News


కోటక్‌ ఎంఎఫ్‌ అంతర్జాతీయ స్కీమ్‌ల విలీనం 

Tuesday 11th February 2020
personal-finance_main1581360868.png-31667

కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ.. కోటక్‌ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ (కేయూఈఎఫ్‌), కోటక్‌ వరల్డ్‌ గోల్డ్‌ (కేడబ్ల్యూజీ) ఫండ్‌లను కోటక్‌ గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ (కేజీఈఎం) స్కీమ్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇది ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఇప్పుడు విడిగా నడిచే ఈ పథకాల పెట్టుబడుల లక్ష్యాల్లో మార్పులకు అవకాశం లేకపోలేదు. కనుక ఇన్వెస్టర్లు తమ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి రావచ్చు.

 

విలీనమయ్యేవి..
కోటక్‌ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ నిర్వహణలో రూ.13.38 కోట్ల ఆస్తులున్నాయి. యూఎస్‌ స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుంది. అలాగే, కోటక్‌ గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ పథకం నిర్వహణలో రూ.34.2 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈ పథకం ఎమర్జింగ్‌ మార్కెట్లలోని షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. అలాగే, కేడబ్ల్యూజీ పథకం నిర్వహణలో రూ.49.6 కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులున్నాయి. బంగారం మైనింగ్‌ కంపెనీల్లో పరోక్షంగా ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇకపై ఇవి కేజీఈఎంలో విలీనమవుతాయి. ఇన్వెస్టర్లకు ఆ మేరకు కేజీఈఎం యూనిట్లను కేటాయిస్తారు.

 

విలీనం ఎందుకు?
‘‘ఈ రెండు కేటగిరీలు థీమ్యాటిక్‌. దీంతో ఇన్వెస్టర్ల డిమాండ్‌ సైక్లికల్‌గా ఉంటోంది. స్థిరీకరణ కోసమే విలీనం చేస్తున్నాం’’ అని కోటక్‌ ఏఎంసీ సీఐవో లక్ష్మీ అయ్యర్‌ తెలిపారు. అంతర్జాతీయ పథకాలు కావడం, ఆస్తులు స్వల్ప మొత్తంగా ఉండడంతో విలీనం చేస్తుండొచ్చని ముంబైకి చెందిన అనలిస్ట్‌ కునాల్‌వలీనా పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ఈ పథకాల నుంచి తప్పుకోవాలనుకుంటే ఈ నెల 25 వరకు అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లకు ఎటువంటి ఎగ్జిట్‌ చార్జీ విధించరు.

 

ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?
కేయూఈఎఫ్‌, కేడబ్ల్యూజీ రెండూ కోటల్‌ గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌లో విలీనం అవుతున్నందున.. ఈ ఫండ్‌కు యూఎస్‌ ఈక్విటీలు, గోల్డ్‌ మైనింగ్‌ కంపెనీల్లో ప్రస్తుతానికి ఎక్స్‌పోజర్‌ లేదు. అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు, బంగారం మైనింగ్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న ఉద్దేశంతో వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టయితే.. తాజా విలీనం నేపథ్యంలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమే మంచిది. కేజీఈఎం అన్నది మరింత వైవిధ్యంతో కూడినదని, ఎన్నో మార్కెట్లలో ఎక్స్‌పోజర్‌తో ఉంటుందని లక్ష్మీ అయ్యర్‌ తెలిపారు.You may be interested

మరికొంత కరెక్షన్‌కు అవకాశం!

Tuesday 11th February 2020

నిఫ్టీ వరుసగా రెండో సెషన్‌లో సోమవారం నష్టపోయింది. అయితే కీలకమైన 12,050 స్థాయిలకు దిగువకు వచ్చేసి 12,031 వద్ద క్లోజయింది. దీంతో సూచీ 50 ఈఎంఏ, 20ఈఎంఏ, 13ఈఎంఏలను కోల్పోయినట్టయింది. దీంతో నిఫ్టీకి 12,100 నిరోధ స్థాయిగా పనిచేస్తుందని, ఇది అధిగమించి క్లోజయితే మరికొంత ర్యాలీకి అవకాశం ఉంటుందని, దిగువ వైపున 11,970-11,890 మద్దతు స్థాయిలుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.    ‘‘నిర్మాణాత్మకంగా చూస్తే నిఫ్టీ పుల్‌బ్యాక్‌ (ఇటీవలి నష్టాల తర్వాత ర్యాలీ)

షార్ట్‌టర్మ్‌కు స్ట్రాంగ్‌ సిఫార్సులు

Monday 10th February 2020

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే డజన్‌ స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ 1. బయోకాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 325. స్టాప్‌లాస్‌ రూ. 300. బలమైన ప్రైస్‌వాల్యూం బ్రేకవుట్‌ సాధించింది. ఏడీఎక్స్‌ సహా పలు ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి.  2. టాటామోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 190. స్టాప్‌లాస్‌ రూ. 167. బడ్జెట్‌ అనంతరం మంచి ర్యాలీ జరుపుతోంది. చార్టుల్లో హయ్యర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ ఏర్పడడం అప్‌ట్రెండ్‌

Most from this category