News


మల్టీక్యాప్‌లో సుదీర్ఘ రాబడుల చరిత్ర

Monday 5th August 2019
news_main1564990388.png-27541

  • మల్టీక్యాప్‌లో సుదీర్ఘ రాబడుల చరిత్ర
  • హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌

లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్‌న అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు చాలా కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ నాలుగేళ్ల కాలలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్‌క్యాప్‌ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్‌ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా లార్జ్‌, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే మల్టీక్యాప్‌ ఫండ్స్‌. ఇక ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు కూడా చూపుతున్న పథకాల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. 

రాబడులు...
ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్‌ మార్క్‌ అయిన బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. ఏడాదిలో 4.11 శాతం రాబడులను ఇవ్వగా, బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ 3.89 శాతం నష్టపోయింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం 10.31 శాతం వార్షిక రాబడులను, ఐదేళ్ల కాలంలో 9.34 శాతం, పదేళ్లలో 13.48 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలితాన్ని ఇన్వెస్టర్లకు ఇచ్చింది. బీఎస్‌ఈ 500టీఆర్‌ఐ రాబడులు మూడేళ్లలో 8.89 శాతం, ఐదేళ్లలో 9.31 శాతం, పదేళ్లలో 11 శాతంగానే ఉండడం గమనార్హం. ఈ పథకం ఆరంభం నుంచి చూసుకున్నా కానీ 18.51 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకం ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసి అలాగే కొనసాగించి ఉంటే 25 ఏళ్లలో రూ.58,80,217 అయి ఉండేది. కాంపాండెడ్ వార్షిక వృద్ధి రేటు 17.9 శాతం. ఇక ప్రతీ నెలా రూ.10,000ను సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చి ఉంటే ఇప్పటికి రూ.7,57,01,964 సమకూరి ఉండేది. 

పెట్టుబడుల విధానం...
హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ 1995 జనవరి 1న ఆరంభమైంది. ఈ పథకానికి దేశ ఈక్విటీ మార్కెట్లో 24 ఏళ్ల సుదీర్ఘ ట్రాక్‌ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.23,500 కోట్లుగా ఈ ఏడాది జనవరి నాటికి ఉన్నాయి. గత మూడు మార్కెట్‌ సైకిల్స్‌లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వె‍స్ట్‌ చేయడం ద్వారా గత 24 ఏళ్లలో ఎన్నో మార్కెట్‌ కాల పరీక్షలను ఎదుర్కొని నిలిచింది. 1995లో ఐటీ రంగంలో ఇన్వెస్ట్‌ చేసింది. దీంతో 1995-2000 మధ్య కాలంలో అద్భుత రాబడులు పంచింది. 2000-08 అలాగే, 2008-18 మధ్య ఆటో, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌పై అధిక వెయిటేజీని కలిగి ఉంది. ర్యాలీ చేసే రంగాలను ముందుగానే గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ ఇంత చక్కని పనితీరును చూపిస్తోంది. బలమైన, వృద్ధి చెందే అవకాశాలున్న కంపెనీలు, భిన్న రంగాల్లో డైవర్సిఫికేషన్‌ ద్వారా రిస్క్‌ తగ్గించే చర్యలు ఈ పథకం పనితీరులో భాగం. ఫండ్‌ పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌ 2018-19కు 18 శాతంగానే ఉంది. అంటే ఇంత తక్కువగా ఉండడం దీర్ఘకాలిక పెట్టుబడులపై ఎక్కువగా దృష్టి పెట్టి, పోర్ట్‌ఫోలియోలో మార్పులు తక్కువకు పరిమితం చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కార్పొరేట్‌ బ్యాంకులు, ఇండస్ట్రియల్స్‌, ఎనర్జీ, యుటిలిటీలు, ఐటీ రంగాలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో సిప్‌ మార్గంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 



You may be interested

గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్‌ చేయోచ్చా?

Monday 5th August 2019

ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  ​​​​​​​ ప్ర: గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (జీఎఫ్‌ఓఎఫ్‌)లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో నెలకు కొంత మొత్తాన్ని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆరేళ్ల వయస్సున్న నా చిన్నారికి పెళ్లి కానుకగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఇవ్వాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?  -ఆనంద్‌, హైదరాబాద్‌ : సాధారణంగా పుత్తడిని రెండు మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. ఒకటి ఆభరణాలు/బిస్కెట్ల రూపంలో. మరొక మార్గం గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌

సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా...

Monday 5th August 2019

పన్నులూ...మినహాయింపులూ స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలకు 80సీ కింద మినహాయింపు రూ.50 లక్షలు మించితే టీడీఎస్‌ 1 శాతం కోత ఎన్‌ఆర్‌ఐ నుంచి కొనుగోలు చేస్తే టీడీఎస్‌ తప్పనిసరి బహుమతి రూపంలో పొందినా పన్ను కాకపోతే రక్త సంబంధీకులకు మినహాయింపు రుణం తీసుకుని ఇంటిని కొంటే ప్రయోజనాలు అసలు, వడ్డీ చెల్లింపులకు మినహాయింపులు రెండు ఇళ్లకు మించి ఉంటే అద్దెపై పన్ను సొంతిల్లున్నా, హెచ్‌ఆర్‌ఏపైనా పన్ను ప్రయోజనం ఇలా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో... సొంతిల్లు చాలా మంది స్పప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఙాపకాలను మధురంగా పరిగణించే

Most from this category