ఎన్పీఎస్ ఇన్వెస్టర్లూ ఇది విన్నారా...?
By Sakshi

జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఆగస్ట్ 1 నుంచి పరిపాలనా రుసుం తిరిగి అమల్లోకి వచ్చింది. ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువపై వార్షికంగా 0.005 శాతాన్ని అడ్మినిస్ట్రేటివ్ చార్జీ కింద ఎన్పీఎస్ ఫండ్స్ మేనేజర్లు ఇకపై రాబట్టుకుంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులను కొంత మేర ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్పీఎస్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ అఖిలేశ్ కుమార్ చందాదారులకు నోటీసు ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులు అందరి దృష్టికి తీసుకొస్తున్న విషయం... పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం మేరకు... అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను పెట్టుబడులపై వార్షికంగా 0.005 శాతం మేర రోజువారీగా మినహాయించడం 2019 ఆగస్ట్ 1 నుంచి ప్రారంభిస్తున్నాం’’ అన్నది అందులోని సారాంశం. నిజానికి ఈ చార్జీలను ఈ ఏడాది జనవరి 25 నుంచే నిలిపివేశారు. దాన్నే ఆరు నెలల తర్వాత మళ్లీ అమలు చేస్తున్నారు కనుక ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎన్పీఎస్ పథకం యులిప్‌లు, ఈఎల్ఎస్ఎస్ పథకాలతో పోల్చి చూసినప్పడు వ్యయాల పరంగా చాలా చౌక పథకమనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి 0.005 శాతం పరిపాలనా చార్జీలు విధించడం చాలా స్వల్పమొత్తంగానే చూడాలంటున్నారు నిపుణులు. ‘‘ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడులపై ట్రస్ట్ రూ.50ను చార్జీగా తీసుకుంటుంది. ఇది రాబడులపై ప్రభావం చూపిస్తుంది. అయితే, ఈ చార్జీ ఎక్కువేమీ కాదు. కనుక దీని ప్రభావం ఒకరి పెట్టుబడులపై నామమాత్రంగానే ఉంటుంది’’ అని ముంబైకి చెందిన మనీకాల్క్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ ఆరోరా తెలిపారు. చందాదారులు ఈ చార్జీలను గతంలోనూ చెల్లించారని, దాన్నే మళ్లీ అమలు చేస్తున్నట్టు గుర్తించాలన్నారు. కనుక ఇదేమీ అదనపు చార్జీ కాదన్నారు. ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
You may be interested
ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయొచ్చు: జగన్నాథం
Sunday 4th August 2019ఆటోమొబైల్ రంగంలో మూడు నాలుగేళ్ల కాలంలో మంచి రాబడులకు అవకాశం ఉందే కానీ, అది మూడు నాలుగు నెలల్లో మాత్రం కాదని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల పేర్కొన్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆటోమొబైల్ రంగం గురించి మాట్లాడుతూ... ఆటోమొబైల్ రంగంలో మార్కెట్ లీడర్లుగా ఉన్న కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికీ తక్కువ విలువల వద్ద లేవని, 50 శాతం వరకూ
డిసెంబర్‌కల్లా 10,300 స్థాయికి నిఫ్టీ!
Saturday 3rd August 2019కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులలో 1 శాతం రిస్క్ మాత్రమే తీసుకోండి మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బేర్ మార్కెట్లో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాయని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. 12,000 మార్కు ఇక కలే! బడ్జెట్ తర్వాత నుంచి మార్కెట్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటి వరకు బీఎస్ఈలో ఏకంగా రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ముందుకు