News


మీ రిస్క్‌ను అంచనా వేయడం ఎలా?

Sunday 8th December 2019
personal-finance_main1575828807.png-30113

పెట్టుబడులను ఆరంభించే వారు ముందుగా వారి రిస్క్‌ సామర్థ్యంపై స్పష్టతకు రావడం అవసరం. తమ లక్ష్యాలు, వాటికున్న కాల వ్యవధి, ఆశించే రాబడులు ఇవన్నీ రిస్క్‌ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ కింద ప్రశ్నల ద్వారా ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను అంచనా వేసుకోవచ్చని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ విభాగం హెడ్‌ రాహుల్‌జైన్‌ తెలియజేశారు. 

 

ఇన్వెస్ట్‌ చేయతగిన మిగులు ఎంత?
మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మిగులు మీ రిస్క్‌ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మిగులు మొత్తం రూ.2 కోట్లు అనుకుంటే, మార్కెట్‌ హెచ్చుతగ్గుల కారణంగా రూ.1-2 లక్షల నష్టం వస్తే మీ ఆర్థిక ఆరోగ్యం, లక్ష్యాలపై ప్రభావం చూపించలేదు. కానీ, ఈ నష్టం రూ.5 లక్షలకు చేరితే మాత్రం మీ లక్ష్యాల విషయంలో రాజీపడాల్సి ఉంటుంది. 

 

ఆర్థిక లక్ష్యాలు
ఆర్థిక లక్ష్యాలను మూడు విభాగాలుగా వర్గీకరించాలి. స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాలమైనవి. స్వల్పకాల లక్ష్యాలు అంటే కారు కొనుగోలు చేయడం వంటివి. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం మధ్య కాల లక్ష్యాల్లోకి వస్తాయి. రిటైర్మెంట్‌ నిధి సమకూర్చుకోవడం దీర్ఘకాల లక్ష్యం. వీటిల్లో పిల్లల ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేయలేం. వీటి విషయంలో రిస్క్‌ ఎక్కువగా ఉండకూడదు. అదే విహారయాత్ర లేదా కారు కొనుగోలు కోసం మరిన్ని సంవత్సరాల పాటు ఆగినా నష్టం ఉండదు. కనుక ఇటువంటి లక్ష్యాల కోసం రిస్క్‌ తీసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చు.


 
అవగాహన
స్టాక్‌ మార్కెట్లో ఒక్కొక్కరి అనుభవం ఒక్కో రకంగా ఉంటుంది. మార్కెట్‌ ర్యాలీ సమయంలో ప్రవేశించిన వారికి లాభాలు వృద్ది చెందుతాయి. దీంతో రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుంది. అదే మార్కెట్‌ పతనం ముందు అడుగుపెట్టిన వారు నష్టాల కారణంగా తర్వాత రిస్క్‌ తీసుకోలేరు. అందుకే మార్కెట్‌ పట్ల మీకున్న సౌకర్యం తర్వాతి పెట్టుబడి విధాలను నిర్ణయిస్తాయి.



You may be interested

11,800పైన స్థిరీకరణకు అవకాశం..

Sunday 8th December 2019

ఈక్విటీ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిల వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా 12,000 పై స్థాయిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. 12,103 నిరోధాన్ని అధిగమించి పై స్థాయికి వెళితే తప్ప ర్యాలీకి అవకాశం లేదంటున్నారు జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు మిలాన్‌ వైష్ణవ్‌. రానున్న రోజుల్లో మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది.   ‘‘ఈక్విటీ మార్కెట్లు డబుల్‌ టాప్‌ నిరోధం 12,103ను అధిగమించే ప్రయత్నంలో మరోసారి

ఈ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజీలు సానుకూలం

Sunday 8th December 2019

ఇండెక్స్‌లో ప్రధాన స్టాక్స్‌ విలువలు అధిక స్థాయికి చేరిపోవడం, దేశ జీడీపీ వృద్ధి కనిష్ట స్థాయికి చేరడం, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌ ఆలస్యమవ్వచ్చన్న అంశాలు... మన మార్కెట్లకు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 12 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 4 శాతం, 9 శాతం చొప్పున నష్టపోయాయి. విలువల పరంగా చూస్తే సెన్సెక్స్‌

Most from this category