News


ఐడీఎఫ్‌సీ నుంచి స్మాల్‌క్యాప్‌ ఫండ్‌

Thursday 23rd January 2020
personal-finance_main1579803855.png-31145

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ‘ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌’ పేరుతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో). ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు పెట్టుబడులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌వో క్లోజ్‌ అయిన తర్వాత ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడులు పెట్టాలన్న దానికి ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పలు కారణాలు కూడా తెలియజేసింది. ‘‘లార్జ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ కంపెనీల మధ్య విలువల పరంగా అంతరం మరింత పెరిగింది. స్మాల్‌క్యాప్‌ షేర్లలో దిద్దుబాటు అధికంగా జరగడంతో షేర్ల ధరలు వాటి చారిత్రక సగటుతో చూస్తే ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాదు స్మాల్‌క్యాప్‌ విభాగంలో 4,750 లిస్టెడ్‌ కంపెనీలు ఉన్నాయి. అదే లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో మొత్తం కంపెనీలు 250 మాత్రమే. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే యాక్టివ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ వాటి బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ల కంటే అధిక రాబడులను ఇస్తున్నాయి’’ అని తెలియజేసింది.

 

ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌ను అనూప్‌ భాస్కర్‌ నిర్వహించనున్నారు. అంతేకాదు ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ హెడ్‌గానూ ఆయన పనిచేస్తున్నారు. ‘‘ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రాథమిక కారణం స్మాల్‌క్యాప్‌ విలువలే. స్మాల్‌క్యాప్‌లో ఇన్వె‍స్ట్‌ చేసే సమయం కూడా ఎంతో కీలకమైనది’’ అని అనూప్‌ భాస్కర్‌ వివరించారు. ఐడీఎఫ్‌సీ స్టెర్లింగ్‌ వ్యాల్యూ ఫండ్‌కు, ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ ఫండ్‌కు మధ్య వ్యత్యాసాన్ని ఐడీఎఫ్‌సీ ఏఎంసీ అధికార ప్రతినిధి వివరించారు. ‘‘ఐడీఎఫ్‌సీ స్లెర్లింగ్‌ వ్యాల్యూ ఫండ్‌ అన్నది స్మాల్‌క్యాప్‌కు పెట్టుబడుల కేటాయింపు విషయంలో నిర్దేశిత పరిమితితో ఉండదు. కానీ, ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌ తన పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఐడీఎఫ్‌సీ స్టెర్లింగ్‌ వ్యాల్యూ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లోని అవకాశాలను సొంతం చేసుకుంటుంది. కానీ, ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌ స్మాల్‌క్యాప్‌పైనే దృష్టి సారిస్తుంది’’ అని వివరించారు.

 

సాధారణంగా పెట్టుబడులు పెట్టే ముందు ఆయా పథకం ట్రాక్‌ రికార్డు చూసిన తర్వాతే ఇన్వెస్ట్‌ చేయాలన్న అభిప్రాయం సరికాదని ఐడీఎఫ్‌సీ ఏఎంసీ తెలిపింది. ‘‘ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం లేదా సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ ద్వారా 6 నుంచి 9 నెలల్లో ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే సిప్‌ ద్వారా 3-5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడం అన్నది ప్రస్తుతం అనుకూలంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎంతో ఆలస్యం చేసినట్టు అవుతుంది. స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది అనుకూలమైన విధానం కాదు’’ అని అనూప్‌ భాస్కర్‌ వివరించారు. స్మాల్‌క్యాప్‌ విభాగంలో అనూప్‌ భాస్కర్‌ సమర్థవంతమైన ఫండ్‌ మేనేజర్‌ అని, కనుక ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పెట్టుబడులకు పరిశీలించొచ్చని ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ భవిక్‌డాండ్‌ సూచించారు.



You may be interested

యస్‌ బ్యాంకు షేరు.. ఏం చేయవచ్చు..?

Thursday 23rd January 2020

యస్‌ బ్యాంకును విఫలం కానీయకూడదంటూ ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ దావోస్‌లో చేసిన వ్యాఖ్యలు.. ఈ షేరు పట్ల ఇన్వెస్టర్లలో మరోసారి ఆసక్తికి దారితీశాయి. దీంతో గురువారం యస్‌బ్యాంకు షేరు 6.5 శాతం లాభపడి బీఎస్‌ఈలో రూ.40.95 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 8 శాతం వరకు ర్యాలీ చేసింది. వరుసగా రెండో రోజూ ఈ స్టాక్‌ లాభంతో క్లోజయింది. తాజా పరిణామంతో యస్‌ బ్యాంకు షేరులో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు

12000-12500 మధ్య ఉన్నంత వరకు స్ట్రాంగిల్స్‌ అమ్మొచ్చు!

Thursday 23rd January 2020

ఆప్షన్‌ నిపుణుల సూచన నిఫ్టీ స్వల్పకాలానికి 12000- 12500 పాయింట్ల రేంజ్‌లోనే కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆప్షన్‌ డేటా చూస్తే ఈ రేంజ్‌ జనవరి సీరిస్‌ వరకు కొనసాగవచ్చని చెబుతున్నారు. ఈ సీరిస్‌ ముగిసేందుకు మరో వారం మాత్రమే గడువున్నందున నిఫ్టీలో స్ట్రాంగిల్స్‌ విక్రయించే వ్యూహాలు మంచివని సూచిస్తున్నారు.(షార్ట్‌ స్ట్రాంగిల్‌- స్వల్పదూరంలోని అవుట్‌ఆఫ్‌ద మనీ పుట్‌, కాల్‌ను విక్రయించడం) ఈ రేంజ్‌ బ్రేక్‌ అయ్యేవరకు స్ట్రాంగిల్‌ సెల్లింగ్‌ లాభాలనిస్తుందని విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ

Most from this category