News


ఒకటా, రెండా, ఎన్ని డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ?

Monday 25th November 2019
personal-finance_main1574653371.png-29824

  • ధీరేంద్ర కుమార్‌ సీఈవో వాల్యూ రీసెర్చ్‌ 

ప్ర: నేను గత కొంత కాలంగా కెనర రొబెకో  ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా ? నేను 15-20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇన్నేళ్లు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
-కిన్నెర, విశాఖపట్టణం 

జ: కెనర రొబెకొ ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌... గత కొంత కాలంగా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఈ కేటగిరీలో నిలకడైన పనితీరు కనబరుస్తున్న మంచి ఫం‍డ్స్‌లో ఇది కూడా ఒకటి. అందుకని 15-20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు మంచి ఫండ్‌నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇన్నేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులున్నా మీ సిప్‌లు అపకూడదు. మార్కెట్‌ పతనమై ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నా. మీ పెట్టుబడులను ఆపకండి. రెండోది కనీసం ఏడాదికొక్కసారైన మీ సిప్‌ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. మూడోది ముఖ్యమైనది... కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ ఫండ్‌ పనితీరును మదింపు చేయడం. ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, సిప్‌లు కొనసాగించండి. ఆశించిన స్థాయిలో లేకుంటే ఈ కేటగిరీలోనే మంచి పనితీరును కనబరుస్తున్న మరో ఫండ్‌ను మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. 

ప్ర: నేను అల్ట్రా-షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఒకే ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? లేక రెండు-మూడు ఫండ్స్‌ను ఎంచుకోమంటారా ?ఒక ఫండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ వివరాలను ఎలా అర్థం చేసుకోవాలి. ?
-ఈశ్వర్‌, తిరుపతి 

జ: మీరు మూడు నెలల నుంచి ఏడాది కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్రా షార్ట్‌-డ్యూరేషన్‌ ఫండ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేసేది పెద్ద మొత్తమైతే, రెండు వేర్వేరు ఫండ్‌ హౌస్‌లకు సంబంధించిన రెండు ఫం‍డ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. చిన్న మొత్తమైతే ఒక ఫండ్‌ సరిపోతుంది. ఒక సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఆ కంపెనీ రుణ చెల్లింపుల అంచనాలకు సంబంధించిన క్రెడిట్‌ రిస్క్‌ను క్రెడిట్‌ రేటింగ్‌ మనకు వెల్లడిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒక కంపెనీ రుణ సాధనాలకు రేటింగ్‌ను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇస్తుంది. ఆల్ట్రా షార్ట్‌-డ్యురేషన్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలు గమనంలో ఉంచుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌... డబల్ ఏ (ఏఏ), అంతకంటే దిగువ రేటింగ్‌ ఉన్న సాధనాల్లో తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్‌ చేసి ఉండాలి. రెండో విషయం డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇటీవలి పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. కనీసం మూడేళ్ల పనితీరును పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్‌ చేయాలి. సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. డెట్‌ ఫం‍డ్స్‌ విషయంలో  ఇది సరైన నిర్ణయం కాదు. అధిక రాబడులు ఉన్నాయంటే, రిస్క్‌ కూడా అధికంగానే ఉందని అర్థం. ఇలాంటి ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌కు భద్రత కూడా ముఖ్యమైన విషయమే కదా ! 

ప్ర: నేను ప్రతి నెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఫండ్స్‌లో గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా ? డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా ?  తగిన సలహా ఇవ్వండి. 
-కిరణ్‌, నెల్లూరు 

జ: 2018 బడ్జెట్‌కు ముందు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా ? డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా అనే విషయానికి ప్రాధాన్యత అధికంగానే ఉండేది. ఇన్వెస్టర్‌ వయస్సు, ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తం, ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తారు...ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని పెద్ద కసరత్తే చేసి నిర్ణయం తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం రెండు రకాల ప్లాన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరూ డివిడెండ్‌ ప్లాన్‌ల జోలికి వెళ్లడం లేదు. గతంలో ఎలా ఉండేదంటే, మీరు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం పాటు కొనసాగించి ఉంటే, మీకు వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉండేది కాదు. అలాగే డివిడెండ్లపై కూడా ఎలాంటి పన్నులు ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం 10 శాతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీని) చెల్లించాల్సి ఉంటుంది. మీరు డివిడెండ్‌ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు వచ్చే రాబడుల్లో 10 శాతం తగ్గుతాయి. ఉదాహరణకు ఒక ఫండ్‌ రూ.10 డివిడెండ్‌ ప్రకటించిదనుకోండి. మీకు రూ.9 మాత్రమే వస్తుంది. అందుకని డివిడెండ్‌ ప్లాన్‌ను కాకుండా గ్రోత్‌ ప్లాన్‌ను ఎంచుకోండి.  



You may be interested

రిస్క్‌ తక్కువ.. చక్కని రాబడులు

Monday 25th November 2019

యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25 ఏడాది కాలంగా అనిశ్చితులతో ట్రేడ్‌ అయిన ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు స్థిరమైన ర్యాలీ బాటలో ఉన్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ నూతన గరిష్టాలకు చేరువయ్యాయి. కానీ పరిశీలించి చూస్తే స్టాక్స్‌ పనితీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్‌ మాత్రమే ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తుండగా, అధిక శాతం లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వెనుకబడే ఉంటున్నాయి. మార్కెట్‌

మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో

Monday 25th November 2019

హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్‌ డీల్‌తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్‌ కంపెనీ అయిన సాండోజ్‌ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబరులో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050-1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్‌ తెలిపారు. గత మూడు

Most from this category