News


ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తక్షణ గృహరుణం!

Thursday 4th April 2019
personal-finance_main1554369422.png-24971

దేశంలో పెరిగిపోతున్న సరసమైన గృహనిర్మాణ కార్యక్రమానికి తగినట్లుగా ఐసీఐసీఐ బ్యాంకు సరికొత్త గృహరుణ ఆఫర్లను ప్రకటించింది. ఈ పథకాల కింద కస్టమర్లు తక్షణమే కొత్త గృహరుణాన్ని లేదా కొత్త టాప్‌అప్‌ లోన్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ ప్రాసెస్‌ మొత్తం డిజిటల్‌గానే పూర్తవుతుంది. ఈ పథకం కింద కొత్త ఇంటి కోసం కోటి రూపాయల వరకు రుణాన్ని అందిస్తారు. కస్టమర్‌ వయసును బట్టి గరిష్ఠంగా 30 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ నూతన ఆవిష్కరణతో కస్టమర్‌ బ్రాంచ్‌ చుట్టూ తిరగాల్సిన పనిఉండదని, భౌతికంగా పేపర్‌ వర్క్‌ చేయాల్సిన అవసరం ఉండదని బ్యాంకు వర్గాలు వివరించాయి.

బ్యాంకు ఆన్‌లైన్‌ సైట్‌లో ఇన్‌స్టాలోన్‌కు అప్లై చేసాక వచ్చే శాంక్షన్‌ లెటర్‌ ఆరునెలలు చెల్లుతుంది. శాంక్షన్‌ లెటర్‌ వచ్చాక సంబంధిత పత్రాలతో కలిపి బ్యాంకు బ్రాంచిలో అందించి రుణాన్ని అకౌంట్‌లోకి పొందవచ్చు. ఇన్‌స్టాటాప్‌ అప్‌లోన్‌ పథకంలో భాగంగా ఇప్పటికే తీసుకున్న హోమ్‌లోన్‌పై టాప్‌అప్‌గా రూ. 20 లక్షలను పదేళ్ల గరిష్ఠకాలపరిమితితో తీసుకోవచ్చు. దేశంలో రిటైల్‌ రుణాల రంగంలో ఇది సరికొత్త అధ్యాయమని బాయంకు ఈడీ అనూప్‌బాగ్చీ చెప్పారు. ఈ పథకంలో టైర్‌2, 3 నగరాల్లోకి మరింతగా విస్తరిస్తామన్నారు. మార్టిగేజ్‌ రుణాల పరంగా ఎప్పటికప్పుడు కొత్త మైలురాళ్లు అందుకుంటున్నామని వివరించారు. ఈ పథకాన్ని త్వరలో ఐమొబైల్‌ యాప్‌లో కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయండి. 

https://www.icicibank.com/Personal-Banking/loans/home-loan/instant-home-loan/index.page?You may be interested

పీఎస్‌యూ బ్యాంకుల డౌన్‌గ్రేడ్‌?

Thursday 4th April 2019

సుప్రీం తీర్పుతో పెరిగిన అనుమానాలు దివాలా విధానాలు, మొండిపద్దుల వసూళ్లకు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు చెల్లవని తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పీఎస్‌యూ బ్యాంకులకు అశనిపాతం కానుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో తిరిగి పాత రుణ పునర్‌వ్యవస్థీకరణ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకులపై పెట్టుకున్న ఆశలు కరిగిపోతాయని, త్వరలో వీటి రేటింగ్‌ల్లో, ఎర్నింగ్స్‌లో డౌన్‌గ్రేడ్‌ ఉండొచ్చని అషికా స్టాక్‌బ్రోకింగ్‌ అనలిస్టు అశుతోష్‌ మిశ్రా

రూపాయికి నష్టాలు

Thursday 4th April 2019

గురువారం ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల్లోకి జారింది. ఆరంభమే బలహీనంగా 68.56 వద్ద ఓపెనై, క్రమంగా 68.66కు దిగజారింది. అనంతరం కొంత లాభపడి 68.62 వరకు వచ్చినా, ఆర్‌బీఐ ప్రకటనతో తిరిగి మరింత నష్టాల్లోకి జారింది. ఆర్‌బీఐ ఎంపీసీ తాజాగా రెపోరేట్‌ను మరో 25 బీపీఎస్‌ తగ్గించింది. ఈ ప్రకటనతో రూపీ విలువ మరింత పతనమై 68.98కిచేరింది. మధ్యాహ్న సమయానికి 68.97 వద్ద కదలాడుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో

Most from this category