News


బీమాకు యులిప్‌లు వద్దు !

Monday 10th June 2019
Markets_main1560153738.png-26199

ప్ర: ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో కొంత,  యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ(యుఎల్‌ఐపీ-యులిప్‌)ల్లో కొంత చొప్పున ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? 
-రేవంత్‌, విజయవాడ 

జ: బీమా తీసుకోవాలనుకుంటే టెర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలే తీసుకోవాలి. అంతేకాని యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ)లను అస్సలు ఏ మాత్రం పరిగణించకూడదు. యులిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల  అదాయపు పన్ను చట్టం, సెక్షన్‌ 80 సి కింద పన్ను ప్రయోజనాలు లభించినప్పటికీ, బీమా, మదుపుకు సంబంధించి సరైన రాబడులు మీరు పొందలేరు. ఏ ఇన్వెస్టర్‌ అయినా, బీమాకు, ఇన్వెస్ట్‌మెంట్‌కు యులిప్‌ వంటి ఒకే సాధనంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. బీమా..... అత్యంత ముఖ్యమైన అవసరం కాబట్టి, సరైన ప్లానింగ్‌తో సరైన పాలసీని ఎంచుకోవాలి. ఒక వేళ ఏ వ్యక్తి అయినా  సింగిల్‌గా ఉండి, ఆ వ్యక్తిపై ఆర్థికంగా ఆధారపడిన వాళ్లు ఎవరూ లేకపోతే, అసలు బీమా అవసరమే ఉండదు. కానీ మన దేశంలో ఇలాంటి సింగిల్‌ వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మీకు వివాహమై, మీకు పిల్లలు గనుక ఉన్నట్లయితే, మీకు బీమా అవసరం అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా బీమా తీసుకునే పక్షంలో మొదటి ఎంపిక టర్మ్‌ ఇన్సూరెన్స్‌దే అని చెప్పవచ్చు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో మనం చెల్లించాల్సిన ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. మీ సంపద పెరుగుతున్న కొద్దీ, మీకు బీమా అవసరం తగ్గుతూ ఉంటుంది. ఇక పన్ను ప్రయోజనాల కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్‌కైనా, బీమాకైనా యులిప్‌ల ఊసే వద్దు. 

ప్ర: నేను గత ఏడాది కాలంగా ఒక మల్టీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే ఇదే మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీకి చెందిన ట్యాక్స్‌-సేవింగ్‌ ఫండ్‌, నేను ఇన్వెస్ట్‌ చేస్తున్న మల్టీక్యాప్‌ ఫండ్‌ కంటే మంచి రాబడులను ఇస్తోంది. అందుకని మల్టీక్యాప్‌లోని నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ట్యాక్స్‌సేవింగ్‌ ఫండ్‌కు బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేయడం మంచిదేనా ?
-సృజన, హైదరాబాద్‌ 

జ: మీరు  ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు ? ఎంత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదల్చుకున్నారు.. తదితర వివరాలు లేకుండా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టం. ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌కు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది. అంటే మూడేళ్ల పాటు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండదు. ఇది ఆయా ఫండ్‌ మేనేజర్లకు మంచి వెసులుబాటును ఇస్తుంది. మూడేళ్ల పాటు ఈ నిధులు వారికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌ మేనేజర్లు మంచి ప్లానింగ్‌తో ఇన్వె‍స్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు మూడేళ్లపాటు నిధులు మన దగ్గరే ఉంటాయనే ధిలాసాతో ఈ ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలపై పెద్దగా ఆసక్తి చూపరనే విమర్శ కూడా ఉంది. అయితే ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌ భారీ రాబడులు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే ఇతర కేటగిరీ ఫండ్స్‌తో పోల్చితే మాత్రం ఇవి మంచి రాబడులనే ఇస్తున్నాయి. ఇతర కేటగిరీ ఫండ్స్‌కు ఉండే రిడంప్షన్‌ ఒత్తిడి ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌కు పెద్దగా ఉండదు. సాధారణంగా రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి, ఈ పరిధిలోనే(రూ. లక్షన్నర లోపే) ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ట్యాక్స్‌ సేవిం‍గ్స్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. అంతకు మించి వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వృధాయే. ఎందుకంటే అనవసరంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మూడేళ్లపాటు లాక్‌-ఇన్‌ అయిపోతాయి. ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో కనీసం రెండు ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌, ఒక లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌, ఒకటో, రెండో మల్టీ క్యాప్‌ ఫండ్స్‌, ఒక స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ ఉండేలా చూసుకోవాలి. 

ప్ర: నేను రెండేళ్ల నుంచి మూడు లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. వీటి పనితీరు సంతృప్తికరంగానే ఉంది. వచ్చే నెల నుంచి నా వేతనం 20 శాతం దాకా పెరగబోతోంది. ఈ పెరిగిన దాంట్లో కొంత భాగాన్ని మిడ్‌-క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. లేకుంటే మరో లార్జ్‌-క్యాప్‌ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌ చేయమంటారా ?
-జబ్బార్‌, విశాఖపట్ణణం 

జ: సాధారణంగా లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, మల్టీ క్యాప్‌, వేల్యూ ఫండ్స్‌ను నిర్వహించే ఫండ్‌  మేనేజర్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాల్లో ఒకింత స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛను సదరు ఫండ్‌ మేనేజర్లు సద్వినియోగం చేసుకుంటారు. మార్కెట్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు కొత్తగా ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ కేటగిరీ ఫండ్స్‌ల్లో దేనినైనా ఒక దానిని ఎంచుకోండి. రెండు, మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయండి. అప్పటికల్లా ఈ తరహా ఫండ్స్‌ల్లో ఉండే ఒడిదుడుకులు, రాబడులు పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో  కనీసం 10-15 శాతం వరకూ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేలా చూసుకోండి.  సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నప్పుడే వాటిని గుర్తిస్తారు. వాటి పనితీరు బాగా ఉన్నప్పుడే ఆకర్షితులై, వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత వచ్చే రాబడులు వారిని నిరాశపరుస్తాయి. 2017లో ఇలాగే జరిగింది. ఆ ఏడాది స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ రాణించడంతో పలువురు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇప్పటివరకూ ఈ ఫండ్స్‌ పనితీరు నిరాశమయంగానే ఉంది. అందుకని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పుడే  ఆ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఆరంభించడం మంచిది. You may be interested

పెట్టుబడి నిర్ణయాలకు....మహిళలూ ముందుకు రావాలి...

Monday 10th June 2019

పెట్టుబడి నిర్ణయాల్లో మహిళల పాత్ర సగమే పురుషులతో పోలిస్తే సగం మందే సొంత నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునే వారి వెనుక జీవిత భాగస్వాముల ప్రోత్సాహం డీఎస్‌పీ విన్‌వెస్టర్‌ పల్స్‌ సర్వేలో ఆశ్చర్యకర అంశాలు పురుషులతో సమానంగా మహిళలూ తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటున్నారు. సొంతంగా వ్యాపారాలను సృష్టిస్తున్న వారు... ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్న వారు... వ్యాపార సామ్రాజ్యాలను ఒంటిచేత్తో నడిపిస్తున్న వారు... ఎందరో ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలకు వచ్చే సరికి వారిలో ఎక్కడో తటపటాయింపు..!

ఈ షేర్లు కొనొచ్చు

Monday 10th June 2019

ఎన్‌బీసీసీ:    కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.61 టార్గెట్‌ ధర: రూ.77 ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ నిర్మాణ రంగ కంపెనీ గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.2,353 కోట్లకు పెరగ్గా, నిర్వహణ లాభ మార్జిన్‌ 1 శాతం మేర తగ్గి 7.5 శాతానికి పరిమితమైంది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటంతో నికర లాభం 8 శాతం

Most from this category