News


ఈ స్టాక్స్‌ మీకు నచ్చుతాయా..?

Tuesday 12th November 2019
personal-finance_main1573498734.png-29511

దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల నిర్వహణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అక్టోబర్‌ మాసంలో ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వరంగ సంస్థలు, ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఐటీసీలో కోటి షేర్లు, అలాగే, ఎన్‌హెచ్‌పీసీలోనూ కోటి షేర్ల చొప్పున కొనుగోలు చేసింది. ఇంకా ఇతర కొనుగోళ్లను పరిశీలించినట్టయితే...

 

ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, ఆర్‌ఈసీ, బజాజ్‌ కార్ప్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, నైవేలీ లిగ్నయిట్‌, సిప్లా, అంబుజా సిమెంట్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, టెక్స్‌మాకో రైల్‌, టాటా స్టీల్‌, లుపిన్‌, అరబిందో ఫార్మా, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, జేకుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అక్టోబర్‌లో పెట్టుబడులు పెట్టినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ కంపెనీల్లో ఒక్కోదానిలో 2.5-95 లక్షల మధ్య షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా (18 లక్షల షేర్లు), ఎల్‌అండ్‌టీ (11 లక్షల షేర్లు), దిలీప్‌ బిల్డ్‌కాన్‌ (6.51 లక్షల షేర్లు), పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ (3.89 లక్షల షేర్లు), సన్‌ ఫార్మా (23 లక్షల షేర్లు), గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ (21 లక్షల షేర్లు), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (20 లక్షల షేర్లు), గెయిల్‌ (19 లక్షల షేర్లు), ఇండియన్‌ హోటల్స్‌ (19 లక్షల షేర్లు), డెల్టాకార్ప్‌ (17 లక్షల షేర్లు), కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ (16 లక్షల షేర్లు), మిశ్రధాతు నిగమ్‌ (16 లక్షల షేర్లు) కంపెనీల్లో వాటాలను తన పోర్ట్‌ఫోలియో కోసం కొనుగోలు చేసింది. 

 

లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఈ ఫండ్‌ సంస్థ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 6 లక్షల షేర్లు, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో 3.87 లక్షల షేర్లు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యస్‌ బ్యాంకులోనూ వాటాలను కొనుగోలు చేసింది. అలాగే, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంఅండ్‌ఎం, టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లను కూడా కొంత మేర యాడ్‌ చేసుకుంది. ఇక ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బీహెచ్‌ఈఎల్‌ ఒక్కోదానిలో కోటి షేర్లకు పైగా విక్రయించేసింది. ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సెయిల్‌, అశోక్‌లేలాండ్‌, అదానీ పవర్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, వేదాంత కంపెనీల్లో 10 లక్షల చొప్పున వాటాలను అమ్మేసింది. You may be interested

పరిశ్రమలు రివర్స్‌ గేర్‌

Tuesday 12th November 2019

సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం క్షీణత 2011 అక్టోబర్‌లో 5 శాతం మైనస్‌ మళ్లీ ఇప్పుడు అదే తీవ్రత వరుసగా రెండు నెలలుగా నిరాశ ‘మౌలికం’సహా కీలకరంగాలన్నీ మైనస్‌లోనే... న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పటింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం- 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో

వీటికి ‘సెల్‌’ రేటింగ్‌ కొనసాగింపు

Tuesday 12th November 2019

ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం మూడు స్టాక్స్‌కు సెల్‌ రేటింగ్‌ కొనసాగించాయి. కాకపోతే గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను పెంచడం వీటికి కాస్తంత ఉపశమనం.    ఇప్కా ల్యాబొరేటరీస్‌ సీఎల్‌ఎస్‌ఏ ఈ స్టాక్‌కు విక్రయించండి (సెల్‌) రేటింగ్‌ను కొనసాగించింది. కాకపోతే గతంలో టార్గెట్‌ కింద రూ.810 ఇవ్వగా, తాజాగా దీన్ని రూ.950కు పెంచింది. నిర్వహణ ప్రయోజనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేస్తోంది. కార్పొరేట్‌ పన్ను భారీ

Most from this category