News


రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 13th January 2020
personal-finance_main1578886543.png-30875

ప్ర: రిటైర్మెంట్‌ అవసరాల కోసం కొంత మొత్తాన్ని కూడబెట్టాలనుకుంటున్నాను. వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకుందామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? 
సతీశ్‌ బాబు, హన్మకొండ
జ: రిటైర్మెంట్‌ అవసరాల కోసం రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయం. అయితే ఈ ని«ధి కోసం వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల రిటైర్మెంట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడమే సరైన నిర్ణయం కాదు. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేయడం కోసం ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. మీరు రిటైర్‌ కావడానికి మరో 30 సంవత్సరాలు ఉన్నట్లయితే, మీరు ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు చేయడం ఆరంభించండి. ఒక వేళ మీరు మరో పదేళ్లలోనే రిటైరయ్యేటట్లు ఉన్నా కూడా ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఈక్విటీ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. మార్కెట్‌ పతన బాటలో ఉన్నా, భయపడకుండా సిప్‌లను కొనసాగించండి. మీకు ఇంక్రిమెంట్‌ పెరిగినప్పుడల్లా లేదా కనీసం ఏడాదికి ఒకసారైనా సిప్‌ మొత్తాన్ని కనీసం పది శాతం మేర అయినా పెంచండి. కనీసం రెండేళ్లకొకసారైనా మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ పనితీరును మదింపు చేయండి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా ఉంటే సిప్‌లను కొనసాగించండి. సంతృప్తికరంగా లేని పక్షంలో వేరే ఈక్విటీ ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి బదిలీ చేయడానికి కనీసం నాలుగేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకోండి.  ప్రి–ప్యాకేజ్‌డ్‌గా ఉండే రిటైర్మెంట్‌ ప్లాన్‌ల కంటే కూడా ఎవరికి వారు తమ సొంత అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రిటైర్మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్ణయాలు తీసుకోవాలి. 

ప్ర: నా కూతురు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, ఇటీవలే ఉద్యోగంలో చేరింది. ఇప్పటి నుంచే తనకు మదుపు చేయడం అలవాటు చేయాలనుకుంటున్నాను. దీంట్లో భాగంగానే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమని చెప్పాను. ముందుగా అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌తో మొదలు పెట్టాలా లేక ప్యూర్‌ ఈక్విటీ ఫండ్స్‌తో మొదలు పెట్టమంటారా ? 
-మాధురి, హైదరాబాద్‌ 
జ: చిన్న వయస్సులోనే మదుపువైపు మీ పాప ఆలోచనలను మళ్లించడం మంచి విషయం.  ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించుకోవడానికి, మీ పాపకు వచ్చే ఆదాయం కీలకాంశం కానున్నది. మీ పాప ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) వంటి ట్యాక్స్‌ సేవింగ్స్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేకుంటే అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ ఫండ్స్‌ తమ నిధుల్లో 65 శాతం మేర ఈక్విటీలోనూ, మరో 35 శాతం మేర డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ కేటాయింపుల కారణంగా మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు ఈ ఫండ్స్‌ పనితీరు దెబ్బతినకుండా ఉంటుంది. ఈ హైబ్రిడ్‌ ఫండ్స్‌లో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ప్యూర్‌ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కారణంగా మీ పాపకు మార్కెట్‌ స్థితిగతులు, ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, తదితర అంశాల పట్ల ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు చేయవచ్చు. పోర్ట్‌ఫోలియోలో కనీసం ఒక మిడ్‌ క్యాప్‌ ఫండ్‌నైనా చేర్చుకోవాలి. 

ప్ర: నేను  నాలుగేళ్ల క్రితం అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌లో రూ.1.7 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. దీనిపై 8.8 శాతం రాబడి వచ్చింది. దీనిపై నేను దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఈ ఫండ్‌లోనే కొనసాగించమంటారా? లేకుంటే ఈ మొత్తాన్ని ఫండ్‌ నుంచి ఉపసంహరించుకొని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయమంటారా? 
-ఈశ్వరరావు, విజయవాడ 
జ: ఈ మొత్తాన్ని  ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చుకోవలసిన అవసరం లేదు. మీకు వచ్చిన రాబడులపై మీరు 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఈ ఫండ్‌ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే.  సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌(ఎస్‌డబ్ల్యూపీ)ను అనుసరిస్తే, పన్ను భారం ఇంకా తక్కువగానే ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చితే ఈ తరహా ఫండ్స్‌లోనే పన్ను ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే రాబడిపై ప్రతీ ఏడాది పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్‌లో అయితే, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎనిమిది శాతం మేర మాత్రమే విత్‌డ్రాయల్స్‌ తీసుకుంటే, ఈ మొత్తంపైననే అదిన్నూ, దీంట్లో రాబడి వాటాపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు దీర్ఘకాలం పరంగా చూస్తే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే కూడా ఈక్విటీ ఫండ్సే మంచి రాబడులనిస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మన పెట్టుబడికి రక్షణనిస్తాయే కానీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనివ్వలేవు. అదే ఈక్విటీ ఫండ్స్‌లోనైతే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందవచ్చు. You may be interested

రికార్డు గరిష్టాల సమీపంలో సూచీల ప్రారంభం

Monday 13th January 2020

అమెరికా-చైనా ట్రేడ్‌డీల్‌పై మరో రెండు రోజుల్లో సంతకాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు రికార్డు గరిష్టస్థాయిలకు సమీపంలో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 192 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 41,792 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఈ సూచి గత రికార్డుస్థాయి 42,810 పాయింట్లకు మరో 18 పాయింట్ల దూరంలోనే వుండటం విశేషం. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,297 పాయింట్ల

ఇదేం గ్యాస్ ధరల విధానం..

Monday 13th January 2020

భారత్‌ తీరుపై ఐఈఏ ఆక్షేపణ న్యూఢిల్లీ: సహజ వాయువు ధర విధానానికి సంబంధించి భారత్ తీరును అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్రంగా ఆక్షేపించింది. అంతర్జాతీయంగా అత్యంత చౌక ప్రామాణిక ధరకు దేశీ గ్యాస్‌ రేటును ముడిపెట్టడం వల్ల .. తయారీ సంస్థలు ఉత్పత్తి పెంచుదామనుకున్నా.. ప్రోత్సాహకం లేకుండా పోతోందని పేర్కొంది. పర్యావరణానికి అనుకూలమైన గ్యాస్‌ ఉత్పత్తి మరింత పెరగాలంటే.. పన్నుల విషయంలో మిగతా ఇంధనాల తరహాలోనే దీనికి కూడా సమానస్థాయి

Most from this category