News


ఇక నిమిషాల్లో ఉచితంగా పాన్‌

Sunday 23rd February 2020
personal-finance_main1582480465.png-32013

ఇప్పటి వరకు ఆదాయపన్ను శాశ్వతా ఖాతా నంబర్‌ (పాన్‌) తీసుకుని లేరా..? ఇప్పుడు పాన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? ఇకపై పాన్‌ నిమిషాల్లో తీసుకోవచ్చు. కాకపోతే ఆధార్‌ నంబర్‌ ఉండాలి. ఆధార్‌ నంబర్‌ సాయంతో ఇన్‌స్టంట్‌గా పాన్‌ను జారీ చేసే విధానాన్ని ఆదాయపన్ను శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో పేపర్లతో పని లేకుండా, ఎటువంటి చార్జీలు చెల్లించే పని లేకుండా, ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌గా పాన్‌ జారీ అయిపోతుంది. 

 

ఆదాయన్ను శాఖకు చెందిన ఈ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.in కు వెళ్లి పాన్‌ తీసుకోవచ్చు. పేజీలో ఎడమచేతి వైపున ‘ఇన్‌స్టంట్‌ పాన్‌ త్రూ ఆధార్‌’ అనే ఆప్షన్‌ రెడ్‌ కలర్‌లో బ్లింక్‌ అవుతూ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. అక్కడ గెట్‌ న్యూపాన్‌, చెక్‌ స్టాటస్‌/డౌన్‌లోడ్‌ పాన్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. గెట్‌ న్యూపాన్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాతి పేజీలో ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ నంబర్‌ కాలమ్‌లో ఆధార్‌ నంబర్‌ను ఇచ్చిన తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. కింద ఐదు రకాల అంశాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. 

 

1. నాకు ఇప్పటి వరకు పాన్‌ కేటాయింపు జరగలేదు.
2. నా మొబైల్‌ నంబర్‌ ఆధార్‌తో లింక్‌ అయి ఉంది.
3. ఆధార్‌ కార్డులో నా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వివరాలు ఉన్నాయి.
4. దరఖాస్తు చేసే నాటికి నేను మైనర్‌ను కాను.
5. నిబంధనలు, షరతులను చదివాను.

 

వీటిని అంగీకరిస్తూ టిక్‌ చేసి సబ్‌ మిట్‌ చేయాలి. ఆ తర్వాత ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి ఒకే చేయాలి. ఆధార్‌ వివరాల ధ్రువీకరణ అనంతరం పాన్‌ జారీ అవుతుంది. ఈ ఐదింటిలో ఏ ఒక్కటీ సరైనది కాకపోతే పాన్‌ జారీ కాదు. ఉదాహరణకు మీరు వాడుతున్న మొబైల్‌ నంబర్‌ ఆధార్‌ డేటాతో అనుసంధానం కాకపోతే, ఓటీపీ రాదు. పాన్‌ కోసం ఓటీపీ తప్పనిసరి. అలాగే, కొన్నేళ్ల క్రితం ఆధార్‌ కార్డు తీసుకున్న వారికి, కేవలం పుట్టిన సంవత్సరం వివరాలే ఆధార్‌ కార్డుపై పేర్కొనడం జరిగింది. అటువంటి వారు ముందుగా ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్‌ లేదా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వివరాల అప్‌డేట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అప్‌డేట్‌ అయిన తర్వాత ఈ ఫైలింగ్‌ పోర్టల్‌ నుంచి ఇన్‌స్టంట్‌గా పాన్‌ తీసుకోవచ్చు.You may be interested

బ్యాంకుల మెగా విలీనం ఆలస్యం..!

Sunday 23rd February 2020

ప్రభుత్వరంగంలో మలివిడతగా జరగాల్సిన బ్యాంకుల మెగా విలీనం ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాంకుల విలీనం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏ మేరకు.. ఎన్‌పీఏలు ఏ స్థాయిలో ఉంటాయి, నిధుల అవసరాలు ఏ మేరకు, రుణ వృద్ధి, వ్యయ నియంత్రణలు ఏ మేరకు, మూసివేయనున్న శాఖలు ఇత్యాది వివరాలను ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖను తాజాగా కోరింది. విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయా

భారత ఐటీ కంపెనీల్లో పెరిగిన అమెరికన్‌ ఉద్యోగులు!

Saturday 22nd February 2020

లక్షకుపైగా పనిచేస్తున్నారన్న నాస్కామ్‌  అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ ఐటీ కంపెనీలలో లక్షకుపైగా అమెరికన్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని తాజాగా నాస్కామ్‌ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్‌ నాలుగు ఇండియన్‌ ఐటీ కంపెనీలలో ఒక్కో కoపెనీలో అమెరికన్‌ ఉద్యోగులు 55,000పైగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటిదాక అమెరికాలో ఉద్యోగాలు చేసే బారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండేది. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. అమెరికన్ల

Most from this category