STOCKS

News


మనీ మార్కెట్‌ ఫండ్‌ అంటే ఏమిటి ?

Monday 2nd December 2019
personal-finance_main1575257695.png-29991

ప్ర: నేను గత కొంత కాలంగా ఎల్‌ అండ్‌ టీ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌(గతంలో ఎల్‌ అండ్‌ టీ ఇండియా ప్రుడెన్స్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా ? ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా? మనీ మార్కెట్‌ ఫండ్‌ అంటే ఏమిటి ? దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? 
అరుణ్‌, హైదరాబాద్‌

జ: ఎల్‌ అండ్‌ టీ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ మంచి పనితీరునే కనబరుస్తోంది. అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ కేటగిరీలో ఇది ఒక మంచి ఫండేనని చెప్పవచ్చు. ఈ తరహా ఫండ్స్‌ల్లో ఉండే 75:25 డెట్, ఈక్విటీ కేటాయింపు విధానం కారణంగా మీ పెట్టుబడులకు స్థిరత్వం లభించడమే కాకుండా వృద్ధి కూడా ఉంటుంది. మార్కెట్లు పతనమవుతున్నప్పుడు మీ పెట్టుబడి హరించుకు పోకుండా చూస్తుంది. ఈ తరహా ఫండ్స్‌ల్లో రీ బ్యాలెన్సింగ్‌ సులభంగా ఉంటుంది.  మ్యూచువల్‌ ఫండ్స్‌లో మొదటగా ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వాళ్లు ఈ తరహా అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌నే ఎంచుకోవాలి. ఇక ఏ తరహా ఇన్వెస్టర్లకైనా ఈ తరహా ఫండ్స్‌ సరైనవే. 
ఇక మీ రెండో ప్రశ్న విషయానికొస్తే, మనీ మార్కెట్‌ ఫండ్‌ ఒక విధమైన మ్యూచువల్‌ ఫండ్‌  వంటిదే. కమర్షియల్‌ పేపర్స్‌, ట్రెజరీ బిల్స్‌, సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌  వంటి అధిక లిక్విడిటీ ఉన్న ఏడాది లోపు కాలపరిమితి ఉండే మనీ మార్కెట్‌ సాధనాల్లో  ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఏ తరహా ఇన్వెస్టర్‌ అయినా ఈ మనీ మార్కెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. స్వల్ప కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఈ ఫండ్‌ను ఎంచుకోవాలి. బ్యాంక్‌ డిపాజిట్లకు ప్రత్నామ్నాయంగా వీటిని పరిశీలించవచ్చు. 


ప్ర: ప్రస్తుతమున్న మార్కెట్‌ పరిస్థితుల్లో నా పోర్ట్‌ఫోలియోలో ఏ రకమైన ఫండ్స్‌ల్లో ఎంతెంత ఇన్వెస్ట్‌ చేయాలి? ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి పొందడం నా లక్ష్యం. తగిన సూచనలివ్వండి. 
-కిశోర్‌, విజయవాడ
జ: ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో ఏ రకమైన ఫండ్స్‌ ఉండాలి,  ఏ రకమైన ఫండ్స్‌ల్లో ఎంతెంత ఇన్వెస్ట్‌ చేయాలనే విషయం మార్కెట్‌ పరిస్థితులను బట్టి నిర్ణయించుకోకూడదు. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు మదుపు చేయగల మొత్తం, మీరు ఎంత కాలం మదుపు చేయగలరు. మీరు ఎంత రిస్క్‌ భరించగలరు, మార్కెట్‌ పట్ల మీ అవగాహన తదితర అంశాలను బట్టి ఈ నిర్ణయం ఉంటుంది. మార్కెట్లతో మీకు ఉన్న అనుభవాన్ని బట్టి మార్కెట్‌ను అర్థం చేసుకోవడం వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మార్కెట్‌పై బాగా అవగాహన ఉన్న ఇన్వెస్టర్‌కు, మార్కెట్‌ పతనమవుతున్నప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. అదే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వ్యక్తికి మార్కెట్‌ పతనమవుతున్నప్పుడు దూరంగా ఉండాలని భావిస్తాడు. అందుకని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు మొదలు పెట్టినప్పుడు ముందుగా  అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.  ఈ ఫండ్స్‌లో ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మార్కెట్‌ గమనం, మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పట్ల మీకు ఒకింత అవగాహన వస్తుంది. అప్పుడు ఒకటి లేదా రెండు మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మీరు మార్కెట్‌కు సంబంధించి అన్ని సెగ్మెంట్స్‌పై ఒక అవగాహన వస్తుంది. మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ను తగ్గించుకోవడం కోసం కనీసం ఒక్కటైనా ఇంటర్నేషనల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. ఎవరో చెప్పినవి కాకుండా మీరు స్వయంగానే మదింపు చేసి ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలో ఆ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఇంత సమయం, అంత ఓపిక లేనివారు మధ్యేమార్గంగా ఒకటి లేదా మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించాలి. మీరు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తే, పన్ను ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలి. దీని కోసం ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. 

ప్ర: నేను ఇటీవలనే రిటైరయ్యాను. గత పదిహేనేళ్లుగా పీపీఎఫ్‌(పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మెచ్యూర్‌ అవుతుంది. ఈ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు. దీనిని మరో ఐదేళ్ల పాటు పొడిగించమంటారా ? లేదా ఈ మెచ్యూరిటీ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ?
-మాధ్యూస్‌, విశాఖపట్టణం 
జ:  పీపీఎఫ్‌లో పదిహేనేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పీపీఎఫ్‌లో  కంటే ఈక్విటీ ఫండ్స్‌ల్లోనే ఎక్కువ రాబడులు వస్తాయి. పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు ఆర్జించే వడ్డీకి పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాను మరో ఐదేళ్లపాటు కొనసాగిండచమే మంచిది. పన్ను ప్రయోజనాలు మీకు ప్రాధాన్యతా అంశం కాకపోయినా, మీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటివరకూ ఈక్విటీకి స్థానం లేకపోయినా, పీపీఎఫ్‌ ఖాతా మెచ్యురిటీ మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మరికొంత మొత్తాన్ని అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. 

 You may be interested

మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం

Monday 2nd December 2019

ఈ నెల 5న ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5 శాతానికి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్‌బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ ఇప్పటి వరకు ప్రతీ భేటీలోనూ ఎంతో కొంత రేట్లను తగ్గిస్తూనే

కాల్‌ చార్జీలకు రెక్కలు..

Monday 2nd December 2019

50 శాతం దాకా పెంపు  పరిమితి దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు  కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ 3 నుంచి వొడా-ఐడియా, ఎయిర్‌టెల్‌ ప్లాన్లు అమల్లోకి 6 నుంచి జియో పెంపు అమల్లోకి న్యూఢిల్లీ: చౌక మొబైల్‌ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ-పెయిడ్‌ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా-ఐడియా, ఎయిర్‌టెల్‌

Most from this category