News


16 నుంచి ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఇష్యూ

Wednesday 11th December 2019
Markets_main1576087838.png-30177

ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ రూ.1,500 కోట్ల వరకు నిధులు సమీకరించే లక్ష్యంతో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) ఇష్యూను చేపట్టింది. ఈ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమైన 30వ తేదీన ముగుస్తుంది. అనంతరం ఎన్‌సీడీలను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేయనున్నారు. కనీసం రూ.500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. అధికంగా స్పందన వస్తే.. అప్పుడు అదనంగా మరో రూ.1,000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ రుణ వ్యాపారానికి, ప్రస్తుత రుణాలను తీర్చివేసేందుకు, సాధారణ కార్యకలాపాలకు వినియోగించనున్నది. ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఏకే క్యాపిటల్‌ సర్వీసెస్‌, ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌, జేఎం ఫైనాన్షియల్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. 

 

36 నెలలు, 60 నెలలు, 84 నెలల కాల వ్యవధితో మూడు రకాల ఎన్‌సీడీలను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. వీటి కూపన్‌ రేటు (వడ్డీ రేటు) 8.25-8.65 శాతం. ఇవే కాల వ్యవధి డిపాజిట్లపై ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తున్న రేటు 6.25 శాతం మాత్రమే. ‘‘ఇన్వెస్టర్లు 235 బేసిస్‌ పాయింట్లు (2.35 శాతం) అధికంగా బ్యాంకు డిపాజిట్ల కంటే ఇందులో రాబడి పొందొచ్చు. పైగా ఏఏఏ రేటింగ్‌ కలిగిన సాధనం. దీంతో ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని మనీహానీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ అనూప్‌ భయ్యా పేర్కొన్నారు. రిటైర్‌ అయిన వారు, తక్కువ పన్ను రేటు పరిధిలో ఉన్న వారికి మంచి పెట్టుబడి సాధనం అవుతుందన్నారు. భారత ప్రభుత్వం బాండ్లపై వచ్చే 7.75 శాతంతో చూసినా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఆఫర్‌ చేస్తున్న రాబడి అధికంగానే ఉంది. పెట్టుబడిపై నెలవారీ లేదా వార్షికంగా వడ్డీ పొందడం అనే ఆప్షన్లు ఉన్నాయి. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకే వస్తుంది. కాకపోతే టీడీఎస్‌ అమలు చేయరు. ఇన్వెస్టర్లు తమ రిటర్నుల్లో చూపించుకోవాలి. 



You may be interested

యస్‌ బ్యాంకుకు ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..?

Wednesday 11th December 2019

దేశంలో ఐదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యస్‌ బ్యాంకు నిధుల కోసం దాహం దాహం అంటూ అలమటిస్తుంటే... పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ, పేరున్న ఇన్వెస్టర్లు ముఖం చాటేసిన పరిస్థితి. కెనడాకు చెందిన ఎర్విన్‌సింగ్‌ బ్రెయిచ్ (1.2 బిలియన్‌ డాలర్లు), సిటాక్స్‌ హోల్డింగ్స్‌ (500 మిలియన్‌ డాలర్లు) మాత్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. అదే సమయంలో దేశీయంగా పేరున్న ఆదిత్య బిర్లా ఫ్యామిలీ హౌస్‌ కేవలం 25

చివరి గంట కొనుగోళ్లతో లాభాల ముగింపు

Wednesday 11th December 2019

11900 పైన ముగిసిన నిఫ్టీ  173 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  ఆదుకున్న ఐటీ, ఫైనాన్షియల్‌ షేర్ల ర్యాలీ చివరి గంటలో వెలువెత్తిన కొనుగోళ్లతో మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 40,412 వద్ద స్థిరపడింది. నిప్టీ 53 పాయింట్లు పెరిగి 11,900పైన 11,910 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి గంటలో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ, ఆర్థిక, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ రంగాలకు అనూహ్యంగా

Most from this category