News


మీ డిమ్యాట్‌ సురక్షితమేనా?!

Tuesday 26th November 2019
personal-finance_main1574752196.png-29869

బ్రోకింగ్‌ సంస్థ నుంచి మీ హోల్డింగ్స్‌ కాపాడుకోండి
నిపుణుల సూచనలు
కార్వీసంస్థ నిర్వాకం బయటపడడంతో ఇన్వెస్టర్లంతా అవాక్కయ్యారు. కార్వీ అవకతవకలపై సెబి కన్నెర్రజేసింది. క్లయింట్లకు తెలియకుండా వాళ్ల అకౌంట్లను వాడుకోవడాన్ని సెబి తీవ్రంగా పరిగణించింది. కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా ఆదేశాలిచ్చింది. కార్వీ దెబ్బకు ఇన్వెస్టర్లు తమ తమ అకౌంట్లను బ్రోకింగ్‌ సంస్థలు ఎలా అనైతికంగా వాడుకుంటున్నాయో తెలిసివచ్చింది. ఈనేపథ్యంలో మీ డీమాట్‌ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. 
= టెక్నాలజీని వాడుకోండి: బ్రోకింగ్‌ సంస్థ, డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో మీ మొబైల్‌ నెంబర్‌, ఈమెయిల్‌ను అప్‌డేట్‌ చేసుకోండి. దీంతో మీ అకౌంట్‌లో జరిగే ప్రతిట్రేడ్‌ వివరం మీకు వెంటనే తెలుస్తుంది. దీంతోపాటు లెడ్జర్‌ బాలెన్స్‌, స్టాక్‌ స్టేటమెంట్స్‌ సైతం మీకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఇలాంటి మెసేజ్‌లను డిలీట్‌ చేయకుండా ఉంచుకుంటే మీ ట్రాక్‌ రికార్డు పరిశీలించుకోవచ్చు. 
= మీ సొమ్ము సరిచూసుకోండి: మీ అకౌంట్లో నగదు నిల్వను బ్రోకరు కనీసం 90 రోజులకు ఒకసారి పేఅవుట్‌ చేయాలి. ఒకవేళ బ్రోకర్‌ అలా చేయకపోతే మీ నిధులు దుర్వినియోగమవుతున్నాయని అనుమానించవచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు మీ నగదు వివరాలు తెలుసుకుంటూ ఉండండి.
= ఎన్ని కొంటున్నారు?: మీరు కొనుగోలు చేస్తున్న షేర్ల సంఖ్య చాలా కీలకం. మీ పోర్టుఫోలియోలో ఏ కంపెనీకి చెందిన షేర్లు ఎన్ని ఉన్నాయో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మీరు ఎలాంటి యాక‌్షన్‌ చేయకున్నా, మీ పోర్టుఫోలియోలో షేర్ల సంఖ్యలో తేడాలొస్తే వెంటనే బ్రోకర్‌ను నిలదీయండి. ఇందుకోసం మీరు బ్రోకింగ్‌ సంస్థలు చెప్పే మాటలు నమ్మకుండా డిపాజిటరీలు ఇచ్చే నెలవారీ స్టేట్‌మెంట్లను పరిశీలస్తూ ఉండండి. 
= డిపాజిటరీల వద్ద రిజిస్టర్‌: మీ ట్రేడ్‌ వివరాలు, మీ పోర్టుఫోలియో వివరాలు కేవలం మీ బ్రోకింగ్‌ సంస్థ ఇచ్చిన డీమ్యాట్‌ అకౌంట్లోనే కాకుండా డిపాజిటరీల వద్ద కూడా ఉంటాయి. వీటిలో యాక్సిస్‌ కోసం సీడీఎస్‌ఎల్‌ లేదా ఎన్‌ఎస్‌డీఎల్‌ వద్ద రిజిస్టర్‌ కావాలి. అప్పుడు మీరు మీ పోర్టుఫోలియో వివరాలు ఒకే చోట చూడవచ్చు. 
= పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎలాంటిది?: బ్రోకర్‌కు క్లయింట్‌ ఇచ్చే పవర్‌ ఆఫ్‌ అటార్నీ పరిమితమైన పరిధి కలిగిఉంటుంది. అలాకాకుండా పూర్తి పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇస్తే అప్పుడు అకౌంట్‌ మొత్తం బ్రోకింగ్‌ సంస్థ చేతిలో పెట్టినట్లే. అందువల్ల వీలయినంతవరకు పీఓఏ ఇవ్వకుండా ఉండాలి లేదా పరిమిత పీఓఏ మాత్రమే బ్రోకింగ్‌ సంస్థకు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. 
= బ్రోకర్‌ను ఎప్పుడు మార్చాలి: పైన చెప్పిన విధంగా అనుమానాస్పదంగా మీ బ్రోకర్‌ ప్రవర్తిస్తున్నా, మీ అకౌంట్‌పై మీకు అపనమ్మకం ఏర్పడ్డా, వెంటనే మరో బ్రోకింగ్‌ సంస్థకు మారడం మంచింది. బలమైన ఫైనాన్షియల్స్‌ ఉండి తక్కువమంది క్లయింట్లున్న సంస్థలను ఎంచుకోవడం ఉత్తమం. 



You may be interested

మార్కెట్‌ కొత్త హై....టాప్‌ కంపెనీలు ఇవే!

Tuesday 26th November 2019

అంతర్జాతీ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో సూచీలు మంగళవారం సరికొత్త  జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132.45 తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. వీటితో పాటు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. ఈ ఏడాదిలో నిఫ్టీ ఇండెక్స్‌ ఏకంగా 7సార్లు కొత్త రికార్డు హైలను

ఛైర్మన్‌ రాజీనామా.... ‘జీ’ 5 శాతం డౌన్‌

Tuesday 26th November 2019

 జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్‌) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం సెషన్‌లో భారీగా నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 12.27 సమయానికి జీ 5.70 శాతం నష్టపోయి రూ. 324.20  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 343.80 వద్ద ముగసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌లో రూ. 341.00 వద్ద ప్రారంభమైంది. కాగా రూ. 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోవడం

Most from this category