News


రూ.5 లక్షలకు పన్ను లేదు... కానీ రిటర్నులు వేయాలి

Sunday 3rd February 2019
personal-finance_main1549215874.png-23988

రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లించే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మినహాయింపులను పెంచి వేతన జీవులను సంతోషానికి గురి చేసింది. అయితే, రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు కానీ, ఐటీ రిటర్నులు మాత్రం తప్పకుండా ఫైల్‌ చేయాల్సిందే. 60 సంవత్సరాల్లోపు వారికి రూ.2.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఆదాయంగా పరిగణించే నిబంధనలో మార్పు లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు పన్ను పరిధిలోకి వస్తారు. కాకపోతే వీరు చెల్లించాల్సిన 5 శాతం పన్నుకు సమానంగా రూ.12,500ను సెక్షన్‌ 87ఏ కింద రాయితీ ఇచ్చారు. ఇది పొందాలంటే ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. లేదంటే ఐటీ శాఖ నుంచి నోటీసు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

రూ.5 లక్షల ఆదాయం కలిగిన వ్యక్తులకు పూర్తిగా పన్ను రాయితీ ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పగా, పన్ను మినహాయింపును రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు ఎక్కువ మంది పొరపాటు పడ్డారు. నిజానికి పన్ను శ్లాబుల్లో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల మినహాయింపులు సెక్షన్‌ 80సీ, డీ, ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలు, ఎన్‌పీఎస్‌లో రూ.50,000, ప్రయోజనాలు పోను మిగిలిన వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించకుండా ఉంటే పన్ను రాయితీ మాత్రమే కల్పించారు. ఇప్పటి వరకు రూ.40,000గా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50,000 చేశారు. ‘‘బడ్జెట్‌ 2019 ప్రతిపాదనల ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షలు, అంతకు లోపు ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు. అయినప్పటికీ వార్షికాదాయం 60 ఏళ్లలోపు వారు రూ.2.5 లక్షలు మించితే ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం తప్పనిసరి’’ అని ట్యాక్స్‌ టు విన్‌ సీఈవో అభిషేక్‌ సోని తెలిపారు. 

 

స్థూల ఆదాయం (వేతనం, వడ్డీ ఆదాయం, ఇతరత్రా కలిపి) రూ.2.5 లక్షలు దాటి ఉంటే ఐటీఆర్ ఫైల్‌ చేసి నిబంధనల మేరకు పన్ను ప్రయోజనాలు పొందాల్సి ఉంటుంది. ఇక హెచ్‌ఆర్‌ఏ, స్టాండర్డ్‌ డిడక్షన్‌, సెక్షన్‌ 80సీ, 80డీ, ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు ఇక ముందూ అర్హులే. వాస్తవానికి సెక్షన్‌ 87ఏ కింద ప్రస్తుతం రూ.2,500 రాయితీ ఉంది. రూ.3 లక్షల ఆదాయం ఉన్న వారు రూ.50వేలపై ఈ రాయితీని పొందుతున్నారు. దీన్ని రూ.12,500కు చేయడం ద్వారా రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను కట్టే అవసరం లేకుండా రాయితీ కల్పించినట్టు అయింది. సకాలంలో రిటర్నులు ఫైల్‌ చేయకపోతే సెక్షన్‌ 234ఎఫ్‌ కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని ట్యాక్స్‌మన్‌ డీజీఎం నవీన్‌ వాధ్వా తెలిపారు. 87ఏ రాయితీ ఇక్కడ నివాసం ఉంటున్న వారికే. ఎన్‌ఆర్‌ఐలకు ఉండదు.



You may be interested

నాలుగు రంగాలకు ఎక్కువ ప్రయోజనం: సెంట్రమ్‌

Sunday 3rd February 2019

కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ ముఖ్యంగా నాలుగు రంగాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని సెంట్రమ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్పాల్‌ బింద్రా పేర్కొన్నారు. కానీ, రానున్న 8-10 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగేందుకు బాట వేసినట్టుగా బడ్జెట్‌ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కరణలు గ్రామీణ, మధ్య తరగతి ప్రజానీకానికి ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ప్రభుత్వం ద్రవ్యలోటు, సంక్షేమ కార్యక్రమాలను చక్కగా సమతుల్యం చేసిందన్నారు. బడ్జెట్‌తో ఎక్కువగా లబ్ధి పొందే

మధ్య తరగతి వారికి మేలు

Saturday 2nd February 2019

రూ.5 లక్షల వరకు ఐటీ మినహాయింపుపై జైట్లీ న్యూఢిల్లీ: ఈ బడ్జెట్‌లో వార్షికాదాయం రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపుతో మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌ 2019-20 మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఉందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారనుందని అన్నారు. ఈమేరకు జైట్లీ తన

Most from this category