూస్తే మాత్రం వాటి పనితీరు ఆశాజనకంగా లేదు. 2014లో 20 యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ మంచి పనితీరు చూపగా, 6 ఫండ్స్‌ తక్కువ రాబడులను ఇచ్చాయి. 2015లోనూ 24 ఫండ్స్‌ మంచి రాబడులను ఇవ్వగా, 2016లో 27 ఫండ్స్‌, 2017లో 28 ఫండ్స్‌ సెన్సెక్స్‌ టీఆర్‌ఐ కంటే మంచి రాబడులను ఇచ్చాయి. కానీ, 2018లో కేవలం 4 ఫండ్స్‌ మాత్రమే మంచి రాబడులను ఇవ్వగా, 27 పథకాలు మాత్రం సెన్సెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో వెనుకబడ్డాయి. 

 

2018 యాక్టివ్‌గా పనిచేసే ఈక్విటీ పథకాలకు గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ గతంతో పోలిస్తే మరింత ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కేవలం ప్రధాన సూచీల్లో కొన్ని స్టాక్సే సూచీల ర్యాలీని నడిపించాయి. దీంతో సూచీలు లాభాల్లోనే కనిపించినా, ఎన్నో ప్రధాన స్టాక్స్‌ నష్టాల పాలైన భిన్న పరిస్థితి ఉంది. దీంతో పాసివ్‌ ఫండ్స్‌ అయిన ఈటీఎఫ్‌లకు గతేడాది అనుకూల సంవత్సరంగా చెప్పవచ్చు. అయితే, ఇటువంటి ‍ప్రతికూలతల మధ్య కూడా కొన్ని లార్జ్‌క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్స్‌ 2018తో ముగిసిన చివరి ఐదు సంవత్సరాల్లోనూ వార్షికంగా మంచి రాబడులను అందించాయి. ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్రంట్‌లైన్‌ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌, క్వాంటమ్‌ ఫోకస్డ్‌ ఫండ్‌, రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌, ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్‌ ఇందులో ఉన్నాయి. 
 You may be interested

ఈ దశలో షేర్లను అమ్ముకోవడం సరికాదు: శాంక్టమ్‌ వెల్త్‌

Thursday 25th July 2019

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు భయపడి షేర్లను విక్రయించినట్టయితే, మళ్లీ తిరిగి ప్రవేశించడం కష్టమవుతుందని, తదుపరి ర్యాలీని మిస్‌ కావాల్సి వస్తుందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో సునీల్‌ శర్మ అన్నారు. కరెక్షన్లు అన్నవి మార్కెట్లో సాధారణ ప్రక్రియలో భాగమేనని, ప్రతీ మూడేళ్లకోసారి 20 శాతం దిద్దుబాటు తప్పదన్నారు. ఈ మేరకు మార్కెట్‌పై ఓ వార్తా సంస్థతో అన అభిప్రాయాలను పంచుకున్నారు.    మార్కెట్లో విక్రయాలకు ఎన్నో కారణాలు దారిశీతాయని సునీల్‌ శర్మ అన్నారు.

ధర, ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ సీ2

Thursday 25th July 2019

10 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి! ధర, ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ సీ2 స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ రియల్‌మీ సీ2 మోడల్‌ అమ్మకాలు 10 లక్షల యూనిట్లను దాటాయి. ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలైన ఈ ఫోన్‌ అతి తక్కువ కాలంలో రికార్డు స్థాయి విక్రయాలు సాధించడం విశేషం. ధరల శ్రేణి రూ.5,999-7,999 ఉంది. బడ్జెట్‌ ధరలో పెద్ద తెరతో ఇది తయారైంది. 6.1 అంగుళాల హెచ్‌డీ, డ్యూడ్రాప్‌ డిస్‌ప్లే, గొరిల్లా

Most from this category