News


రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 26th August 2019
personal-finance_main1566792187.png-28005

  • ధీరేంద్ర కుమార్‌ సీఈవో వాల్యూ రీసెర్చ్‌ సీఈవో

ప్ర: నా వయస్సు 25 సంవత్సరాలు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా  ఇటీవలనే ఉద్యోగంలో చేరాను. 10 నుంచి 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? లేక మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? 

-శివాజీ, హైదరాబాద్‌
జ: మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ రెండింటిలో దేనినీ ఎంచుకోవద్దు. మీరు 10–15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మల్టీ–క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. మార్కెట్‌ బాగా లేని పరిస్థితుల్లో మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ల పనితీరు అధ్వానంగా  ఉంటుంది. ఇక ఇండెక్స్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, ఇప్పుడిప్పుడే ఈ ఫండ్స్‌ ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఎంచుకోవడానికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయి. మల్టీ–క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఉన్నా దాంట్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కానీ మన దగ్గర ఇండెక్స్‌ ఫండ్స్‌ అన్నీ లార్జ్‌ క్యాప్‌ ఫండ్సేనని చెప్పవచ్చు. ఇండెక్స్‌ ఫండ్‌లోని కొన్ని షేర్లు మంచి పనితీరు చూపించడంతో ఇండెక్స్‌ ఫండ్స్‌ చెప్పుకోదగ్గ రాబడులనిచ్చాయి.  అయితే భారత్‌లో ఇండెక్స్‌ ఫండ్స్‌ ఇంకా పుంజుకోలేదని నా భావన. ఇవి మరింత పటిష్టం కావడానికి మరి కొంత కాలం పడుతుంది. ఇక మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, పూర్తి మార్కెట్‌ సైకిల్‌లో మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌ మంచి పనితీరు చూపిస్తాయి. అందుకని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఇండెక్స్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ను కాకుండా మల్టీ–క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో 10–15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయండి. ఈ లోపున కనీసం రెండేళ్లకొకసారి ఫండ్‌ పనితీరు సమీక్షించండి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న మల్టీ–క్యాప్‌ ఫండ్‌ పనితీరు సరిగ్గా లేకపోయినా, ఇండెక్స్‌ ఫండ్స్‌ పనితీరు బాగా ఉన్నా, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ మల్టీ–క్యాప్‌ çఫండ్‌ నుంచి ఇండెక్స్‌ ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. 

ప్ర: నా వయస్సు 27 సంవత్సరాలు.  రిటైర్మెంట్‌కే ప్రత్యేకించి ఉన్న కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటూ మితృలు చెబుతున్నారు. నా రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? 
-కరుణాకర్‌, విజయవాడ 

జ: మీ నిర్ణయం సరైనది కాదు. మీరు క్రమశిక్షణగా ఇన్వెస్ట్‌ చేసి, మీరు రిటైరయ్యేదాకా, వాడుకోవడానికి వీల్లేనిదే రిటైర్మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌.  ప్రి–ప్యాకేజ్‌డ్‌ రిటైర్మెంట్‌ ప్లాన్లన్నీ పెట్టుబడులకు సంబంధించి అడ్డదిడ్డమైన నిబంధనలతో కూడుకొని ఉంటాయి.  పూర్తిగా రిటైర్మెంట్‌ ప్లాన్‌గా పరిగణించే ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌) కూడా దీనికి మినహాయింపు కాదు. ఎన్‌పీఎస్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా తన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 75 శాతం వరకే ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశం ఉంది.  25–28 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి  ఇది సరైన ఎంపిక కాదు అని నా భావన. మీలాంటి యువజనులు రిస్క్‌ పూర్తిగా భరించి  ఈక్విటీలోనే ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్‌–80 సీ కింద ఒక్క ఆర్థిక సంవత్సరంలో లభించే పన్ను మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను ఏదైనా ట్యాక్స్‌–సేవింగ్‌ ఫండ్‌లో ప్రతి ఏడాది ఇన్వెస్ట్‌ చేయండి. ఇదే మీ రిటైర్మెంట్‌ ప్లాన్‌గా ఎంచుకోండి. లేదా ఏదైనా ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేసే మార్గాన్నీ పరిశీలించవచ్చు. ఈ రెండు మార్గాల్లో దేనిని ఎంచుకున్నా, రిటైర్మెంట్ ఫండ్స్‌ ఇచ్చే రాబడుల కన్నా అధికమైన రాబడులనే మీరు పొందగలరు. 

ప్ర: ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌కు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మధ్య తేడా ఏమిటి ? ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌పై ఎక్కువ రాబడులు వస్తాయా ? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కేటగిరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ?
-స్వప్న, విశాఖపట్టణం 

జ: ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ తమ మొత్తం నిధుల్లో మూడింట ఒక వంతు ఈక్విటీలోనూ, మరో మూడింట ఒక వంతు ఆర్బిట్రేజ్‌ సాధనాల్లోనూ, మరో మూడింట ఒక వంతు స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ ఈక్విటీ ఫండ్స్‌ను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చడానికి లేదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అయితే అసలుకు, వడ్డీకి గ్యారంటీ ఉంటుంది. కాలపరిమితి తీరిన తర్వాత ఎంత రాబడులు వస్తాయో ఒక అంచనా ఉంటుంది. ఒక పరిమితి దాటిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రాబడులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ రాబడులు స్టాక్‌ మార్కెట్‌ పనితీరును బట్టి ఉంటాయి. ఇ‍క ఏ కేటగిరి ఫండ్‌ ఎలాంటి రాబడులు ఇస్తుందో తెల్సుకోవడానికి పోల్చి చూడడమే సరైన విధానం. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు... ఇలా కాలపరిమితిని నిర్దేశించుకొని ఆ యా కాలపరిమితిల్లో ఏ యే కేటగిరి ఫండ్‌ ఎంతెంత రాబడులు ఇచ్చిందో మదింపు చేయాలి. ఇక మీరు ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఆల్ట్రా-షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ను ఎంచుకోండి. కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్‌ను కానీ, మల్టీ-క్యాప్‌ ఫండ్‌ను గానీ ఎంచుకోండి. మార్కెట్‌ ఒడిదుడుకులున్నప్పటికీ, అధైర్యపడకుండా పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఒక మల్టీక్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోండి. మార్కెట్‌ పతన సమయంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ నష్టాలను చూపించినా, పదేళ్ల కాలంలో మంచి రాబడులను ఇస్తాయి. 

 



You may be interested

బ్యాంకు మోసాలపై సీవీసీ కమిటీ

Monday 26th August 2019

న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే మోసం ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వీటిపై దృష్టి సారించింది. రూ. 50 కోట్ల పైబడిన బ్యాంకు మోసాలను పరిశీలించి, తగు చర్యలు సిఫార్సు చేసేందుకు బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌పై అడ్వైజరీ బోర్డు (ఏబీబీఎఫ్‌) ఏర్పాటు చేసింది. మాజీ విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ దీనికి సారథ్యం వహిస్తారు. గతంలో దీన్ని అడ్వైజరీ బోర్డ్ ఆన్ బ్యాంక్, కమర్షియల్‌ అండ్ ఫైనాన్షియల్

ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ

Monday 26th August 2019

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. "ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే

Most from this category