News


డెట్‌ ఫండ్స్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయోచ్చా ?

Monday 18th November 2019
personal-finance_main1574048567.png-29655

ధీరేంద్ర కుమార్‌ సీఈవో వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో

ప్ర: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటిదాకా రెపో రేటును ఐదు సార్లు తగ్గించి కదా! ఈ నేపథ్యంలో డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయమని మిత్రులు చెబుతున్నారు. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? 
-హరిబాబు, ఏలూరు 
జ: మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌... ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలను బట్టి ఉండకూడదు. వడ్డీ రేట్లు ఎలా  ఉంటాయో అన్న అంచనాలను బట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు మొదటగా మీరు ఆలోచించుకోవలసింది. ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారనే విషయం గురించే. దీర్ఘకాలం పాటా లేకుంటే స్వల్ప కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారో అనే దానిని బట్టి మీరు ఫండ్స్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటే ఈక్విటీ ఫండ్స్‌ను, స్వల్ప కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటే డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వడ్డీ రేట్ల మార్పులకనుగుణంగా ఇన్వెస్ట్‌ చేసి ప్రయోజనాలు పొందాలనుకోవడం.. ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రాబడులు పెద్దగా రావు కాని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సురక్షితంగానే ఉంటాయని  చెప్పవచ్చు. ఇక డెట్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, దాదాపు 16 రకాల డెట్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇవి అన్నీ నప్పవు. ఆల్ట్రా-షార్ట్‌, షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌ను మాత్రమే పెట్టుబడులకు పరిశీలించండి. ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేముందు.. ఈ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోను ఒకసారి మదింపు చేయండి. తక్కువ రేటింగ్‌ ఉన్న కంపెనీల్లో  డెట్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉంటే, ఆ ఫండ్‌ను విస్మరించడమే మంచిది. 

ప్ర:  రిటైర్మెంట్‌ తర్వాతి అవసరాల నిమిత్తం రానున్న 20 ఏళ్లలో నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌, కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌ ఫండ్లను షార్ట్‌ లిస్ట్‌ చేశాను. అయితే ఈ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్నాయి. అధిక నిర్వహణ ఆస్తులు(ఏయూఎమ్‌-అసెట్‌ అండర్‌మేనేజ్‌మెంట్‌) ఉన్న ఫండ్‌ భవిష్యత్తులో మంచి రాబడులను ఇవ్వగలుగుతుందా ? 
-ఫరీద్‌, హైదరాబాద్‌ 
జ: ఈ ఫండ్స్‌ రెండూ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. ఒకటేమో లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ కాగా, మరొకటేమో లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే మల్టీక్యాప్‌ ఫండ్‌. ఈ రెండూ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. భారీగా  ఉన్న నిర్వహణ ఆస్తులు ఫండ్‌ పనితీరుపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవు. నిర్వహణ ఆస్తులు భారీగా ఉంటే.. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌కు అధిక నిర్వహణ ఆస్తులు సానుకూలాంశమనే చెప్పాలి.  చాలా కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రోజు రోజుకీ పెరుగుతున్నందున ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశాలు అపారంగా ఉంటాయి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ఇక మీ విషయానికొస్తే, మీరు నెలకు రూ.10,000 చొప్పున  ఏడాదికి రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నారు. మీరు ఎంత రిటైర్మెంట్‌ నిధి సమకూర్చుకుంటారనేది మీరు ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఇచ్చే భవిష్యత్తు రాబడులు, భవిష్యత్తు ద్రవ్యోల్బణం తదితర అంశాలపై అధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం 3-4 శాతం రేంజ్‌లో ఉండి, మీరు ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ రాబడులు 8-10 శాతం రేంజ్‌లో ఉంటే,  మీరు తగిన స్థాయిలోనే రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోగలుగుతారు. మీరు ముఖ్యంగా నాలుగు విషయాలను గమనంలో ఉంచుకోవాలి. మొదటిది. మంచి ఫండ్‌ను ఎంచుకోవడం. మీరు షార్ట్‌ లిస్ట్‌ చేసిన రెండు ఫండ్స్‌ మంచివే. రెండిటిలో ఏదో ఒకదాంట్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. రెండోది. మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం, మూడోది. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా.. కనీసం ఏడాదికొక్కసారైనా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మొత్తాన్ని పెంచడం. ఇక నాలుగవది. మీ ఫండ్స్‌ పనితీరును కనీసం ఏడాది ఒక్కసారైనా సమీక్షించడం. 

ప్ర: నేను గత కొంత కాలంగా కెనర రొబెకో  ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా ? నేను 15-20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇన్నేళ్లు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
-కిన్నెర, విశాఖపట్టణం 
జ: కెనర రొబెకొ ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌... గత కొంత కాలంగా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఈ కేటగిరీలో నిలకడైన పనితీరు కనబరుస్తున్న మంచి ఫం‍డ్స్‌లో ఇది కూడా ఒకటి. అందుకని 15-20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు మంచి ఫండ్‌నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇన్నేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులున్నా మీ సిప్‌లు అపకూడదు. మార్కెట్‌ పతనమై ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నా. మీ పెట్టుబడులను ఆపకండి. రెండోది కనీసం ఏడాదికొక్కసారైన మీ సిప్‌ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. మూడోది ముఖ్యమైనది... కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ ఫండ్‌ పనితీరును మదింపు చేయడం. ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, సిప్‌లు కొనసాగించండి. ఆశించిన స్థాయిలో లేకుంటే ఈ కేటగిరీలోనే మంచి పనితీరును కనబరుస్తున్న మరో ఫండ్‌ను మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. You may be interested

బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?

Monday 18th November 2019

-మీ ముందు రెండు మార్గాలు -పాలసీని సరెండర్‌ చేయడం -పాలసీని పెయిడప్‌గా మార్చుకోవడం -సరెండర్‌ చేస్తే బీమా కవరేజీని నష్టపోతారు -పెయిడప్‌గా మార్చుకుంటే బీమా కొనసాగుతుంది -ప్రీమియం చెల్లించాల్సిన భారం తగ్గుతుంది -చివర్లో మెచ్యూరిటీ కూడా అందుకోవచ్చు కారణాలేవైనా కానీ  మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్‌ అయిపోతుంది. దీనికంటే

పాజిటివ్‌ ప్రారంభం

Monday 18th November 2019

ప్రపంచ మార్కెట్ల సాంకేతిక సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్ల లాభంతో 40,428 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,915 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో జీ టెలిఫిల్మ్‌ 3.5 శాతం పెరగ్గా, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, జీ టెలిఫిల్మ్‌లు 1.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు గెయిల్‌, మహింద్రా, ఇన్‌ఫ్రాటెల్‌లు 1 శాతం వరకూ

Most from this category