News


గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్‌ చేయోచ్చా?

Monday 5th August 2019
personal-finance_main1564990837.png-27542

  • ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 
    ​​​​​​​

ప్ర: గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (జీఎఫ్‌ఓఎఫ్‌)లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో నెలకు కొంత మొత్తాన్ని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆరేళ్ల వయస్సున్న నా చిన్నారికి పెళ్లి కానుకగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఇవ్వాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? 
-ఆనంద్‌, హైదరాబాద్‌
: సాధారణంగా పుత్తడిని రెండు మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. ఒకటి ఆభరణాలు/బిస్కెట్ల రూపంలో. మరొక మార్గం గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా కొనుగోలు చేయడం. డీమ్యాట్‌ ఖాతా ద్వారా షేర్లను కొనుగోలు చేసినట్లే, గోల్డ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. బులియన్‌ మార్కెట్‌ ధరలకనుగుణంగా ఈ గోల్డ్‌ ఈటీఎఫ్‌ ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ఇక గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అనేది గోల్డ్‌ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేస్తుంది. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేసినట్లుగానే మీరు గోల్డ్‌ ఎఫ్‌ఓఎఫ్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ గోల్డ్‌ ఎఫ్‌ఓఎఫ్‌లకు ఎక్స్‌పెన్స్‌ రేషియో అధికంగా ఉంటుంది. మీ కూతురి పెళ్లికి మీరు బంగారాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటే, మీరు ఎంచుకున్నది సరైన మార్గం కాదు. అసలు నా అభిప్రాయంలో పుత్తడి అసలు మదపు సాధనమే కాదు. గత పదేళ్లలో ఇది చెప్పుకోదగ్గ స్థాయి రాబడులనివ్వలేదు. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు మాత్రమే బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అనిశ్చితి పరిస్థితుల్లో సురక్షిత మదుపు సాధనంగా పుత్తడికి ఉన్న ప్రాధాన్యత కారణంగానే బంగారం ధరలు పెరుగుతుంటాయి. ఇలా ధరలు పెరిగినప్పుడల్లా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అధిక ధరలకు చేరుతూ ఉంటాయి.  2008లో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అప్పుడు తొలిసారిగా పుత్తడిలో డెరివేటివ్స్‌ను ప్రారంభించారు. అయితే దీర్ఘకాలం దృష్ట్యా చూస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనివ్వడంలో పుత్తడి సరైన మదుపు సాధనం కాదని చెప్పవచ్చు. మీ కూతురి పెళ్లి సమయంలో బంగారాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, మీరు ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో నెలకు కొంత మొత్తాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో కనీసం 15-20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేస్తే, గోల్డ్‌​ఎఫ్‌ఓఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఇచ్చే దానికంటే ఎక్కువ మొత్తంలోనే బంగారాన్ని మీ కూతురికి బహుమతిగా ఇవ్వవచ్చు. 

ప్ర: ఒక అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎమ్‌సీ)గా మహీంద్రా ఫండ్‌ హౌస్‌ పనితీరు ఎలా ఉంది? ఈ ఫండ్‌హౌస్‌ ఇటీవలే ప్రారంభించిన మహీంద్రా హైబ్రిడ్‌ ఈక్విటీ నివేశ్‌ యోజన మంచి ఫండేనా ? ఈ ఫండ్‌లో ఒకేసారి పెద్ద  మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి ? -దీప్తి, విజయవాడ 
జ: మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ అనేది ఇటీవలనే కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ. ఈ సం‍స్థ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. ఇక మహీంద్రా హైబ్రిడ్‌ ఈక్విటీ నివేశ్‌ యోజన అనేది అగ్రెసివ్‌ హైబ్రిడ్‌  ఫండ్‌. ఈ ఫండ్‌ తన కర్పస్‌లో 65-80 శాతం నిధులను ఈక్విటీలో, మిగిలిన నిధులను స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తోంది. హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. అయితే ఈక్విటీలో అధికంగా ఇన్వెస్ట్‌ చేసే ఇలాంటి ఫండ్స్‌ల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని కనీసం ఆరు నుంచి 12 నెలల్లో ఇన్వెస్ట్‌ చేసే విధంగా విభజించి వాటిని సిప్‌ విధానంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది. 


ప్ర: త్వరలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ వస్తుందని పలువురు మిత్రులు చెబుతున్నారు. అలాంటి ర్యాలీ వస్తుందా ? ర్యాలీ మొదలయ్యాక మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టమంటారా? 
-ఆంటోని, ఈ మెయిల్‌ ద్వారా 
లార్జ్‌ క్యాప్‌ షేర్లతో పోల్చితే స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్ల మార్కెట్‌ సైకిల్‌ చాలా దీర్ఘకాలం ఉంటుంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు మార్కెట్‌ పెరిగేటప్పుడు అసాధారణ రాబడులు ఎలా ఇస్తాయో, మార్కెట్‌ పడిపోతున్నప్పుడు అంతే స్థాయి నష్టాలను మిగుల్చుతాయి. ఒక్క ఏడాదిలోనే స్మాల్‌ క్యాప్‌ షేర్లు, గానీ, ఫండ్స్‌ గానీ వంద శాతం రాబడులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క 2007 ఏడాది మాత్రం దీనికి మినహాయింపు. ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తంలో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఈ ఫండ్స్‌ నుంచి మంచి లాభాలు పొందవచ్చు. మార్కెట్‌ బాగా పెరిగినప్పుడే కాకుండా, మార్కెట్‌ బాగా పడిపోయినప్పుడు కూడా ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించాలి. ఇప్పుడు మార్కెట్‌ పతన బాటలో ఉన్నందువల్ల స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించండి. మూడు నుంచి నాలుగేళ్ల కాలానికి మీరు మంచి రాబడులు పొందవచ్చు. మార్కెట్‌ మరింతగా పడిపోయినా ఆందోళన చెందకుండా సిప్‌లను కొనసాగించండి. 



You may be interested

సెన్సెక్స్‌ 37,390 దాటితేనే రిలీఫ్‌ర్యాలీ

Monday 5th August 2019

పి.సత్యప్రసాద్‌ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గతవారం వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, భవిష్యత్‌ రేట్లకోతపై అయోమయ సంకేతాల్నినివ్వడంతో పాటు, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి టారీఫ్‌ పెంపు హెచ్చరికల్ని చేయడంతో...ఇప్పటివరకూ పటిష్టంగా అమెరికా మార్కెట్‌ కూడా క్షీణతను చవిచూసింది. ఇప్పటికే సతమతమవుతున్న యూరప్‌, ఆసియా మార్కెట్లు మరింత కుదేలయ్యాయి. ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో భారత్‌ సూచీల్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా నాలుగు

మల్టీక్యాప్‌లో సుదీర్ఘ రాబడుల చరిత్ర

Monday 5th August 2019

మల్టీక్యాప్‌లో సుదీర్ఘ రాబడుల చరిత్ర హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్‌న అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు చాలా కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ నాలుగేళ్ల కాలలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది.

Most from this category