STOCKS

News


‘టాటా ఫోకస్డ్‌ ఈక్విటీ’లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?

Tuesday 19th November 2019
personal-finance_main1574186452.png-29709

టాటా మ్యూచువల్‌ ఫండ్‌ (ఏఎంసీ) టాటా ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ పేరుతో నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 29న ముగియనుంది. ఆసక్తిగల ఇన్వెస్టర్లు గడువులోపు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, ముందుగా నిపుణులు, ఫైనాన్షియల్‌ ప్లానర్ల అభిప్రాయాలను తెలుసుకోవడం ఉపయోగకరం. 

 

యాక్టివ్‌గా నిర్వహించే ఏ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని అయినా రికమెండ్‌ చేయడానికి స్థిరమైన ఫండ్‌ నిర్వహణ బృందం అవసరమన్నది ఫైనాన్షియల్‌ ప్లానర్ల అభిప్రాయం. టాటా ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పునరాలోచించుకోవాలని ఆర్థిక సలహాదారుల సూచన. దీనికి బదులు ఇదే విభాగంలో మంచి ట్రాక్‌ రికార్డు (ఇప్పటికే రాబడుల చరిత్ర ఉన్నవి) కలిగిన పథకాల నుంచి ఎంచుకోవాలని పేర్కొంటున్నారు. ‘‘ఫోకస్డ్‌ ఫండ్స్‌ అన్నవి ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో ఉంటాయి. ఇక్కడ స్టాక్‌ ఎంపిక చాలా కీలకం. కనుక పెట్టుబడులు కేటాయించుకునే ముందు ట్రాక్‌ రికార్డును విశ్లేషించుకోవాలి’’ అని రూంగ్టా సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ హర్షవర్ధన్‌ రూంగ్టా సూచించారు. ఎన్‌ఎఫ్‌వో సమయంలోనే ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరేమీ కాదన్నారు. సంబంధిత పథకం పోర్ట్‌ఫోలియో నిర్మాణం జరిగిన తర్వాత చూసి ఇన్వెస్ట్‌ చేయడమే మంచిదని సూచించారు. 

 

‘‘ఉన్నత స్థాయి నాయకత్వం, ఫండ్‌ నిర్వహణ బృందాలు టాటా మ్యూచువల్‌ ఫండ్‌లో గతంలో తరచూ మార్పులకు లోనయ్యేవి. కనుక నిర్వహణ బృందం స్థిరపడే వరకు ఇన్వెస్టర్లు వేచి చూడాలి’’ అని ప్లాన్‌రూపీ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సూచించారు. ప్రతిట్‌ భాబేను సీఈవోగా, రాహుల్‌సింగ్‌ను సీఐవోగా గతేడాది టాటా మ్యూచువల్‌ ఫండ్‌ నియమించుకుంది. దీంతో టాటా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పనితీరు గత ఏడాది కాలంలో మెరుగుపడడం గమనార్హం. టాటా ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ అన్నది గత 15 నెలల కాలంలో టాటా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) నుంచి వచ్చిన నాలుగో ఎన్‌ఎఫ్‌వో. ఇది ఫోకస్డ్‌ ఫండ్స్‌ విభాగం కిందకు వస్తుంది. పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 30 స్టాక్స్‌ వరకే ఉంటాయి. రూపేష్‌ పటేల్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. You may be interested

ఈ కంపెనీల ప్రమోటర్ల వాటాల్లో మార్పులు

Tuesday 19th November 2019

మార్కెట్లు దాదాపు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ సమయంలో ఏ స్టాక్‌ను కొనుగోలు చేయాలన్న మీమాంసతో ఇన్వె‍స్టర్లున్నారు. మార్కెట్లో ర్యాలీ చేసే స్టాక్స్‌ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాలని భావిస్తున్నారా..? అయితే, స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందుగా.. కంపెనీల ప్రమోటర్ల వాటా గణాంకాలపై ఓ సారి కన్నేయాల్సిందే. ఈ గణాంకాలు స్టాక్‌ ఎంపికలో మీకు సాయపడొచ్చు.    జూన్‌ త్రైమాసికం నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి బీఎస్‌ఈ500 సూచీలోని 54 కంపెనీల్లో ప్రమోటర్ల

వారం గరిష్టం వద్ద నిఫ్టీ ముగింపు

Tuesday 19th November 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులతో ఊగిసలాడిన సూచీలు.. బ్యాంకింగ్‌,  టెలికాం షేర్ల ర్యాలీతో పాటు ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీతో చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 185.51 పాయింట్లు పెరిగి 40,469.70 వద్ద, నిఫ్టీ 55.60 పాయింట్ల లాభంతో 11,940.10 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ ఇండెక్స్‌ ఈ ముగింపు స్థాయి వారం రోజుల గరిష్ట స్థాయి కావడం విశేషం. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ

Most from this category