News


ఫండ్స్‌ విలీనమైనప్పుడు పన్ను పోటు ఉంటుందా ?

Monday 16th December 2019
news_main1576466902.png-30238

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వాల్యూ రీసెర్చ్‌)

ప్ర: నా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) ఖాతా త్వరలోనే మెచ్యూర్‌ కానున్నది. అయితే నాకు ఈ మెచ్యురిటీ మొత్తం మరో పదేళ్ల తర్వాతనే అవసరం. నా కూతురి పైచదువుల కోసం ఈ డబ్బును వినియోగించుకోవాలనేది నా ఆలోచన. మరో ఐదేళ్లు ఈ ఖాతాను పొడగించడమంటారా ? లేక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా?
శ్రీకాంత్‌, విజయవాడ 
జ: దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి పీపీఎఫ్‌ కంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్తమం. అయితే పీపీఎఫ్‌కు ఉండే ప్రయోజనాలు పీపీఎఫ్‌కు ఉన్నాయి. పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను భారం ఉండదు. స్థిర ఆదాయ మదుపు సాధనాల్లో పీపీఎఫ్‌ ఉత్తమమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎలాంటి నష్ట భయం ఉండదు. పైగా మెచ్యురిటీ తీరిన తర్వాత వచ్చే మొత్తంపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీ పాప పైచదువుల కోసం ఇతర మార్గాల్లో మదుపు చేసే డబ్బులు కూడా అందుబాటులో ఉంటే పీపీఎఫ్‌ను కొనసాగించండి. స్థిరదాయ మదుపు సాధనాల్లో పీపీఎఫ్‌ ఉత్తమమైనది కాబట్టి మీ మదుపులో కొంత భాగం పీపీఎఫ్‌లో ఉండటం మంచిదే. అలా కాకుండా మీ పాప పై చదువులకు ఇదొక్కటే అధారమైనప్పుడు మాత్రం ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. పీపీఎఫ్‌లో మీ మదుపు వార్షిక వృద్ధి ప్రస్తుతం 8 శాతమే. అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో అయితే అంతకు మించి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 


ప్ర: నా వయస్సు 33 సంవత్సరాలు. నా భార్య వయస్సు 30 సంవత్సరాలు. ఇద్దరమూ ఉద్యోగస్తులమే. గృహ రుణం తీసుకొని సొంత ఇల్లు కొనుక్కోవాలా ? లేక ఎంతో కొంత అద్దె కడుతూ అద్దె ఇంట్లో ఉండాలా ? అనే విషయమై తర్జనభర్జన పడుతున్నాం. నగర శివార్లలో ఒక ప్లాట్‌ ఉంది. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మాకు తగిన సలహా ఇవ్వండి. 
-సురేశ్‌, పల్లవి, హైదరాబాద్‌ 
జ: మీకు నగర శివార్లలో ఒక స్థలం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పక్కన పెట్టండి. మీరు తక్షణం నిర్ణయించుకోవలసింది. సొంత ఇల్లు సమకూర్చుకోవడమా ? లేక అద్దె ఇంట్లో ఉండటమా ? అనే విషయమే. దీంట్లో ప్రతి దానికి దేనికి ఉండే అనుకూలతలు, ప్రతికూలతలు దానికి ఉన్నాయి. సొంత ఇల్లు ఉంటే, అదో భరోసా, సంతృప్తి,  ఎంత ఖరీదైన, సౌకర్యవంతమైన అద్దె ఇంట్లో ఉన్నా, ఈ సంతృప్తి, భరోసా లభించదు. అద్దె ఇంట్లో ఉంటే, ఇంటి యజమానికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా మనమే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. మంచి ఇంటి యజమాని దొరికి సౌకర్యవంతమైన అద్దె ఇల్లు దొరికితే, అద్దె ఇంట్లో కొనసాగడం మంచి నిర్ణయమే. సొంత ఇల్లు ఉంటే మన వృద్ధి, అవసరాలు, ఎదుగుదల ఆ ఇల్లు ఉన్న ప్రాంతానికే పరిమితమయ్యే ప్రమాదమూ ఉంది.  వేరే నగరాల్లో మంచి ఉద్యోగం లభించినా, సొంత ఇల్లు ఉందన్న కారణంగా ఆ ఉద్యోగాలను వదులుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. పిల్లల చదువు, మన ఆరోగ్య అవసరాలు.. ఇలాంటి కొన్ని అంశాలపై సొంత ఇంటి ప్రభావం ఉంటుంది. అలాగే సొంత ఇంటి అవసరాలు మన జీవితం వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు మీరు 30-40 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మీతో పాటు ఉంటారు. అప్పుడు మీకు త్రీ, లేదా ఫోర్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అవసరం అవుతుంది. పిల్లలు పై చదువులకు వెళ్లినప్పుడు, లేదా ఉద్యోగం నిమిత్తం వేరే నగరాలకు వెళ్లినప్పుడు మీకు టూ బెడ్రూమ్‌ ఇల్లు సరిపోతుంది. ఈ అంశాలన్నింటిని బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోండి. గృహ రుణం ద్వారా సొంత ఇంటిని సమకూర్చుకోవాలనుకుంటే, రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది మీరు చెల్లించే ఈఎంఐ... మీ జీతంలో మూడో వంతు కంటే మించకూడదు. అంత మొత్తానికే పరిమితమయ్యేలా గృహ రుణం తీసుకోండి. రెండోది. మీరు సొంత ఇంట్లోనే ఉంటూ, అద్దె డబ్బును ఆదా చేయాలి. ఈ అద్దెనే ఈఎంఐగా భావించుకోవాలి. 

ప్ర: నేను కొంత మొత్తా‍న్ని గతంలో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. ఇప్పుడు ఈ ఫండ్‌ మరో ఫండ్‌లో విలీనమవుతోంది. ఈ విలీనం వల్ల ఏమైనా ప్రతికూల ప్రభావం ఉంటుందా? నేను ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాన్నే కొత్త ఫండ్‌కు బదిలీ చేస్తారా?  దానిపై వచ్చిన రాబడులను కూడా బదిలీ చేస్తారా? ఫండ్స్‌ విలీనమైనప్పుడు పన్ను భారం ఏమైనా ఉంటుందా? 
-ఖయ్యూమ్‌, విశాఖపట్టణం 
జ: మ్యూచువల్‌ ఫండ్స్‌ విలీనం విషయంలో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం, దానిపై వచ్చిన రాబడులు.. ఇలాంటి తేడాలు ఏమీ ఉండవు. మొత్తం ఒకటిగానే పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఒక ఫండ్‌లో గతంలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ఇప్పుడు దానిపై రాబడి రూ.15,000 అయిందనుకుందాం. మొత్తం రూ.1.15 లక్షలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌ ఎన్‌ఏవీ రూ.100 ఉంది. మీ దగ్గర ఈ ఫండ్‌ యూనిట్లు వంద ఉన్నాయనుకుందాం. అప్పుడు దీని విలువ రూ.10,000 అవుతుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌.. రూ. 200 ఎన్‌ఏవీ ఉన్న ఫండ్‌లో విలీనమవుతోంది అనుకుందాం. అప్పుడు మీకు ఈ కొత్త ఫండ్‌ యూనిట్లు 50 లభిస్తాయి. అంటే మీ పెట్టుబడి విలువలో మార్పు ఉండదన్న మాట. ఫండ్‌ యూనిట్లలలోనే మార్పు ఉంటుంది.  ఇంకా వివరంగా చెప్పాలంటే, మ్యూచువల్‌ ఫండ్స్‌ విలీనమంటే  మీ ప్రస్తుత ఫండ్‌ నుంచి మీ యూనిట్లను ఉపసంహరించుకొని, కొత్త ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడం అన్నమాట. ఫండ్స్‌ విలీనమైనప్పుడు మీకు ఎలాంటి పన్ను పోటు ఉండదు. అయితే పన్నులు మదింపు చేసేటప్పుడు మొదటి ఫండ్‌(విలీనమవుతున్న ఫండ్‌) యూనిట్లను కొనుగోలు చేసిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు.
 You may be interested

పీఎన్‌బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు

Monday 16th December 2019

- రూ. 2,617 కోట్ల మేర డైవర్జెన్స్‌ - ఆర్‌బీఐ ఆడిట్‌లో వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్‌లో వెల్లడైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ లెక్కల ప్రకారం పీఎన్‌బీ స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్‌బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్‌పీఏలుగా చూపించింది.

పాన్‌- ఆధార్‌ లింకింగ్‌ గడువు తేదీ డిసెంబర్‌ 31

Monday 16th December 2019

న్యూఢిల్లీ: పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 గడువు తేదీగా కేంద్ర ప్రత్యక్ష ప‌న్నుల విభాగం (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్‌ కార్డును పొంది ఉండి, ఆధార్‌ పొందడానికి అర్హులైన ప్రతి

Most from this category