News


ఏ స్టాక్స్‌ను కొనాలో తెలియడం లేదా..?

Thursday 12th September 2019
personal-finance_main1568311439.png-28339

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో పెట్టుబడుల రాక పెరిగింది. వరుసగా ఇది నాలుగో నెల వృద్ధి. ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం చలించలేదు. అయితే, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ప్రస్తుత మార్కెట్‌ స్పందనతో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న దానిపై సంశయంతో ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించదు. ఇటువంటి వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఆగస్ట్‌ నెలలో ఏ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాయి? ఏ స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించుకున్నాయనే డేటాను పరిశీలిస్తే, వారి గమ్యం ఎటువైపు అన్న స్పష్టతకు రావచ్చు. ​

 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎంపిక చేసిన బ్యాంకులు, ప్రభుత్వరంగ కంపెనీలు, మౌలిక రంగ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. యస్‌ బ్యాంకు, ఐటీసీ, ఎన్‌హెచ్‌పీసీ, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసింది. ఇవన్నీ 7-65 శాతం మధ్య నష్టపోయినవే. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 1.59 కోట్ల షేర్లను తాజాగా కొనుగోలు చేసింది. యస్‌ బ్యాంకులో జూలై చివరికి 2.57 కోట్ల షేర్లను కలిగి ఉండగా, ఆగస్ట్‌  చివరికి 6.02 కోట్లకు వాటాలు పెరిగాయి. అంటే భారీగా పతనమైన యస్‌ బ్యాంకులో భారీగానే ఇన్వెస్ట్‌ చేసినట్టు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అదనంగా 71.5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. దేశ ఈక్విటీలు మంచి విలువను ఆఫర్‌ చేస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సీఐవో ప్రశాంత్‌ జైన్‌ పేర్కొన్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి విలువను ఆఫర్‌ చేస్తున్నప్పుడు తప్పుగా భావించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవి పెద్ద వ్యాపారాలు. తక్కువ రుణ భారంతో ఉంటాయి. కార్పొరేట్‌ కంపెనీల రుణ భారం దేశంలో తగ్గుముఖం పట్టింది’’ అని ప్రశాంత్‌జైన్‌ పేర్కొన్నారు. 

 

అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ.. ఐసీఐసీఐ బ్యాంకులో 30 లక్షల షేర్లు, యాక్సిస్‌ బ్యాంకులో 21.67 లక్షల షేర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 17.51 లక్షల షేర్లను ఆగస్ట్‌లో కొనుగోలు చేసింది. అలాగే, డీసీబీ బ్యాంకు 16.61 లక్షల షేర్లు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు 7.5 లక్షల షేర్లు, ఫెడరల్‌ బ్యాంకు 7.59 లక్షల షేర్లను కూడా యాడ్‌ చేసుకుంది. అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (10 లక్షల షేర్లు), టాటా స్టీల్‌, డెల్టా కార్ప్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌లోనూ 10 లక్షల చొప్పున షేర్లను కొనుగోలు చేసింది. ఐనాక్స్‌ ఫ్లోరో కెమికల్స్‌, పిడిటైల్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌లోనూ పెట్టుబడులు పెట్టగా, హావెల్స్‌, శ్రీ సిమెంట్‌లో పూర్తిగా వాటాలను విక్రయించింది. అలాగే, బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌, ఆర్‌నామ్‌, నిట్‌ టెక్నాలజీస్‌, టాటా కెమికల్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, జస్ట్‌ డయల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అంబుజా సిమెంట్‌, ఎలెకాన్‌ ఇంజనీరింగ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రైట్స్‌, వండర్‌లా, సోలార్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌చంద్‌, ఇండియామార్ట్‌ నివేష్‌లో కొన్ని వాటాలను తగ్గించుకుంది. 

 

దేశంలో నంబర్‌2 స్థానంలో ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ అయితే ఆగస్ట్‌ నెలలో రత్నమణి మెటల్స్‌లో మొదటిసారి పెట్టుబడులు పెట్టింది, హెచ్‌ఎస్‌ఐఎల్‌, టాటా స్టీల్‌ నుంచి వైదొలిగింది. ఇక ఇండియన్‌ ఆయిల్‌, బీహెచ్‌ఈఎల్‌లో అదనంగా కొన్ని వాటాలు కొన్నది. భారతీ ఎయిర్‌టెల్‌లో వాటాలు తగ్గించుకుంది. మూడో స్థానంలో ఉన్న ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలిస్తే.. గృహ్‌ ఫైనాన్స్‌, టాటా పవర్‌లో మొదటి సారి పెట్టుబడులు పెట్టింది. మైండ్‌ట్రీ, బేయర్‌ క్రాప్‌, కెనరాబ్యాంకు వాటాలను పూర్తిగా అమ్మేసింది. వొడాఫోన్‌ ఐడియా, బీహెచ్‌ఈఎల్‌, ఎస్‌జేవీఎన్‌లో వాటాలను కొంత మేర పెంచుకుంది. బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీలో కొన్ని వాటాలను తగ్గించుకుంది. You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 13th September 2019

క్రితం రోజు నష్టాల పాలైన దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ కిత్రం ముగింపు(37,104)తో పోలిస్తే 73 పాయింట్ల లాభంతో 37,175.86 వద్ద, నిఫ్టీ గతముగింపు(10,983)తో పోలిస్తే 4 పాయింట్లు పెరిగి 10,987 వద్ద ప్రారంభమైంది. నిన్న నిర్వహించిన సమావేశంలో యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌(ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలు ప్రకటించింది. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు బ్యాంకు నెలకు 20 బిలియన్‌ యూరోల విలువైన బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు వడ్డీరేట్లను తగ్గించింది.

కనిష్ట స్థాయికి స్టాక్స్‌...! జున్‌జున్‌వాలా

Thursday 12th September 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ప్రస్తుతానికి కనిష్ట స్థాయి పూర్తయిందని (బోటమ్డ్‌ అవుట్‌) ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది రుతుపవానాలు బాగున్నాయి. బ్యాంకుల్లోకి నిధుల వెల్లువ ఉంది. బ్యాంకుల క్రెడిట్‌ 15 శాతం పెరగనుంది. ఎన్‌పీఏల నుంచి బయట పడుతున్నాం’’ అని రాకేశ్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు.   కేంద్ర ప్రభుత్వ పాలసీలకు జున్‌జున్‌వాలా మద్దతుగా నిలిచారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంచి

Most from this category