News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గట్టెక్కుతుంది..!: సుందరం ఏఎంసీ 

Thursday 6th June 2019
Markets_main1559845564.png-26141

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ చెల్లింపులను వాయిదా వేసిన నేపథ్యంలో ఈ సంస్థ పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకం సడలుతుండగా, సుందరం ఏఎంసీ ఎండీ సునీల్‌ సుబ్రమణ్యం మాత్రం సంస్థ నిలదొక్కుకుంటున్న ఆశాభావంతో ఉన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తిరిగి చెల్లింపులు చేయగలదన్న నమ్మకం తమకు ఉన్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల విశ్వాసం కోల్పోవద్దని సూచించారు.  

 

చెల్లింపులకు ఏడు రోజుల గడువు (గ్రేస్‌ పీరియడ్‌)ను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కోరడం కాంట్రాక్టులో భాగమేనన్నారు సునీల్‌ సుబ్రమణ్యం. రూ.1,000 కోట్ల వడ్డీ బకాయి పడిందని, వాటిని చెల్లింపులు చేయగలదన్నారు. 10వ తేదీ నాటికి ఇతర నిధులు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోందని, వారు ఇప్పటికీ తమ వాదనకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రైవేటు ఈక్విటీ రూపంలో నిధులు వస్తాయన్న నమ్మకం కంపెనీ యాజమాన్యం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో వాటాల విక్రయం అన్నది భవిష్యత్తులో సాధ్యమవుతుందన్నారు.  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు నుంచి తమ ఎక్స్‌పోజర్‌ తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘95,000 కోట్ల మార్కెట్‌ రుణాల్లో 50 శాతం రిటైల్‌ రుణాలే. ఇప్పటికీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆర్థికంగా పటిష్టంగానే ఉంది. స్వల్పకాల లిక్విడిటీ (నిధుల లభ్యత) సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ కోసం కంపెనీ నిజాయతీతో కూడిన ప్రయత్నాలు చేసింది. అయితే, ఇవి స్వల్ప కాలంలో సఫలమయ్యేవి కావు. ఆర్థికంగా బలంగానే ఉన్న  కంపెనీ కావడంతో సంక్షోభాన్ని గట్టెక్కేందుకు వ్యూహాత్మక వాటాదారును తీసుకురాగలదు. ఏడు రోజుల వ్యవధిలోపు కంపెనీ చెల్లింపులు చేయగలదని ఇప్పటికీ నమ్ముతున్నాం. ఇప్పటి వరకు రూ.30,000-40,000 కోట్ల బకాయిలను చెల్లించింది. రానున్న రెండు నెలలు కీలకం. ఒక్కసారి ఈ కాలాన్ని (గరిష్టంగా సెప్టెంబర్‌ వరకు) అధిగమిస్తే, కంపెనీ తిరిగి చెల్లించాల్సిన పెద్ద మొత్తాలు ఏవీ లేవు. కనుక ఇది కంపెనీ అధిగమించాల్సిన అత్యవసర పరిస్థితి లాంటిది. కంపెనీ ప్రయత్నాలు ఫలితిస్తే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అంతా సాధారణ స్థితికి చేరుతుంది’’ అని సునీల్‌సుబ్రమణ్యం వివరించారు. ఇన్వెస్టర్లు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వంటి సంస్థల్లో ఎక్స్‌పోజర్‌ ఉన్న ఫండ్స్‌లో కొనసాగాలని కొనసాగించాలని సూచించారు. దీనివల్ల కొంత కాలానికి భారీ లాభాలు వస్తాయన్నారు.
 



You may be interested

చిన్నవే... కానీ సత్తా ఉన్నవి..!

Thursday 6th June 2019

లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు నిజానికి వేగంగా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీ మూలాలు బలంగా ఉండాలి, మంచి యాజమాన్యం ఉండాలి... ఇలా కొన్ని అంశాలు ఆయా కంపెనీల వ్యాపార భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇన్వెస్టర్లలో కొందరు అధిక రిస్క్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వారి కావాల్సింది అధిక రాబడులు. మరి కంపెనీ వృద్ధి అవకాశాలతో పోలిస్తే చౌకగా లభించే మూడు చిన్న కంపెనీల వివరాలను వ్యాల్యూ

ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 554 పాయింట్లు డౌన్‌

Thursday 6th June 2019

  178 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ ఆర్‌బీఐ పాలసీలో మార్కెట్‌ను ఆశ్చర్యపర్చే అంశాలేవీ లేకపోవడం, లిక్విడిటీ సంక్షోభ నివారణకు స్పష్టమైన చర్యల్నిప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురైన మార్కెట్‌ గురువారం భారీ నష్టంతో ముగిసింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే పావుశాతం మాత్రమే వడ్డీరేట్ల కోతను ఆర్‌బీఐ ప్రకటించడం, ఆ అంశాన్ని ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్‌ చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రేట్ల ప్రభావిత షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిపారు. మరోవైపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌...చెల్లింపుల్లో డిఫాల్డ్‌కావడం

Most from this category