News


అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే..

Monday 30th December 2019
news_main1577676151.png-30507

  • ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ - ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌

పెట్టుబడులపై రిస్క్‌ తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఎంతో అవసరం. ఇన్వెస్టర్లు తప్పకుండా అనుసరించాల్సిన సూత్రం ఇది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీలో లేక రియల్‌ ఎస్టేట్‌లో.. ఇలా ఏ ఒక్క విభాగంలోనే ఇన్వెస్ట్‌ చేయడం వైవిధ్యానికి వ్యతిరేకం. ఇక ఈక్విటీల్లోనూ పెట్టుబడులన్నింటినీ ఒకే విభాగంలో ఇన్వెస్ట్‌ చేయడం కూడా వైవిధ్యం అనిపించుకోదు. కనుక వైవిధ్యం కోరుకునే వారు మన దేశ కంపెనీలతోపాటు, అమెరికాలో మంచి పనీతీరు చూపిస్తున్న స్టాక్స్‌లోనూ కొంత పెట్టుబడులు పెట్టడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవచ్చు. ఎందుకంటే గత రెండేళ్లలో మన మార్కెట్లు ఎన్నో అస్థిరతలు ఎదుర్కొంటే, అమెరికా మార్కెట్లు మంచి పనితీరు చూపించాయి. ఒకవేళ అక్కడ కూడా ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, గత రెండళ్ల కాలంలో మన మార్కెట్లలో ఉన్న అస్థిరతలను అధిగమించి మెరుగైన రాబడులు పొందే వారు. అమెరికన్‌ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటిల్లో ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ -  ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ పథకం కూడా ఒకటి.  

వైవిధ్యం...
టెక్నాలజీ దిగ్గజాలు ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృ సంస్థ), ఫేస్‌బుక్‌, యాపిల్‌తోపాటు రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ తదితర కంపెనీల పనితీరు ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఇంతటి విజయవంతమైన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటే.. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ద్వారా అదిప్పుడు సాధ్యమే. విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులతో వైవిధ్యమే కాదు మరో ప్రయోజనం కూడా ఉంది. భవిష్యత్తులో విదేశీ కరెన్సీ రూపంలో వ్యయాలు చేయాలనుకునే వారికి మంచి ఐడియానే అవుతుంది. అదెలా అంటే మీ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకుంటే డాలర్లను ఖర్చు చేయాలి కదా. అలాగే, విదేశాల్లో మంచి చికిత్స తీసుకోవాలనుకున్నా సరే అది డాలర్‌ డినామినేషన్‌లోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక భవిష్యత్తులో విదేశీ కరెన్సీ రూపంలో ఎదురయ్యే ఖర్చులకు విదేశీ ఈక్విటీ పెట్టుబడుల రూపంలో ముందుగానే హెడ్జ్‌ చేసుకున్నట్టు అవుతుంది. భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి మారకం మరింత క్షీణించినట్టయితే అప్పుడు ఈ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందొచ్చు. 

పెట్టుబడుల విధానం-రాబడులు...
ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ - ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. నిజానికి ఇది నేరుగా ఈక్విట్లీలో ఇన్వెస్ట్‌ చేసే పథకం కాదు. ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ అనే మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేసే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌. అందుకే పేరులో ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ అని పేర్కొనడం జరిగింది. 2012లో ఈ పథకం ఆరంభమైంది. ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ అన్నది ప్రధానంగా అమెరికన్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ ఫండ్‌ తన నిర్వహణలోని క్లయింట్ల పెట్టుబడుల్లో 95 శాతానికి తక్కువ కాకుండా ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే 99 శాతానికి పైగా పెట్టుబడులను ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఈ పథకానికి మంచి రాబడుల చరిత్ర ఉంది. ఏడాది కాలంలో రాబడుల శాతం 3.2గా ఉంది. కానీ మూడేళ్లలో వార్షికంగా 17.8 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 13.6 శాతం చొప్పున రాబడులను అందించింది. ఉదాహరణకు మూడేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి నేటికి రూ.1.6 లక్షలు అయ్యేది. ప్రతీ నెలా రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే మూడేళ్లలో రూ.4.7లక్షలు సమకూరేది. కనుక దీర్ఘకాలానికి, మరీ ముఖ్యంగా పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసం ఈ పథకంలో సిప్‌ రూపంలో​ ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. You may be interested

రూ.45 రీచార్జ్‌తోనే ఎయిర్‌టెల్‌ నంబర్‌ రింగింగ్‌!

Monday 30th December 2019

న్యూఢిల్లీ: ఇక మీదట ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ప్రతీ 28 రోజులకు చేసుకోవాల్సిన కనీస రీచార్జ్‌ మొత్తాన్ని కంపెనీ రూ.23 నుంచి రూ.45కు పెంచింది. ‘‘‍ప్రతీ 28 రోజులకు కనీసం రూ.45 లేదా అంతకుమించి రీచార్జ్‌ చేసుకుంటేనే సేవలు లభిస్తాయి’’ అని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ నెల 29 నుంచే ఇది అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుత టారిఫ్‌ గడువు ముగిసే నాటికి రూ.45 లేదా అంతకుమించిన రీచార్జ్‌ చేసుకోకపోతే..

నిఫ్టీ మద్దతు 12,183...నిరోధం 12284

Monday 30th December 2019

స్వల్ప లాభంతో కదులుతున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(సోమవారం) అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 12,329 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. గత వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ర్యాలీ బాట పట్టాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్లు జంప్‌చేసి 41,575 వద్ద నిలవగా, ఎన్‌ఎస్‌ఈ

Most from this category