News


ఈఎంఐలు కట్టుదాటకుండా చూసుకోండి!

Saturday 4th January 2020
personal-finance_main1578130862.png-30678

రిటైల్‌ రుణాలు వేగంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో గృహోపకరణాల నుంచి గృహ నిర్మాణం వరకు విద్య నుంచి వైద్యం వరకు లోన్‌ తీసుకోవడం కామనైపోయింది. అయితే ఇలా ఎడా పెడా లోన్లు తీసుకుని నెలసరి వాయిదాలు కట్టలేక చేతులెత్తే బదులు ముందుగానే మీ ఈఎంఐ ఎంతుండాలో నిర్ణయించుకొని తదనుగుణంగా లోన్‌ ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఈఎంఐ ఎంత ఉండాలనేది మీ ఆదాయమే చెబుతుంది. ఇంటి అద్దె, పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులు, అనుకోని ఖర్చులు వంటి వాటినన్నింటినీ తీసేసిన తర్వాత మిగిలిన మొత్తం ఆధారంగా మీ ఈఎంఐని నిర్ణయించుకోవాలి. ఇక్కడ మీ ఆదాయం వృద్ధి చెందుతున్న కొద్దీ మీరు మిగిల్చే మొత్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే కొన్ని ఖర్చులు కూడా పెరగొచ్చు. ఉదాహరణకు కెరీర్‌ తొలినాళ్లలోనే మీకు ఉద్యోగం వచ్చింది. మీ నికర ఆదాయం నెలకు రూ.30,000గా ఉంది. అంటే మీరు మిగిల్చే మొత్తం 15–20 శాతం మధ్యలో ఉండాలి. అదే మీ ఆదాయం రూ.లక్షకు పెరిగిందనుకుంటే అప్పుడు ఈ శాతంలో కూడా మార్పు ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు మీ ఈఎంఐలను చెల్లించడానికి 40–50 శాతాన్ని మిగిలించవచ్చు.

మీరు కెరీర్‌ తొలినాళ్లలోనే ఉన్నారు కాబట్టి కచ్చితంగా క్రెడిట్‌ రిపోర్ట్‌ను సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే మీరు చెల్లించగలిగే సామర్థ్యం మేరకే రుణాన్ని తీసుకోండి. ఎప్పుడైనా తీసుకున్న రుణాలను ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు లేకుండా సులభంగా తీర్చగలిగేలా చూసుకోవాలి. కుటుంబంలో ఏదైనా ఊహించని సమస్య రావొచ్చు, ఉద్యోగం పోవచ్చు, పెళ్లి వంటి ఘటనలు జరగొచ్చు. ఇలాంటి సందర్భాల్లో అధిక మొత్తం అవసరమౌతుంది. అందుకే వీటి కోసం కొంత సేవింగ్స్‌ అవసరం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలోపెట్టుకొని మీరు ఏమేరకు ఈఎంఐ చెల్లించగలరో ఒక నిర్ణయం తీసుకోండి. లోన్‌ తీసుకోవడం, తీసుకున్న లోన్‌ సక్రమంగా చెల్లించడం భవిష్యత్‌లో మీ క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయని గుర్తించండి.You may be interested

అల్ట్రాటెక్‌, ఎల్‌అండ్‌టీ కొనొచ్చు!

Saturday 4th January 2020

ఈ కేలండర్‌ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత వృద్ధి చూపనున్నట్లు పలు బ్రోకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఆందోళనలున్నప్పటికీ ఈ ఏడాది మార్కెట్లు మంచి రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ర్యాలీ ఇతర కౌంటర్లకూ విసర్తిస్తున్న సంకేతాలు మార్కెట్లలో కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులలో దేశీ బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌.. సిమెంట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది.

నెల రోజులకు మూడు సిఫార్సులు

Saturday 4th January 2020

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడిని అందించే మూడు స్టాకులను ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ అందిస్తోంది. 1. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 560. స్టాప్‌లాస్‌ రూ. 524. కొన్ని నెలలుగా ఈ షేరు రూ. 510 చుట్టూ తిరుగుతోంది. గతంలో ఈ స్థాయి షేరుకు బలమైన డిమాండ్‌ జోన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ జోన్‌ వద్ద డబుల్‌ బాటమ్‌ కూడా ఏర్పడింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది.  2. వేదాంత: కొనొచ్చు.

Most from this category